పీపుల్ మీడియా ఫ్యాక్టరీ , కోన ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్స్ పై హేమంత్ మధుకర్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ అనుష్క ప్రధాన పాత్రలో ఇంగ్లీష్, తెలుగు, తమిళ భాషలలో రూపొందిన థ్రిల్లర్ మూవీ నిశ్శబ్దం పూర్తిగా US లో షూటింగ్ జరుపుకుంది. మాధవన్, అంజలి, షాలిని పాండే, మైకేల్ మ్యాడ్సన్ , సుబ్బరాజు, శ్రీనివాస్ అవసరాల ముఖ్య పాత్రలలో నటించారు. గోపిసుందర్ సంగీతం అందించారు. అనుష్క
మ్యూట్ ఆర్టిస్ట్ గా నటించిన ఈ మూవీ తెలుగు లో నిశ్శబ్దం, ఇతర భాషలలో సైలెన్స్ గా రిలీజ్ కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
నిశ్శబ్దం మూవీ లో బధిర యువతి గా నటించిన అనుష్క , తన క్యారెక్టర్ పర్ఫెక్షన్ కై పలువురు బధిరులను కలసి అంకితభావం తో సైన్ లాంగ్వేజ్ నేర్చుకున్నారు. ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ వద్ద పెయింటింగ్ వర్క్ నేర్చుకొన్న అనుష్క షూటింగ్ టైమ్ లో పలు అందమైన పెయింటింగ్స్ రూపొందించారు. ఆ పెయింటింగ్స్ ను మూవీ ప్రమోషన్స్ లో ప్రదర్శించాలని నిర్మాత కోన వెంకట్ ప్లాన్ చేశారు. బ్లాక్ బస్టర్ మూవీ భాగమతి తరువాత అనుష్క నటించిన నిశ్శబ్దంమూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























