ప్రముఖ హాస్యనటుడు వేణుమాధవ్ కన్నుమూత

Famous Telugu Comedian Venu Madhav Is No More,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Venu Madhav Latest News,Venu Madhav Lost His Life,Venu Madhav Passes Away,Comedian Venu Madhav Passed Away,Venu Madhav Demise News,#RIPVenuMadhav

తెలుగు ఇండస్ట్రీలో స్టార్ కామెడియన్లలో ఒకరైన వేణు మాధవ్ ఈ రోజు తుది శ్వాస వదిలారు. గతకొద్ది రోజులుగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న వేణు మాధవన్ నిన్న రాత్రి తీవ్ర అస్వస్థతకు గురవ్వడంతో సికింద్రాబాద్ లోని యశోద హాస్పిటల్ కి తీసుకెళ్లగా అక్కడ చికిత్స పొందుతూ ఈ రోజు మధ్యాహ్నం కన్నుమూశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

1979లో సూర్య పేట్ జిల్లాలో కోదాడ మండలంలో జన్మించిన ఆయన నాల్గవ ఏట నుండే మిమిక్రీ ఆర్టిస్ట్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. 1997లో ఎస్వీ కృష్ణారెడ్డి డైరెక్ట్ చేసిన ‘సంప్రదాయం’ చిత్రం ద్వారా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు వేణుమాధవ్. ‘తొలిప్రేమ’ సినిమాతో కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయనకు.. ‘లక్ష్మీ’ సినిమాకి ఉత్తమ హాస్య నటుడిగా నంది అవార్డు అందుకున్నారు. అంతే కాదు కామెడియన్ గా మాత్రమే కాకుండా ‘హంగామా’ సినిమాతో హీరోగా పరిచయం అయిన ఆయన ఆ తర్వాత తానే నిర్మాతగా, కథానాయకుడిగా ‘భూకైలాస్’, ‘ప్రేమాభిషేకం’ చిత్రాలు నిర్మించారు. వేణుమాధవ్ దాదాపు నాలుగువందల చిత్రాలలో నటించారు. అతడికి భార్య శ్రీవాణి ఇద్దరు పిల్లలు ఉన్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.