కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నాగార్జున హీరోగా వచ్చిన ‘సోగ్గాడే చిన్ని నాయన’ సినిమా ఎంత మంచి హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఈ సినిమా సీక్వెల్ ను కూడా తీయాలని ఎప్పటినుండో ప్లాన్ చేస్తున్నారు. నాగచైతన్య ప్రస్తుతం వెంకీమామ సినిమాతో బిజీ గా ఉన్నాడు. నాగార్జున మొన్నటివరకూ మన్మథుడు2 సినిమాతో బిజీగా ఉన్నాడు. అయితే ఇప్పుడు నాగార్జున మన్మథుడు2 సినిమా రిలీజ్ అయిపోయింది. నాగ చైతన్య సినిమా వెంకీమామ ముగింపుదశకు వచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
దీనితో కళ్యాణ్ కృష్ణ ఇప్పుడు సీక్వెల్ తీయడానికి రెడీ అయినట్టు తెలుస్తుంది. ఇక తాజా సమాచారం ఇప్పటికే మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ తో పాటల కంపోసిషన్ చేస్తున్నాడట. త్వరలోనే ఈ సినిమాను లాంఛనంగా ప్రారంభించి.. వచ్చే ఏడాది సెట్స్ పైకి తీసుకెళ్లనున్నట్టు తెలుస్తుంది. మరిన్ని విషయాలు త్వరలోనే తెలియజేయనున్నారు. మరి సీక్వెల్స్ మన టాలీవుడ్ లో కలిసిరావు అని ఎన్నో సీక్వెల్స్ ప్రూవ్ చేశాయి. రీసెంట్ గా వచ్చిన మన్మథుడు సీక్వెల్ మన్మథుడు 2 సినిమానే ఉదాహరణ. మరి ఇప్పుడు ‘సోగ్గాడే చిన్ని నాయన’ కు సీక్వెల్ గా చేస్తున్నారు. మరి ఈ సీక్వెల్ అయినా కలిసొస్తుందో..? లేదో..? చూద్దాం..
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: