మ్యూజిక‌ల్ హిట్‌ ‘శ్రీ‌నివాస క‌ళ్యాణం’ 32 ఏళ్ళు

#SrinivasaKalyanam, 32 Years For Musical Hit Srinivasa Kalyanam, Latest Telugu Movies News, Srinivasa Kalyanam Movie Completes 32 Years, Srinivasa Kalyanam Movie Updates, Srinivasa Kalyanam Telugu Movie Completed 32 Years For Today, Srinivasa Kalyanam Telugu Movie Latest News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates

“నిజ‌మైన ప్రేమ‌… ప్రేమించేవారి సంతోషాన్ని కోరుకుంటుంది. వారి కోసం ఏమైనా చేసేలా ప్రేరేపిస్తుంది”… ఇలా ఆలోచించే ఓ పాత్ర చుట్టూ తిరిగే క‌థ‌తో రూపొందిన సినిమా ‘శ్రీ‌నివాస క‌ళ్యాణం’. విక్టరీ వెంకటేష్ కెరీర్‌లో ఏడో చిత్రంగా విడుదలై మంచి విజయం సాధించిన ఈ ముక్కోణపు ప్రేమకథలో భానుప్రియ, గౌత‌మి కథానాయిక‌లుగా న‌టించారు. ముఖ్యంగా… తను ప్రేమించిన బావ (వెంకటేష్) కోసం ఏమైనా చేసే స‌రోజ అలియాస్ స్వ‌ప్న‌ పాత్రలో గౌతమి అభిన‌యం ఈ సినిమాకి ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిల‌చింది. కోడి రామకృష్ణ దర్శకత్వం వ‌హించిన ఈ చిత్రంలో మోహన్‌బాబు, గొల్లపూడి మారుతీరావు, సుత్తి వేలు, ‘శుభలేఖ’ సుధాకర్, వంకాయల సత్యనారాయణ, వరలక్ష్మి, శ్రీలక్ష్మి, వై.విజయ తదితరులు ఇత‌ర‌ ముఖ్య భూమిక‌లు పోషించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

యువ చిత్ర ఆర్ట్స్ పతాకంపై పలు మ్యూజికల్ బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీస్‌ను నిర్మించిన నిర్మాత కాట్రగడ్డ మురారి… ఈ చిత్రాన్ని నిర్మించారు. వేటూరి సుందరరామమూర్తి, ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి, జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గీత ర‌చ‌న చేయ‌గా… దిగ్గ‌జ స్వ‌ర‌క‌ర్త‌ కె.వి.మహదేవన్ బాణీలు అందించారు. ఇందులోని పాట‌ల‌న్నీ విశేషాద‌ర‌ణ పొందాయి. ముఖ్యంగా ‘తుమ్మెద ఓ తుమ్మెద‌’, ‘ఎందాకా ఎగిరేవ‌మ్మా గోరింకా` గీతాలు ఎవ‌ర్‌గ్రీన్‌గా నిలిచాయి. 1987 సెప్టెంబ‌ర్ 25న విడుద‌లైన ‘శ్రీ‌నివాస క‌ళ్యాణం’.. నేటితో 32 వ‌సంతాల‌ను పూర్తిచేసుకుంటోంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve + 3 =