ట్యాగ్ · 2027 కథనాలు · పేజీ 67
వరుణ్ తేజ్ తో ‘దిల్’ రాజు హ్యాట్రిక్ ప్లాన్?
పూరీ సినిమా కోసం మార్షల్ ఆర్ట్స్ శిక్షణ..!
గీతా ఆర్ట్స్ వెబ్ సిరీస్ లో నాగ్ హీరోయిన్..!
RDX లవ్ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్
ఆవిరి మూవీ టీమ్ కు ఆల్ ది బెస్ట్
'మిస్ ఇండియా తెలంగాణ'తో నితిన్..?
'అర్జున్ సురవరం' కు డేట్ దొరికేసిందంటున్న నిఖిల్..!

కాజల్ హాలీవుడ్ మూవీ టైటిల్ ది కాల్ సెంటర్ ?

గురుశిష్యుల చిత్రాల్లో మోహన్ బాబు
వరుస చిత్రాలతో బాలకృష్ణ సందడి
ఒకదానికొకటి సంబంధంలేని పాత్రల్లో పూజా హెగ్డే
'బెల్లంకొండ' కోసం ‘శ్రీనువైట్ల’ ఎదురుచూపులు
మొదటి నుండి భారీ బడ్జెట్ తో.. పెద్ద పెద్ద డైరెక్టర్స్ తో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా భారీ కమర్షియల్ సినిమాలు తీసినా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కు మాత్రం పెద్దగా సక్సెస్ రాలేదని చెప్పొచ్చు. అయితే రీమేక్ చేసిన సినిమాతో మాత్రం సక్సెస్ అందుకున్నాడు. తమిళ్ లో హిట్ అయిన 'రాచ్చసన్' సినిమాకు రీమేక్ గా తెలుగులో 'రాక్షసుడు' సినిమాను తీసి ఫైనల్ గా ఒక హిట్ కొట్టాడు.
వరుణ్ తేజ్ తో ‘దిల్’ రాజు హ్యాట్రిక్ ప్లాన్?
ఇటీవల విడుదలైన `గద్దలకొండ గణేష్’తో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. ఓ వైపు ఈ సినిమా సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తూనే... మరోవైపు తన తదుపరి చిత్రంపై దృష్టి సారిస్తున్నాడు ఈ యంగ్ హీరో. డెబ్యూ డైరెక్టర్ కిరణ్ కొర్రపాటి తెరకెక్కించబోతున్న ఈ స్పోర్ట్స్ డ్రామాలో బాక్సర్‌గా దర్శనమివ్వనున్నాడు వరుణ్. వచ్చే ఏడాది ప్రథమార్ధంలో ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే... తాజాగా మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌కి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట వరుణ్.
పూరీ సినిమా కోసం మార్షల్ ఆర్ట్స్ శిక్షణ..!
ఇటీవలే డియర్ కామ్రేడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండ ఇప్పుడు వరుస సినిమాలతో వచ్చేస్తున్నాడు. ప్రస్తుతం మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు ఫేమ్ క్రాంతి మాధవ్ కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రాశి ఖన్నా, ఐశ్వర్యా రాజేష్, ఇజాబెల్లి లీట్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఇందులో విజయ్ సింగరేణి ఉద్యోగిగా కనిపించనున్నాడని సమాచారం.
చరణ్ ను ఈడ్చుకెళ్లిన సీన్ - బాధపడిన 'చిరు' దంపతులు
బాహుబలి సినిమా తరువాత రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోల కాంబినేషన్ లో వస్తున్న భారీ బడ్జెట్ సినిమా 'ఆర్ఆర్ఆర్'. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. హైదరాబాదులోని రామోజీ ఫిల్మ్ సిటీలో కొన్ని ముఖ్యమైన సన్నివేశాలు చిత్రీకరించుచున్నారు.
గీతా ఆర్ట్స్ వెబ్ సిరీస్ లో నాగ్ హీరోయిన్..!
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఉన్న పెద్ద ప్రొడక్షన్ సంస్థలలో గీతా ఆర్ట్స్ కూడా ఒకటని మనకు తెలుసు. ఈ బ్యానర్ పై ఇప్పటికే ఎన్నో సినిమాలు తీయగా.. ఇప్పుడు డిజిటల్ ప్రపంచంలోకి కూడా అడుగుపెట్టనున్న సంగతి తెలిసిందే. ఆదర్శ్ బాలకృష్ణ ప్రధాన పాత్రలో గీత ఆర్ట్స్ బ్యానర్ పై ఈ వెబ్ సిరీస్ ను రూపొందించుచున్నారు.
మోహన్ లాల్ హిట్ సినిమా రైట్స్ సొంతం చేసుకున్న చెర్రీ..!
ఒక పక్కన సినిమాలు చేస్తూనే మరో పక్క ప్రొడక్షన్ లోకి కూడా అడుగుపెట్టాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ప్రస్తుతం రామ్ చరణ్ నిర్మాతగా చిరంజీవి హీరోగా సైరా సినిమా నిర్మించిన సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో.. భారీగా ఈ సినిమాను చెర్రీ రూపొందించాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్ 2వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందరానుంది.
RDX లవ్ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్
బ్లాక్ బస్టర్ RX 100 మూవీ లో తన అందం, అభినయం తో కుర్రకారును ఉర్రూతలూగించిన క్రేజీ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ ఇప్పుడు మరో మూవీ తో ప్రేక్షకులను అలరించనున్నారు. రామ్ మునీశ్ సమర్పణ లో హ్యాపీ మూవీస్ బ్యానర్ పై శంకర్ భాను దర్శకత్వంలో హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ ప్రధాన పాత్ర లో రూపొందిన RDX లవ్ మూవీ అక్టోబర్ 11 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ కి నిర్మాత సి .కళ్యాణ్, సహ నిర్మాత సి వి రావు.
ఆవిరి మూవీ టీమ్ కు ఆల్ ది బెస్ట్
దిల్ రాజు సమర్పణలో ఫ్లయింగ్ ఫ్రాగ్స్ బ్యానర్ పై రవి బాబు దర్శకత్వంలో రవి బాబు, నేహా చౌహాన్, భరణీ శంకర్, ముక్తార్ ఖాన్ ప్రధాన పాత్రలలో రూపొందిన థ్రిల్లర్ ఆవిరి మూవీ అక్టోబర్ నెలలో రిలీజ్ కానుంది. ఆవిరి మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ తో మూవీ పై ఆసక్తిని కలిగించిన నిర్మాత, దర్శకుడు రవి బాబు, అద్భుతమైన విజువల్స్ తో ప్రేక్షకులు థ్రిల్ ఫీలయ్యేలా స్పాట్ ది స్పిరిట్ అంటూ రూపొందించిన టీజర్ తో ఆవిరి మూవీ కి మరింత హైప్ తెచ్చారు.
కొరటాల శివ తర్వాత త్రివిక్రమ్ తోనే చిరు సినిమా..!
సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చిరు హీరోగా తెరకెక్కిన సైరా సినిమా గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. రామ్ చరణ్ ఈ సినిమాను నిర్మించారు.
'మిస్ ఇండియా తెలంగాణ'తో నితిన్..?
వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ హీరోగా భీష్మ సినిమా చేస్తున్న సంగతి తెలసిందే కదా. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమాను క్రిస్టమస్ పండుగ సందర్భంగా రిలీజ్ చేయనున్నారు. రష్మికా మందన కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాను... సితార ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై పీడీవీ ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు.
'అర్జున్ సురవరం' కు డేట్ దొరికేసిందంటున్న నిఖిల్..!
కోలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘కనితన్’ కి రీమేక్ గా తెలుగులో నిఖిల్ హీరోగా అర్జున్ సురవరం పేరుతో రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. టి.ఎన్ సంతోష్ దర్శకత్వం వహించిన ఈ సినిమా కొన్ని నెలల క్రితం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్ధమైంది. కానీ అప్పటినుండి ఇప్పటివరకు రిలీజ్ కు మాత్రం నోచుకోలేదు. మొదట మే అన్నారు.. ఆతర్వాత మళ్ళీ మార్చారు.. ఇక ఆతర్వాత మళ్ళీ ఈ సినిమా గురించి ఎలాంటి అప్ డేట్ లేదు.

కాజల్ హాలీవుడ్ మూవీ టైటిల్ ది కాల్ సెంటర్ ?
టాలీవుడ్ , కోలీవుడ్ లలో స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతున్న కాజల్ అగర్వాల్ ఒక హాలీవుడ్ మూవీ లో నటించనున్న విషయం తెలిసిందే జెఫ్రీ జీ చిన్ దర్శకత్వంలో కాజల్ హీరోయిన్ గా ఇంగ్లీష్ , తెలుగు భాషలలో రూపొందనున్న మూవీ కి టైటిల్ ది కాల్ సెంటర్ గా ఫిక్స్ చేసినట్టు సమాచారం. విష్ణు మంచు నిర్మాణ సారథ్యంలో రూపొందనున్న ఈ మూవీ తెలుగు వెర్షన్ లో విష్ణు మంచు హీరోగా నటిస్తారు. ఈ రొమాంటిక్ డ్రామా లో కాజల్ ఒక కొత్త లుక్ లో కనిపిస్తారని సమాచారం.
‘సరిలేరు నీకెవ్వరు’ ఇంట్రో సాంగ్‌లో తమన్నా
ఒక వైపు కథానాయికగా రాణిస్తూనే, మరోవైపు ప్రత్యేక గీతాల్లోనూ సందడి చేస్తోంది మిల్కీ బ్యూటీ తమన్నా. ఇప్పటికే పలు చిత్రాల్లో తన నృత్యాలతో మురిపించిన ఈ టాలెంటెడ్ బ్యూటీ... త్వరలో మరో క్రేజీ ప్రాజెక్ట్ కోసం స్పెషల్ సాంగ్‌లో ఆడిపాడనుంది.

గురుశిష్యుల చిత్రాల్లో మోహన్ బాబు
2019... దిగ్గజ నటుడు మోహన్ బాబుకు వెరీ స్పెషల్ ఇయర్. ఎందుకంటే... దాదాపు నాలుగు దశాబ్దాల విరామం అనంతరం మళ్ళీ స్ట్రయిట్ తమిళ పిక్చర్స్‌లో నటిస్తున్నారాయన. అంతేకాదు... భారీ చిత్రాలుగా తెరకెక్కుతున్న ఈ రెండు సినిమాలను కూడా గురుశిష్యులే డైరెక్ట్ చేస్తుండడం విశేషం.
వరుస చిత్రాలతో బాలకృష్ణ సందడి
`యన్టీఆర్` బయోపిక్ తరువాత స్వల్ప విరామం తీసుకున్న నటసింహ నందమూరి బాలకృష్ణ... ఇప్పుడు వరుస సినిమాలతో బిజీ కానున్నారు. ప్రస్తుతం కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో తన 105వ చిత్రాన్ని చేస్తున్న బాలయ్య... అది సెట్స్‌పై ఉండగానే యాక్షన్ మూవీస్ స్పెషలిస్ట్ బోయపాటి శ్రీనుతో తన 106వ సినిమాని, ఇస్మార్ట్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌తో తన 107వ చిత్రాన్ని చేసేందుకు ప్లాన్ చేసుకున్నారు. ఇక ఈ రెండు ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ లైన్‌లో ఉండగానే... ఇప్పుడు తన 108వ సినిమాకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు టాలీవుడ్ టాక్.
ఒకదానికొకటి సంబంధంలేని పాత్రల్లో పూజా హెగ్డే
పూజా హెగ్డే... టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్. వరుస విజయాలతో ముందుకు సాగుతున్న ఈ టాలెంటెడ్ బ్యూటీ... ప్రస్తుతం నాలుగు క్రేజీ ప్రాజెక్ట్స్‌లో నాయికగా నటిస్తోంది. అంతేకాదు... వీటిలో ఒకదానితో ఒకటి సంబంధం లేని పాత్రల్లో దర్శనమివ్వనుంది.

" రొమాంటిక్ " మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్
లావణ్య సమర్పణ లో పూరి టూరింగ్ టాకీస్ బ్యానర్ పై పూరి కనెక్ట్స్ (పూరి జగన్నాథ్, ఛార్మి ) నిర్మాణ సారథ్యంలో అనిల్ పాడూరి దర్శకత్వం లో పూరి జగన్నాథ్ తనయుడు పూరి ఆకాష్, కేతిక శర్మ జంటగా రూపొందుతున్న రొమాంటిక్ మూవీ షూటింగ్ లాంగ్ షెడ్యూల్ గోవా లో జరిగిన విషయంతెలిసిందే.మందిరా బేడి ,మకరంద పాండే, రమాప్రభ ముఖ్యపాత్రలలో నటిస్తున్నారు. సునీల్ కశ్యప్ సంగీతం అందించారు.

ప్రభాస్‌కు స్టార్‌డమ్ కట్టబెట్టిన ‘ఛత్రపతి’కు 14 ఏళ్ళు
“తనకోసం బతికేవాడు మనిషి, ప్రజల కోసం బతికేవాడు ఛత్రపతి” అనే కాన్సెప్ట్‌తో తెరకెక్కిన చిత్రం ‘ఛత్రపతి’. `బాహుబలి` సిరీస్‌తో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి కాంబినేషన్‌లో వచ్చిన తొలి సినిమా ఇది. ప్రభాస్‌కు స్టార్‌డమ్‌ను కట్టబెట్టిన ఈ పవర్ ప్యాక్డ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో శ్రియా శరన్ కథానాయికగా నటించింది. భానుప్రియ, షఫీ, ప్రదీప్ రావత్, కోట శ్రీనివాసరావు, అజయ్, సుప్రీత్ తదితరులు ముఖ్య భూమికలు పోషించగా... ఆర్తి అగర్వాల్, ముమైత్ ఖాన్ ప్రత్యేక గీతాల్లో నర్తించారు.

ఓవర్సీస్‌లో ‘అల వైకుంఠపురములో’కి సూపర్ బిజినెస్?
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘అల వైకుంఠపురములో’. స్టన్నింగ్ బ్యూటీ పూజా హెగ్డే నాయికగా నటిస్తున్న ఈ సినిమాని ఏస్ ఫిల్మ్ మేకర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కిస్తున్నాడు. `జులాయి`, `సన్నాఫ్ సత్యమూర్తి` వంటి విజయవంతమైన చిత్రాల తరువాత బన్నీ, త్రివిక్రమ్ కాంబోలో రూపొందుతున్న ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో టబు, జయరామ్, రాజేంద్రప్రసాద్, సుశాంత్, నివేదా పేతురాజ్, నవదీప్, సునీల్ ముఖ్య భూమికలు పోషిస్తున్నారు. కాగా... గీతా ఆర్ట్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ కు సంబంధించి... ఓవర్సీస్‌లో ప్రీ-రిలీజ్…

‘సరిలేరు నీకెవ్వరు’... ఓవర్సీస్ బిజినెస్ అప్ డేట్
సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి రూపొందిస్తున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. రష్మిక మందన్న కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ఓ కీలక పాత్రలో దర్శనమివ్వనున్నారు. రామబ్రహ్మం సుంకర, `దిల్` రాజు, మహేష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ కు... దేవిశ్రీ ప్రసాద్ బాణీలు అందిస్తున్నాడు.