ప్రభాస్‌కు స్టార్‌డమ్‌ కట్టబెట్టిన ‘ఛత్రపతి’కు 14 ఏళ్ళు

14 Years For Rajamouli And Prabhas High Voltage Action Thriller Chatrapathi,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Chatrapathi - The Prabhas Mass Entertainer Turns 14,Chatrapathi Movie Updates,Chatrapathi Telugu Movie Latest News,Chatrapathi Movie Completes 14 Years,14 Years Completed For Chatrapathi Movie,#Chatrapathi

“తనకోసం బతికేవాడు మనిషి, ప్రజల కోసం బతికేవాడు ఛత్రపతి” అనే కాన్సెప్ట్‌తో తెరకెక్కిన చిత్రం ‘ఛత్రపతి’. `బాహుబలి` సిరీస్‌తో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి కాంబినేషన్‌లో వచ్చిన తొలి సినిమా ఇది. ప్రభాస్‌కు స్టార్‌డమ్‌ను క‌ట్ట‌బెట్టిన ఈ పవర్ ప్యాక్డ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో శ్రియా శరన్ కథానాయికగా నటించింది. భానుప్రియ, షఫీ, ప్రదీప్ రావత్, కోట శ్రీనివాసరావు, అజయ్, సుప్రీత్ తదితరులు ముఖ్య భూమికలు పోషించగా… ఆర్తి అగర్వాల్, ముమైత్ ఖాన్ ప్ర‌త్యేక గీతాల్లో నర్తించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

స్వరవాణి కీరవాణి స్వరపరచిన బాణీలు ప్రేక్ష‌కుల‌ను అలరించాయి. ముఖ్యంగా “గుండు సూది”, “ఎ వచ్చి బిపై వాలే”, `న‌ల్ల‌నివ‌న్నీ నీళ్ళ‌నీ`, “సుమ్మా మాసురియా”, `గ‌ల గ‌ల‌` వంటి పాటలతో పాటు బ్యాక్ డ్రాప్‌లో వచ్చే “అగ్ని స్ఖ‌లన” గీతం కూడా విశేషాదరణ పొందింది. అంతేకాదు… ఉత్తమ సహాయనటి (భానుప్రియ), ఉత్తమ సంగీత దర్శకుడు (కీరవాణి) విభాగాలలో రెండు `నంది` పురస్కారాలను కూడా కైవసం చేసుకుంది `ఛ‌త్ర‌ప‌తి`. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మించిన ఈ బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీని… కన్నడంలో ‘ఛత్రపతి’ పేరుతోనూ, బెంగాలీలో ‘రెఫ్యూజి’గానూ పునర్నిర్మించారు. 2005 సెప్టెంబర్ 30న విడుదలైన ‘ఛత్రపతి’… నేటితో 14 వసంతాలను పూర్తి చేసుకుంటోంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen + eight =