ట్యాగ్ · 2027 కథనాలు · పేజీ 66
మెగాస్టార్ చిరంజీవి ‘మాస్టర్’కు 22 ఏళ్ళు
బెల్లంకొండ గణేష్ బాబు టాలీవుడ్ ఎంట్రీ

25 గెటప్స్ లో స్టార్ హీరో చియాన్ విక్రమ్
ప్రతి రోజూ పండగే రాజమండ్రి షెడ్యూల్ పూర్తి
రామోజీ ఫిల్మ్ సిటీలో `అఖిల్-4`

పుష్కరకాలం పూర్తి చేసుకున్న ‘హ్యాపీడేస్’

వెంకటేష్ ‘సుందరకాండ’కు 27 ఏళ్ళు
'సరిలేరు నీకెవ్వరు' కామెడీ అంతకుమించి..!
దళపతి వర్సెస్ మక్కళ్ సెల్వన్
వెకేషన్, యాడ్ షూటింగ్ కై మహేష్ బాబు విదేశ ప్రయాణం

రోహిత్ శెట్టి చేతిలోకి గీత గోవిందం రీమేక్ రైట్స్

2020 పొంగల్‌కి మూడు ఆసక్తికరమైన చిత్రాలు
నవంబర్‌లో రానున్న విశాల్ ‘యాక్షన్’?
మరోసారి పోలీస్ ఆఫీసర్‌గా మాస్ మహారాజా?
బోయపాటి క్లాప్ తో గోపీచంద్ 28 మూవీ ప్రారంభం
BVSN ప్రసాద్ సారథ్యం లో శ్రీ వెంకటేశ్వర సినీచిత్ర బ్యానర్ పై రూపొందిన ఛత్రపతి, డార్లింగ్, సాహసం, అత్తారింటికి దారేది, నాన్నకు ప్రేమతో, తొలిప్రేమ మూవీస్ ఘనవిజయం సాధించాయి. ఆ బ్యానర్ పై సంపత్ నంది దర్శకత్వంలో ఈరోజు హైదరాబాద్ లో గోపీచంద్ 28 మూవీ షూటింగ్ ప్రారంభమయింది. సక్సెస్ ఫుల్ మూవీ సాహసం తరువాత ఆ బ్యానర్ లో హీరో గోపీచంద్ నటిస్తున్న రెండవ మూవీ.
మెగాస్టార్ చిరంజీవి ‘మాస్టర్’కు 22 ఏళ్ళు
మెగాస్టార్ చిరంజీవి, మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కాంబినేషన్‌లో పలు విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. వాటిలో ‘మాస్టర్’ ఒకటి. సురేష్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో చిరుకి జోడిగా సాక్షి శివానంద్, రోషిణి నటించగా పునీత్ ఇస్సార్, సత్యప్రకాష్, విజయ్ కుమార్, వేణుమాధవ్, శివాజీ, బండ్ల గణేష్, తిరుపతి ప్రకాష్ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు.
తెలుగు సినిమా నిర్మాణ ప్రమాణాలకు మరో గ్రేట్ ఎగ్జాంపుల్ సైరా
ఇలాంటి మహత్తర, బృహత్తరమైన ప్రాజెక్ట్స్ లో ఒకటీ అరా లోపాలు కనిపించినప్పటికీ వాటిని రంధ్రాన్వేషణ దృష్టితో కాకుండా పాజిటివ్ కోణంలో చూసి అభినందించాలే కానీ ఇలాంటి అరుదైన ప్రయత్నాలను రేటింగుల రేసులోకి లాగటం సమంజసం కాదు. Sye Raa is Truly a Proud film that deserves an Unconditional Appreciation.
బెల్లంకొండ గణేష్ బాబు టాలీవుడ్ ఎంట్రీ
ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ రెండవ తనయుడు, హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సోదరుడు బెల్లంకొండ గణేష్ బాబు హీరోగా టాలీవుడ్ ఎంట్రీ కి రంగం సిద్ధం అయింది. లక్ష్మీ నరసింహా, శంభో శివ శంభో, కందిరీగ, జబర్దస్త్, బస్ స్టాప్ వంటి సక్సెస్ ఫుల్ మూవీస్ నిర్మాత బెల్లంకొండ సురేష్ భారీ బడ్జెట్ తో VV వినాయక్ దర్శకత్వంలో రూపొందిన అల్లుడు శీను మూవీ తో బెల్లం కొండ సాయి శ్రీనివాస్ ను టాలీవుడ్ కు హీరో గా పరిచయం చేశారు.ఇప్పుడు తన రెండవకుమారుడు నిర్మాత బెల్లంకొండ గణేష్ బాబు ను ఎంటర్ చేస్తున్నారు.

25 గెటప్స్ లో స్టార్ హీరో చియాన్ విక్రమ్
విభిన్న పాత్రలలో ప్రయోగాత్మక చిత్రాలలో నటించే తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ దేశం గర్వించదగ్గ గొప్పనటుడు. తమిళం తో పాటు తెలుగు లో కూడా సమాన మార్కెట్ ఉన్న హీరో విక్రమ్ తాను నటించే మూవీ లో పాత్రకు తగ్గట్టుగా శరీర ఆకృతి ని మార్చుకునే ప్రతిభావంతుడు. ఇప్పుడు తన 58 వ మూవీ కి విక్రమ్ సిద్ధమవుతున్నారు. హీరో విక్రమ్ ప్రస్తుతం 300కోట్ల భారీ బడ్జెట్ తో తమిళ, మలయాళ, హిందీ భాషలలో రూపొందుతున్న మహావీర్ కర్ణ మూవీ లో కర్ణుడు గా నటిస్తున్నారు.
ప్రతి రోజూ పండగే రాజమండ్రి షెడ్యూల్ పూర్తి
అనిల్ రావిపూడి దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్, రాశీ ఖన్నా జంటగా రూపొందిన సుప్రీమ్ మూవీ ఘనవిజయం సాధించి ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. వారిద్దరూ జంటగా మరోసారి ప్రేక్షకులను అలరించనున్నారు. మహానుభావుడు, భలే భలే మగాడివోయ్ వంటి సూపర్ హిట్ మూవీస్ దర్శకుడు మారుతి దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ 2, UV క్రియేషన్స్ బ్యానర్స్ పై సాయి ధరమ్, రాశీ జంటగా పల్లెటూరి నేపథ్యం లో ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ప్రతి రోజూ పండగే మూవీ రూపొందుతుంది.
రామోజీ ఫిల్మ్ సిటీలో `అఖిల్-4`
అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంటగా `బొమ్మరిల్లు` భాస్కర్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని బన్నీ వాస్, వాసు వర్మ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన చిత్రీకరణ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది.
ఎ. కోదండరామిరెడ్డి డబుల్ ధమాకా ‘రాక్షసుడు’, ‘ఒక రాధ ఇద్దరు కృష్ణులు’కు 33 ఏళ్ళు
1986 అక్టోబర్ 2... దిగ్గజ దర్శకుడు ఎ.కోదండరామిరెడ్డి కెరీర్‌లో ప్రత్యేకమైన రోజు. ఎందుకంటే... ఇదే రోజున తన దర్శకత్వంలో రూపొందిన రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ రిలీజై మ్యూజికల్ హిట్స్‌గా నిలిచాయి. వాటిలో ఒకటి మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటించిన ‘రాక్షసుడు’ కాగా... మరొకటి యూనివర్సల్ హీరో కమల్ హాసన్ నటించిన ‘ఒక రాధ ఇద్దరు కృష్ణులు’.

పుష్కరకాలం పూర్తి చేసుకున్న ‘హ్యాపీడేస్’
ఫీల్ గుడ్ మూవీస్ కి కేరాఫ్ అడ్రస్ గా నిలిచే దర్శకుల్లో శేఖర్ కమ్ముల ఒకరు. ‘ఆనంద్’, ‘గోదావరి’ వంటి ఫీల్ గుడ్ మూవీస్ తెరకెక్కించి యువతతో పాటు కుటుంబ ప్రేక్షకులను కూడా ఆకట్టుకున్న ఈ సెన్సిబుల్ డైరెక్టర్ చేసిన తదుపరి ప్రయత్నమే ‘హ్యాపీడేస్’. కళాశాల నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రంలో కాలేజీ లైఫ్‌తో పాటు... అందులోని స్నేహాలను, ప్రేమలను తనదైన శైలిలో వెండితెరపై ఆవిష్కరించారు శేఖర్. అమిగోస్ క్రియేషన్స్ బ్యానర్‌పై శేఖర్ కమ్ముల నిర్మించిన ఈ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌లో... వరుణ్ సందేశ్, తమన్నా, నిఖిల్ సిద్ధార్థ్, గాయత్రిరావు, రాహుల్, సోనియా దీప్తి, వంశీ చాగంటి, మొనాలి చౌదరి ప్రధాన పాత్రలు పోషించగా... తమన్నా…
మహాత్మ గాంధీ శతజయంతికి విడుదలైన ‘మనుషులు మారాలి’కి అర్ధ శతాబ్దం
అలనాటి మేటి నటి శారదకు జాతీయస్థాయిలో `ఉత్తమ నటి`గా గుర్తింపునిచ్చిన మలయాళ చిత్రం ‘తులాభారం’. పేదరికం వల్ల... పెంచే స్థోమత లేక కన్నపిల్లల్నే చంపుకున్న ఓ తల్లి కథే ఈ సినిమా. మలయాళంలో ఘనవిజయం సాధించిన ఈ చిత్రాన్ని తెలుగులో ‘మనుషులు మారాలి’ పేరుతో రీమేక్ చేశారు దర్శకుడు వి.మధుసూదనరావు. శోభన్‌బాబు, శారద జంటగా నటించిన ఈ సినిమాలో హరనాథ్, కాంచన, గుమ్మడి వెంకటేశ్వరరావు ముఖ్య భూమికలు పోషించారు.

వెంకటేష్ ‘సుందరకాండ’కు 27 ఏళ్ళు
విక్టరీ వెంకటేష్, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు కాంబినేషన్‌లో తెరకెక్కిన పలు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ వర్షం కురిపించాయి. వాటిలో ‘సుందరకాండ’ ఒకటి. తమిళ చిత్రం ‘సుందరకాండం’కు రీమేక్‌గా రూపొందిన ఈ సినిమాలో వెంకటేష్‌కు జోడిగా మీనా నటించగా... అపర్ణ కీలక పాత్ర పోషించింది. గొల్లపూడి మారుతీరావు, బ్రహ్మానందం, మల్లికార్జునరావు, కోట శ్రీనివాసరావు, నిర్మలమ్మ ముఖ్య భూమికలు పోషించారు.
'భారతీయుడు2' - అజయ్ దేవగన్ అవుట్.. అనిల్ కపూర్ ఇన్..?
శంకర్ దర్శకత్వంలో విలక్షణ నటుడు కమల్ హాసన్ హీరోగా తెరకెక్కిన 'భారతీయుడు' సినిమా ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దాదాపు 23 ఏళ్ళ తర్వాత ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ 'భారతీయుడు2' ను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది.
'సరిలేరు నీకెవ్వరు' కామెడీ అంతకుమించి..!
అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా తెరకెక్కుతున్న సినిమా సరిలేరు నీకెవ్వరు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక ఈ సినిమా కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న సంగతి కూడా తెలిసిందే. అయితే తాజా సమాచార ప్రకారం ఈ సినిమాలో కామెడీ మాత్రం ఎక్స్పెక్ట్ చేసినదానికంటే.. ఎక్కువగా ఉండబోతుందట.. ముఖ్యంగా సెకండాఫ్ లో మాత్రం ఆ డోస్ ఇంకా ఎక్కువగా ఉండబోతుందట.
దళపతి వర్సెస్ మక్కళ్ సెల్వన్
తమిళ్ స్టార్ హీరో దళపతి విజయ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక మక్కళ్ సెల్వన్ విజయ సేతుపతి కూడా అతి తక్కువ కాలంలోనే.. డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ ఓ రేంజ్ కు వెళ్ళాడు. ఇక వీళ్లిద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తే.. వీళ్ళిద్దరిని ఒకే స్క్రీన్ పై చూస్తే ఎలా ఉంటది. ఊహించుకుంటేనే చాలా థ్రిల్లింగ్ గా ఉంది కదా.. ఈ ఊహ నిజం కాబోతున్నట్టు తెలుస్తుంది.
వెకేషన్, యాడ్ షూటింగ్ కై మహేష్ బాబు విదేశ ప్రయాణం
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, AK ఎంటర్ టైన్ మెంట్, GMB ఎంటర్ టైన్ మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్స్ పై సూపర్ స్టార్ మహేష్ బాబు , రష్మిక జంటగా సక్సెస్ ఫుల్ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఫ్యామిలీ ఎంటర్ టైనర్ సరిలేరు నీకెవ్వరు మూవీ సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది.ఈ మూవీ లో లేడీ అమితాబ్ విజయశాంతి తో పాటు ప్రకాష్ రాజ్, నరేష్, సంగీత, రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్ , బ్రహ్మానందం, అనసూయ, ఆది పినిశెట్టి ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు.

రోహిత్ శెట్టి చేతిలోకి గీత గోవిందం రీమేక్ రైట్స్
పరుశురాం దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన కాంబినేషన్ లో వచ్చిన 'గీత గోవిందం' సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. అల్లు అరవింద్ మరియు బన్నీ వాసు నిర్మాతలుగా కేవలం 5 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా 130 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఇక ఇంత హిట్ అయిన సినిమానురీమేక్ చేయకుండా ఎలా ఉంటారు. ఇప్పటికే ఈ సినిమాను హిందీలో రీమేక్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.
మ్యూజికల్ బ్లాక్‌బస్టర్ ‘లైలా మజ్ను’కు 70 ఏళ్ళు
ప్రేమకథలకు, అందులోనూ విషాదాంత ప్రేమకథలకు చిరునామాగా నిలిచిన కథానాయకుడు మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు. అటువంటి నాగేశ్వరరావు నటించిన తొలి ప్రేమకథా చిత్రం ‘లైలా మజ్ను’. ఇంకా చెప్పాలంటే... తెలుగునాట ప్రేమకథా చిత్రాలకు నాంది పలికిన సినిమా ఇది. ఏఎన్నార్ మజ్నుగా, భానుమతి రామకృష్ణ లైలాగా దర్శనమిచ్చిన ఈ చారిత్రాత్మక చిత్రంలో... ముక్కామల, సి.ఎస్.ఆర్, కస్తూరి శివరావు, శ్రీరంజని, హేమలత తదితరులు ముఖ్య భూమికలు పోషించారు. భానుమతి హోమ్ బ్యానర్ భరణి పిక్చర్స్ పతాకంపై ఆమె భర్త పి.ఎస్.రామకృష్ణారావు నిర్మించి, తెరకెక్కించిన ఈ సినిమా... తెలుగుతో పాటు తమిళంలోనూ ఏక కాలంలో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది.

2020 పొంగల్‌కి మూడు ఆసక్తికరమైన చిత్రాలు
తెలుగువారికి సంక్రాంతి ఎలాగో... తమిళులకు పొంగల్ అలాగా. అందుకే... పొంగల్ టైమ్ లో వచ్చే మూవీస్ అంటే అక్కడ ప్రత్యేకమైన ఆసక్తి నెలకొంటుంది. ఈ నేపథ్యంలో... 2020 పొంగల్ సందర్భంగా కోలీవుడ్‌లో మూడు ఆసక్తికరమైన చిత్రాలు విడుదలకు సిద్ధమయ్యాయి.
నవంబర్‌లో రానున్న విశాల్ ‘యాక్షన్’?
కోలీవుడ్ స్టార్ విశాల్, సీనియర్ డైరెక్టర్ సి.సుందర్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘యాక్షన్’. మిల్కీ బ్యూటీ తమన్నా కథానాయికగా నటిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ ప్రస్తుతం చిత్రీకరణ చివరి దశలో ఉంది.
మరోసారి పోలీస్ ఆఫీసర్‌గా మాస్ మహారాజా?
“చావు నా కళ్ళ ముందు వున్నప్పుడు నా కళ్ళలో బెరుకు ఉండకూడదు... నా ముఖంలో చిరునవ్వు ఉండాలి... నా చేయి నా మీసం మీద ఉండాలి సర్” అంటూ ‘విక్రమార్కుడు’ సినిమాలో ఏసీపీ విక్రమ్ రాథోడ్‌గా నట విశ్వరూపం చూపించాడు రవితేజ. కాగా... ఇప్పుడు మరోసారి అటువంటి పాత్రలో దర్శనమివ్వడానికి సిద్ధపడుతున్నాడట ఈ మాస్ మహారాజా.