‘పెళ్లి చూపులు’ అనే సినిమాలో డీసెంట్‌గా కనిపించి.. అర్జున్ రెడ్డి సినిమాతో ఒక్కసారిగా తెలుగు ఇండస్ట్రీని షాక్ షేక్ చేసిన యంగ్ హీరో విజయ్ దేవరకొండ. ఇక ఆ తర్వాత ‘గీత గోవిందం’, ‘టాక్సీవాలా’ సినిమాతో వెంటవెంటనే హిట్ లు కొట్టి టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరో అయిపోయాడు. అంతేకాదు యూత్ లో విజయ్ దేవరకొండ భారీ స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇక ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్న విజయ్ నిర్మాత కూడా మారి సినిమాలు చేస్తున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఇప్పుడు విజయ్ కు మరో అరుదైన గౌరవం దక్కింది. నవంబర్ 20 నుండి 28 వరకు గోవాలో ఈ గోల్డెన్ జూబ్లీ ఇంటర్నేషన్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా అవార్డుల కార్యక్రమం జరగనుంది. ఇక ఈ సందర్భంగా విజయ్, రకుల్, రష్మిక మందన, నిత్యామీనన్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. అయితే ఈ కార్యక్రమంలో భాగంగా విజయ్, రకుల్ ఫిలిం క్రిటిక్ అనుపమ చోప్రా తో తమ సినీ జర్నీ గురించి.. దేశవ్యాప్తంగా వారు తమ పనితో ఎలా పలువురిని ప్రభావితం చేశారో అన్న విషయాలపై మాట్లాడనున్నారు. నిత్యా మీనన్, రష్మిక ఫిలిం క్రిటిక్ భరద్వాజ్ రంగన్ మాట్లాడనున్నారు. మరి దేశవ్యాప్తంగా పలు ఇండస్ట్రీస్ వాళ్ళు వస్తున్న ఈ కార్యక్రమంలో మనవాళ్లకు ఇలాంటి ఛాన్స్ రావడం గ్రేటే..
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: