ఒకప్పుడు హీరోలుసంగతేమో కానీ ఇప్పుడు హీరోలు మాత్రం కాస్త ముందు చూపుతోనే వున్నారనిపిస్తుంది. ఎందుకంటే హీరో లంటే కేవలం సినిమాలు మాత్రమే చేయాలన్న రూల్ ను బ్రేక్ చేస్తున్నారు. అందుకే ఒకపక్క సినిమాలు చేస్తూనే మరోపక్క వ్యాపార రంగాల్లోకి కూడా అడుగుపెడుతున్నారు. అందులో ముందు చెప్పుకోవాల్సింది మహేష్ బాబు గురించి. బిజినెస్ మ్యాన్ అనే టైటిల్ ఈ హీరో కి సరిగ్గా సరిపోతుంది. ఒక్క సినిమాలు మరో పక్క పలు ప్రొడక్ట్స్ కు బ్రాండ్ అంబాసిడర్, మల్టీప్లెక్స్ బిజినెస్, ప్రొడక్షన్ హౌస్, ఈ మధ్యనే తన లేబుల్ తోనే బట్టల వ్యాపారంలోకి అడుగుపెట్టాడు. ఇలా పలు రంగాల్లో తన ప్రత్యేకతను చాటుతున్నాడు. ఇక మిగిలిన హీరోలు కూడా తమకంటూ సొంత వ్యాపారాలు పెట్టుకుంటున్నారు. కొంతమంది అటు సినిమాలు చేస్తూనే మరో పక్క సొంత ప్రొడక్షన్ హౌస్ లు పెట్టి సినిమాలు తీస్తున్నారు. ఇప్పుడు ఈ లిస్ట్ లోకి ఎన్టీఆర్ కూడా చేరబోతున్నట్టు తెలుస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
త్వరలోనే ఎన్టీఆర్ సొంత నిర్మాణ సంస్థని స్థాపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఎన్టీఆర్ ఫ్యామిలీకి ‘ఎన్టీఆర్ ఆర్ట్స్’ అనే నిర్మాణ సంస్థ ఉంది. ‘ దీని బాధ్యతలు కళ్యాణ్ రామ్ చూసుకుంటున్నాడు. దీంతో జూనియర్ ఎన్టీఆర్ స్వయంగా ఓ బ్యానర్ మొదలుపెట్టాలని చూస్తున్నాడట. మంచి రోజు చూసుకొని నిర్మాణ సంస్థకు సంబంధించిన ప్రకటన చేసే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంతవరకు ఆగాల్సిందే.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: