ర‌వితేజ సినిమాలో స్టార్ డాట‌ర్స్

Star Daughters Plays Pivotal Role In Ravi Teja 66 Movie,Latest Telugu Movies News,Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Varalaxmi Sarathkumar Role in Ravi Teja 66 Movie,Ravi Teja New Movie Updates,Ravi Teja Latest News 2019

మాస్ మహారాజా రవితేజ క‌థానాయ‌కుడిగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా రాబోతున్న‌ సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో కమల్ హాసన్ తనయ శ్రుతి హాసన్ కథానాయికగా నటించ‌నుండ‌గా… మరో స్టార్ డాట‌ర్ కీలక పాత్రలో దర్శనమివ్వనుంది. ఆమె మ‌రెవ‌రో కాదు… సీనియ‌ర్ యాక్ట‌ర్ శ‌ర‌త్ కుమార్ కుమార్తె వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్ కుమార్‌.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

‘పందెం కోడి 2’, ‘సర్కార్’, ‘మారి 2’ వంటి తమిళ అనువాద చిత్రాలలో తెలుగు ప్రేక్ష‌కుల‌కు చేరువైన వ‌ర‌ల‌క్ష్మి… తాజాగా రవితేజ, గోపీచంద్ కాంబినేష‌న్ మూవీలో నటించే అవకాశం దక్కించుకుంది. ఈ విష‌యాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. త్వరలో షూటింగ్‌లో పాల్గొనబోతున్నందుకు ఎంతో సంతోషంగా ఉందంటూ వ‌ర‌ల‌క్ష్మి కూడా తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియజేసింది. మ‌రి… స్టార్ డాట‌ర్స్‌తో ర‌వితేజ న‌టించ‌నున్న‌ ఈ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ బాక్సాఫీస్ వ‌ద్ద ఎలాంటి ఫ‌లితాన్ని అందుకుంటుందో చూడాలి.

ఇదిలా ఉంటే, వ‌ర‌ల‌క్ష్మి తెలుగులో న‌టించిన తొలి చిత్రం `తెనాలి రామ‌కృష్ణ బి.ఎ., బి.ఎల్‌` ఈ నెల 15న థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌నుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 + 7 =