
ట్యాగ్ · 2027 కథనాలు · పేజీ 39


తేజ డేరింగ్ డెసిషన్ - ఆర్టికల్ 370పై సినిమా..!
బాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్
మహేష్ బాబు ట్వీట్ కు కమల్ హాసన్ రీ ట్వీట్

'కార్తికేయ 2' కోసం భారీ బడ్జెట్
బిజీ షెడ్యూల్ లో రానా దగ్గుబాటి

కాన్సెప్ట్ ఓరియెంటెడ్ ఫిల్మ్ లో అల్లరి నరేష్..!
బాలీవుడ్ డెబ్యూ - నాలుగు భాషల్లో..!
భక్తిరస చిత్రంలో నయనతార
రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న ‘సైకో’
ఒకే సీజన్‌లో వస్తున్న రజినీ, ధనుష్
తండ్రీకొడుకులుగా ప్రభాస్?
విజయ్ చందర్ కు కీలక పదవి
'అల వైకుంఠపురములో' డబ్బింగ్ మొదలైంది
'ఆకాశం నీ హద్దురా' అంటున్న సూర్య

#RT66 ప్రారంభానికి ముహూర్తం ఖరారు
వీఐ ఆనంద్ దర్శకత్వంలో రవితేజ 'డిస్కోరాజా' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సైంటిఫిక్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ప్రముఖ నిర్మాత రామ్ తళ్లూరి ఎస్ ఆర్ టి ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై సినిమాను తెరకెక్కిస్తున్నారు.

తేజ డేరింగ్ డెసిషన్ - ఆర్టికల్ 370పై సినిమా..!
మొదటి నుండి కాస్త డిఫరెంట్ స్టోరీలను తెరకెక్కిస్తుంటాడు డైరక్టర్ తేజ. తాను డైరెక్టర్ గా చేసిన మొదటి సినిమా 'చిత్రం' ఆ తర్వాత వరుసగా 'నువ్వు నేను', 'జయం' ఇలా సూపర్ హిట్లు కొట్టాడు. ఒక్క 'నువ్వు నేను' సినిమాకే ఆరు నంది అవార్డులు వచ్చాయంటేనే అర్ధం చేసుకోవచ్చు. ఇక ఫుల్ ఫామ్ లో వున్న తేజ ఆ తరవాత తీసిన సినిమాల వల్ల కాస్త వెనుకపడ్డాడు. అయితే చాలా కాలం తర్వాత 'నేనే రాజు నేనే మంత్రి' సినిమా హిట్ తో కమ్ బ్యాక్ ఇచ్చాడు. ఆ తర్వాత వచ్చిన 'సీత' బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టిందనుకోండి.
హీరోయిన్ సెంట్రిక్ మూవీస్ లో నటించాలనుంది - ఇలియానా
దేవదాస్ వంటి సూపర్ హిట్ మూవీ తో టాలీవుడ్ కు ఎంటరయిన ఇలియానా నటించిన పోకిరి, జల్సా, కిక్ , జులాయి మూవీస్ ఘనవిజయం సాధించాయి. బ్లాక్ బస్టర్ మూవీ బర్ఫీ తో ఇలియానా బాలీవుడ్ కు ఎంటర్ అయ్యారు. ఇలియానా నటించిన పలు బాలీవుడ్ మూవీస్ ఘనవిజయం సాధించినా , ప్రియాంక చోప్రా, దీపికా పడుకొనే వంటి స్టార్ హీరోయిన్స్ స్థాయి కి ఇలియానా చేరుకోలేదు. అయినా ఆమె ఆ విషయాన్ని పట్టించుకోలేదు.
బాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్
వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ మూవీ తో విజయం సాధించిన రకుల్ ప్రీత్ సింగ్ 2014 సంవత్సరం లో సూపర్ హిట్ యారియాన్ మూవీ తో బాలీవుడ్ లో అడుగులోపెట్టారు. తరువాత టాలీవుడ్, బాలీవుడ్ లలో స్టార్ హీరోయిన్ గా ఎదిగారు. 5 సంవత్సరాల గ్యాప్ తరువాత రకుల్ నటించిన దే దే ప్యార్ దే హిందీ మూవీ ఘనవిజయం సాధించింది. ఇప్పుడు రకుల్ నటించిన మరో మూవీ మర్జావాన్ నవంబర్ 22 వ తేదీ రిలీజ్ కానుంది.
మహేష్ బాబు ట్వీట్ కు కమల్ హాసన్ రీ ట్వీట్
లెజండరీ యాక్టర్ కమల్ హాసన్ నవంబర్ 7వ తేదీ తో 65 సంవత్సరాలు పూర్తి చేసుకొన్నారు. కలత్తూర్ కన్నమ్మ తమిళ మూవీ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా కోలీవుడ్ లో ప్రవేశించిన కమల్ హాసన్ ఫిల్మ్ ఇండస్ట్రీ లో 60 సంవత్సరాల సినీ కెరీర్ ను కంప్లీట్ చేసుకొన్నారు. కమల్ హాసన్ నటించిన అనేక తెలుగు, తమిళ, హిందీ చిత్రాలు ఘనవిజయం సాధించాయి. కమల్ హాసన్ నటుడే కాకుండా నిర్మాత, దర్శకుడు, సింగర్ కూడా. 60 సంవత్సరాల సినీ కెరీర్ కంప్లీట్ అయినా సందర్భంగా అభినందనలు తెలుపుతూ సూపర్ స్టార్ మహేష్ బాబు ట్వీట్ చేశారు.

'కార్తికేయ 2' కోసం భారీ బడ్జెట్
చందూ మొండేటి దర్శకత్వంలో, నిఖిల్ హీరోగా వచ్చిన కార్తికేయ సినిమా మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. 2014 వచ్చిన ఈ మిస్టరీ థ్రిల్లర్ నిఖిల్ కు మంచి బ్రేక్ ఇచ్చింది. కార్తికేయ తో తనకంటూ ఒక మార్కెట్ ను సెట్ చేసుకున్నాడు. ఇక ఈ సినిమా సీక్వెల్ ను తెరకెక్కించనున్నట్టు ఇప్పటికే కన్ఫామ్ ఐన సంగతి కూడా విదితమే. ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా ముగించుకొని సెట్స్ పైకి వెళ్ళడానికి రెడీ గా వుంది.
బిజీ షెడ్యూల్ లో రానా దగ్గుబాటి
కొన్ని నెలల బ్రేక్ తరువాత రానా దగ్గుబాటి హైదరాబాద్ చేరుకున్నారు. హెదరాబాద్ రాగానే బిజీగా మారారు. అశోక్ గల్లా ప్రారంభోత్సవం లో పాల్గొన్నారు. తరువాత తన అప్ కమింగ్ మూవీస్ షూటింగ్ షెడ్యూల్స్ కై దర్శకులతో మీటింగ్ లో పాల్గొన్నారు. మైథలాజికల్ మూవీ హిరణ్య కశిప మూవీ ప్రీ ప్రొడక్షన్ ను పర్యవేక్షిస్తున్నారు.

కాన్సెప్ట్ ఓరియెంటెడ్ ఫిల్మ్ లో అల్లరి నరేష్..!
అల్లరి సినిమాతో తెలుగు తెరకు పరిచయమై ఆ సినిమా పేరునే ఇంటి పేరుగా మార్చుకున్న హీరో నరేష్. తన కెరీర్ ప్రారంభంలో వరుస హిట్లతో దూసుకుపోయిన అల్లరి నరేష్ కు గత కొంతకాలంగా సరైన హిట్ పడలేదు. దానితో కాస్త వెనుకపడ్డాడు. ఇక ఇటీవల మహర్షి సినిమాలో ఒక కీలక పాత్రలో నటించాడు. మహర్షి సినిమాలో మహేష్ బాబు కు ఫ్రెండ్ గా చేయగా ఆ పాత్రకు మంచి పేరు వచ్చింది.

"విజయ్ సేతుపతి" పవన్ కళ్యాణ్ కై రాసిన కథ - విజయ్ చందర్
హీరో విజయ్ సేతుపతి, రాశీ ఖన్నా, నివేత పేతురాజ్ ప్రధాన పాత్రలలో విజయ్ చందర్ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ సంగ తమిళన్ తమిళ మూవీ , తెలుగు డబ్బింగ్ వెర్షన్ విజయ్ సేతుపతి మూవీస్ నవంబర్ 15 వ తేదీ రిలీజ్ కానున్నాయి. తెలుగు వెర్షన్ ను హర్షిత మూవీస్ రిలీజ్ చేస్తున్నారు. ఈ మూవీ లో విజయ్ సేతుపతి ద్విపాత్రాభినయం చేశారు.
బాలీవుడ్ డెబ్యూ - నాలుగు భాషల్లో..!
తెలుగు,తమిళ్, హిందీ ఇలా పలుభాషల్లో వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తుంది కీర్తి సురేష్. బాలీవుడ్ లో కూడా కీర్తీ సురేష్ ‘మైదాన్’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ‘బదాయి హో’ ఫేమ్ అమిత్ శర్మ 1950-63 మధ్య కాలంలో భారత ఫుట్‌బాల్ జట్టుకు కోచ్‌గా వ్యవహరించిన సయ్యద్ అబ్దుల్ రహీం జీవితకథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. ఈసినిమాలో బాలీవుడ్ యాక్షన్ హీరో అజయ్ దేవగన్ సయ్యద్ అబ్దుల్ రహీం పాత్రలో నటిస్తున్నాడు.
భక్తిరస చిత్రంలో నయనతార
కోలీవుడ్, టాలీవుడ్ లలో స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతున్న నయనతార ఉమెన్ సెంట్రిక్ మూవీస్ తో పాటు, కమర్షియల్ చిత్రాలలో కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఒక భక్తి చిత్రానికి నయనతార గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కమెడియన్ గా కోలీవుడ్ లో ప్రవేశించిన RJ బాలాజీ దర్శకుడిగా మారారు. నయనతార నటించిన నానుమ్ రౌడీ దాన్, వేట్టైకారన్ మూవీస్ లో బాలాజీ నటించారు.
రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న ‘సైకో’
‘తుప్పరివాలన్’(తెలుగులో ‘డిటెక్టివ్’) వంటి సక్సెస్ ఫుల్ యాక్షన్ థ్రిల్లర్ తరువాత దర్శకుడు మిస్కిన్ తెరకెక్కించిన తమిళ చిత్రం ‘సైకో’. ఇందులో నిత్యా మీనన్, అదితీరావు హైదరి, ఉదయనిధి స్టాలిన్ ప్రధాన పాత్రల్లో నటించారు. సైకలాజికల్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాలో ఉదయనిధి స్టాలిన్ అంధుడి పాత్రలో కనిపించనుండగా... అదితిరావు హైదరి రేడియో జాకీగా దర్శనమివ్వనుంది. మ్యూజిక్ మేస్ట్రో ఇళయరాజా సంగీతం అందించారు.
ఒకే సీజన్‌లో వస్తున్న రజినీ, ధనుష్
తమిళనాట 2020 సంక్రాంతి రసవత్తరంగా మారింది. ఎందుకంటే... నిజజీవితంలో మామాఅల్లుళ్ళు అయిన ఇద్దరు అగ్ర కథానాయకులు... పొంగల్ సీజన్‌లో తమ తమ కొత్త సినిమాలతో బాక్సాఫీస్ వద్ద క్లాష్ కి సై అంటున్నారు. ఆ మామాఅల్లుళ్ళు మరెవరో కాదు... సూపర్ స్టార్ రజినీకాంత్, టాలెంటెడ్ యాక్టర్ ధనుష్.
తండ్రీకొడుకులుగా ప్రభాస్?
`బాహుబలి` సిరీస్‌లో అమరేంద్ర బాహుబలి, మహేంద్ర బాహుబలిగా రెండు విభిన్న పాత్రల్లో నటించి అలరించాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. తండ్రీకొడుకుల పాత్రల్లో వైవిధ్యాన్ని ప్రదర్శించి మరీ బ్లాక్‌బస్టర్స్ అందుకున్నాడీ హ్యాండ్సమ్ హీరో. కట్ చేస్తే... తన అప్ కమింగ్ ఫిల్మ్‌లోనూ ఇదే ఫీట్ ని రిపీట్ చేయబోతున్నాడట ప్రభాస్.
ఈసారి పవన్ కళ్యాణ్ టైటిల్ తో రాబోతున్న కార్తి?
`ఖైదీ` ఘనవిజయం తమిళ కథానాయకుడు కార్తిలో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది. తమిళ, తెలుగు భాషల్లో ఒకే రోజున విడుదలైన ఈ యాక్షన్ థ్రిల్లర్‌తో... మళ్ళీ సక్సెస్ ట్రాక్ లోకి వచ్చేశాడు కార్తి. ఈ నేపథ్యంలో... తక్కువ గ్యాప్‌లోనే కొత్త చిత్రంతో పలకరించబోతున్నాడీ టాలెంటెడ్ స్టార్. ఫ్యామిలీ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమా క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20న రిలీజ్ కానుంది.
అల్లు అర్జున్ నోట జానపద పాట?
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరోమారు గాయకుడిగా పలకరించబోతున్నాడు. అప్పుడెప్పుడో `వేదం`(2010) కోసం `ప్రపంచం నా వెంట వస్తుంటే` అంటూ సాగే వెస్ట్రన్ టచ్ ఉన్న రొమాంటిక్ సాంగ్ లో తన గొంతుని సవరించిన బన్నీ... త్వరలో ఓ జానపద గీతాన్ని తన నోట వినిపించబోతున్నాడట.
విజయ్ చందర్ కు కీలక పదవి
వైసీపీ కోసం పని చేసిన సెలెబ్రిటీలకు జగన్ ప్రభుత్వంలో పలు కీలక పదవులు దక్కిన సంగతి తెలిసిందే. మోహన్ బాబు, పృథ్వీ, అలీ, పోసాని కృష్ణమురళి సహా ఈ జాబితాలో చాలా మంది ఉన్నారు. పృథ్వీకి ఎస్వీబీసీ ఛానల్ చైర్మన్ పదవి ఇవ్వగా ఈ జాబితాలో సీనియర్ నటుడు విజయ్ చందర్ కూడా చేరిపోయాడు.
లిడో డాన్సర్స్‌తో డాన్స్ - ఫస్ట్ సౌత్ఇండియన్ స్టార్‌గా మరో రికార్డ్
త్రివిక్రమ్-అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా 'అల వైకుంఠపురములో'. ఈ సినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ప్రస్తుతం చిత్రయూనిట్ సామజవరగమనా సాంగ్ షూటింగ్ కోసం యూరప్‌లో వున్నసంగతి కూడా విదితమే. అయితే అక్కడ అల్లు అర్జున్ లిడో డాన్సర్స్‌తో కలిసి స్టెప్పులేసాడట. అంతేకాదు గత 25 సంవత్సరాలుగా ఎంతో ఫేమస్ అయిన లిడో డాన్స్‌ని బన్నీ చేయడంతో తాజాగా ఆయన ఖాతాలో మరో రికార్డ్ నమోదైంది. ఫస్ట్ టైమ్ పారిస్‌లో లిడో డాన్సర్స్‌తో డాన్స్ చేసిన సౌత్ఇండియన్ స్టార్‌గా రికార్డ్ క్రియేట్ చేసాడు.
'అల వైకుంఠపురములో' డబ్బింగ్ మొదలైంది
త్రివిక్రమ్-అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా 'అల వైకుంఠపురములో'. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఒక పక్క షూటింగ్ జరుపుకుంటూనే మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలు పెట్టారు. దీనిలోభాగంగానే ఈ సినిమా నుండి ఇప్పటివరకూ 'సామజవరగమనా', 'రాములో రాములా' పాటలు రిలీజ్ చేయగా వాటికీ ఎంత రెస్పాన్స్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. యూ ట్యూబ్ లో ఈ రెండు పాటలు మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతున్నాయి. ఇక రీసెంట్ గానే ఈసినిమా రిలీజ్ డేట్ ను కూడా చెప్పేసారు. సంక్రాంతి పండుగా సందర్భంగా జనవరి 12 వ తేదీన ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
'ఆకాశం నీ హద్దురా' అంటున్న సూర్య
సినిమా హిట్లు ప్లాప్స్ తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు తమిళ్ స్టార్ హీరో సూర్య. ఇటీవలే 'కాప్పాన్' తెలుగులో 'బందోబస్త్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా అది బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఇప్పుడు సుధా కొంగర దర్శకత్వంలో సూర్య మరో కొత్త సినిమాలో నటిస్తున్నాడు. తమిళ్ లో ‘సూరరై పోట్రు’ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా!’ (అసాధారణ కలలు కన్న సాధారణ వ్యక్తి కథ)టైటిల్‌తో విడుదల కానుంది.