బాలకృష్ణ చిత్రానికి అనిరుధ్ బాణీలు?

Anirudh To Score Music For Balakrishna Movie,Latest Telugu Movies News,Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Music Director Anirudh For Balakrishna Next Movie,Balakrishna New Movie Music Director,Anirudh Upcoming Projects,Balakrishna Upcoming Movie

నటసింహా నందమూరి బాలకృష్ణ, యాక్షన్ మూవీస్ స్పెషలిస్ట్ బోయపాటి శ్రీనుది సక్సెస్‌ఫుల్ కాంబినేషన్. వీరి కలయికలో తెరకెక్కిన ‘సింహా’, ‘లెజెండ్’ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ వర్షం కురిపించాయి. అటువంటి విజయవంతమైన జోడీ నుంచి ఇప్పుడు ముచ్చటగా మూడో సినిమా రాబోతోంది. ఇందులో బాలయ్య రెండు షేడ్స్ ఉన్న‌ పాత్రలో దర్శనమివ్వబోతున్నాడని సమాచారం. ద్వారకా క్రియేషన్స్‌ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్… డిసెంబర్ 20న పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభమై, 2020 జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంద‌ని టాక్‌.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉంటే… ఈ సినిమాకి కోలీవుడ్ యంగ్ మ్యూజిక్ సెన్సేష‌న్‌ అనిరుధ్‌ రవిచందర్ స్వ‌రాలు సమకూర్చనున్నట్టు వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇప్ప‌టికే ‘అజ్ఞాతవాసి, ‘జెర్సీ’, ‘గ్యాంగ్ లీడర్’ వంటి తెలుగు చిత్రాలకు అనిరుధ్ బాణీలు అందించిన సంగతి తెలిసిందే. త‌మిళ‌నాట మాస్ ఎంట‌ర్‌టైన‌ర్స్‌కు పెట్టింది పేరైన అనిరుధ్‌… టాలీవుడ్‌లో చేయ‌నున్న తొలి మాస్ చిత్రం బాల‌య్య‌, బోయ‌పాటి మూవీ కానుండ‌డం విశేషం. కాగా… అనిరుధ్ ఎంట్రీపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవ‌కాశ‌ముంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen − six =