ట్యాగ్ · 2027 కథనాలు · పేజీ 34
`దిల్` రాజు సంస్థలో విజయ్ దేవరకొండ?
చిరుతో మరోసారి మణిశర్మ?
శంకర్ సినిమాకు విజయ్ సేతుపతి నో..!
ముందే వచ్చేస్తున్న 'దర్బార్'..!

'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' రెండో ట్రైలర్ రిలీజ్
మే డే రోజు వస్తున్న తేజ్ 'సోలో బ్రతుకే సో బెటర్'
'సరిలేరు నీకెవ్వరు' టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్

'అర్జున్ సురవరం' ట్రైలర్ రిలీజ్
విజయ్ కు కూడా అదే హీరోయిన్ అంటున్న పూరీ..!
ర్యాప్ సింగర్ సూర్య
హిందీ 'జెర్సీ' కి హీరోయిన్ ఫిక్స్..!
మరో క్రేజీ ప్రాజెక్ట్ లో రమ్యకృష్ణ
ప్రతి రోజూ పండగే సెకండ్ సింగిల్ రిలీజ్
అట్లీ - షారుఖ్ మూవీ షూటింగ్ అప్ డేట్..!
కమ్మ రాజ్యంలో కడప రెడ్లు ట్రైలర్ 2 రిలీజ్ డేట్
తర్వాత సినిమా హైదరాబాద్ దాదాగిరిపై..!
హీరో శ్రీవిష్ణు కు జోడీ గా కాజల్ అగర్వాల్ ?
బాలకృష్ణ, బోయపాటి చిత్రానికి ముహూర్తం ఫిక్స్?
నటసింహ నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం తన 105వ చిత్రం `రూలర్`ని పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నారు. డిసెంబర్ 20న ఈ క్రేజీ ప్రాజెక్ట్ థియేటర్లలో సందడి చేయనుంది. ఈ లోపే బాలయ్య తన నెక్ట్స్ వెంచర్ ని ప్రారంభించబోతున్నారని టాక్. తనకు అచ్చొచ్చిన దర్శకుల్లో ఒకరైన బోయపాటి శ్రీను కాంబినేషన్ లో చేయబోతున్న ఈ సినిమాని డిసెంబర్ 9న పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభిస్తారని సమాచారం. అయితే, రెగ్యులర్ షూటింగ్ ని మాత్రం వచ్చే ఏడాది జనవరిలో మొదలుపెట్టే అవకాశముందని వినికిడి. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించనున్న ఈ భారీ బడ్జెట్ మూవీలో బాలయ్య రెండు విభిన్న ఛాయలున్న…
`దిల్` రాజు సంస్థలో విజయ్ దేవరకొండ?
యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండ, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ శివ నిర్వాణ కాంబినేషన్ లో ఓ చిత్రం రాబోతున్న సంగతి తెలిసిందే. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్... ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉంది. లేటెస్ట్ బజ్ ఏంటంటే... ఈ సినిమాని ప్రముఖ నిర్మాత `దిల్` రాజు నిర్మిస్తారని తెలిసింది. విజయ్ దేవరకొండతో ఓ చిత్రాన్ని నిర్మించాలని `దిల్` రాజు చాన్నాళ్ళుగా భావిస్తున్నారట. శివ నిర్వాణ కాంబినేషన్ మూవీతో అది కార్యరూపం దాల్చనుందని సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశముందంటున్నారు.
చిరుతో మరోసారి మణిశర్మ?
మెగాస్టార్ చిరంజీవికి అచ్చొచ్చిన స్వరకర్తలో మెలోడీ బ్రహ్మ మణిశర్మ ఒకరు. వీరిద్దరి కలయికలో వచ్చిన పలు చిత్రాలు ఘనవిజయం సాధించాయి. `బావగారూ బాగున్నారా?`, `చూడాలని వుంది`(1998), ఇద్దరు మిత్రులు (1999), అన్నయ్య (2000), మృగరాజు (2001), ఇంద్ర (2002), ఠాగూర్ (2003), అంజి (2004), జై చిరంజీవ! (2005), స్టాలిన్ (2006)... ఇలా వరుసగా తొమ్మిదేళ్ళ పాటు ఈ ఇద్దరి కలయికలో పలు మ్యూజికల్ హిట్స్ వచ్చాయి.
శంకర్ సినిమాకు విజయ్ సేతుపతి నో..!
శంకర్ సినిమా అంటే ఎన్ని అంచనాలు వుంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక శంకర్ సినిమాలో నటించడానికి హీరో హీరోయిన్స్ ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. శంకర్ సినిమాలో ఎప్పుడు ఛాన్స్ వస్తుందా అని ఎదురుచూస్తుంటారు. కానీ ఒక హీరో మాత్రం శంకర్ సినిమాకు నో చెప్పాడంట. అతను ఎవరో కాదు తమిళ ప్రేక్షకులతో మక్కల్ సెల్వన్‌గా పిలుపించుకున్న నటుడు విజయ్ సేతుపతి.
ముందే వచ్చేస్తున్న 'దర్బార్'..!
మురగదాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీ కాంత్, నయనతార ప్రధాన పాత్రల్లో దర్బార్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే ముగిసింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెపెట్టేసింది. ఇక తాజాగా రజనీ తన పాత్రకి డబ్బింగ్ కూడా పూర్తి చేసారు. ఇక ఈ సినిమాను సంక్రాంతి పండుగకు రిలీజ్ చేద్దామని చూస్తున్న సంగతి కూడా విదితమే. అయితే ఇక్కడే ఒక సమస్యవచ్చింది. ఇదే పొంగల్ పోరులో మన తెలుగు సినిమాలు పోటీకి సిద్ధంగా వున్నాయి. ‘అల వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరు’ చిత్రాలు బరిలో ఉన్న సంగతి తెలిసిందే. జనవరి 12న ఈ రెండూ విడుదలకానున్నాయి.

'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' రెండో ట్రైలర్ రిలీజ్
సంచలన దర్శకుడైన రామ్ గోపాల్ వర్మ మరొక వివాదస్పద సినిమా 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' తో అభిమానుల ముందుకు వస్తున్నాడు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో తెరకెక్కిస్తున్న ఈ సినిమా టైటిల్ ఎనౌన్స్‌మెంట్ దగ్గర నుంచే వివాదాస్పదమైంది. గత కొన్ని రోజులుగా ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్లు విడుదల చేసి ఆసక్తిని రేపుతున్నాడు.
'ఆర్ఆర్ఆర్' నుండి బిగ్ అప్ డేట్ - రూమర్లకు చెక్ పెడతాం..!
బాహుబలి సినిమా తరువాత రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోల కాంబినేషన్ లో వస్తున్న భారీ బడ్జెట్ సినిమా 'ఆర్ఆర్ఆర్'. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. రామోజీ ఫిలింసిటీలో ప్రత్యేకంగా నిర్మించిన సెట్లలో చిత్రీకరణ జరుగుతోంది.ఈ షెడ్యూల్ లో రామ్ చరణ్ పై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు.
మే డే రోజు వస్తున్న తేజ్ 'సోలో బ్రతుకే సో బెటర్'
మారుతి దర్శకత్వంలో సాయితేజ్ హీరోగా 'ప్రతిరోజు పండగే' సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీ గా వుంది. కాగా ఈ సినిమాలో రాశీఖన్నా హీరోయిన్ గా నటిస్తుండగా...అల్లు అరవింద్ సమర్పణలో యూవీ క్రియేషన్స్, జీఏ2 పిక్చర్స్ బ్యానర్లపై బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు. డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు వస్తుంది.
'సరిలేరు నీకెవ్వరు' టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్
మొత్తానికి మహేష్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న అప్ డేట్ రానే వచ్చింది. ఇన్ని రోజులు కేవలం పోస్టర్ లను రిలీజ్ చేస్తుండగా ఈ సినిమా టీజర్ అప్డేట్ ఎప్పుడు ఇస్తారా అని ఎదురుచూస్తున్నారు. ఇక వారి ఎదురుచూపులకు కాస్త ఊరటనిచ్చేవిధంగా టీజర్ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు చిత్రయూనిట్. నవంబర్ 22వ తేదీన ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేస్తున్నట్టు అధికారికంగా తమ ట్విట్టర్ ద్వారా తెలిపారు.

'అర్జున్ సురవరం' ట్రైలర్ రిలీజ్
ఫైనల్లీ 'అర్జున్ సురవరం' సినిమాకు మంచి రోజులు వచ్చాయి. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకొని అన్ని కార్యక్రమాలకు పూర్తి చేసుకున్న ఈ సినిమాకు మాత్రం రిలీజ్ కష్టాలు మాములుగా రాలేదు. పలుమార్లు రిలీజ్ డేట్ వాయిదా పడటంతో అసలు ఈ సినిమా రిలీజ్ అవుతుందా అనుకున్నారు అంతా.. ఎట్టకేలకు ఇటీవలే ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు. నవంబర్ 29వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
విజయ్ కు కూడా అదే హీరోయిన్ అంటున్న పూరీ..!
నేను ఒక్కసారి కమిట్ అయితే ఎవ్వరి మాట వినను అని పూరీ జగన్నాథ్ పోకిరి సినిమాలో మహేష్ చెప్పించాడు. నిజానికి అవి చెప్పింది మహేష్ అయినా కూడా పూరీ వ్యక్తిత్వం కూడా అలానే ఉంటుందని మనకు తెలిసిందే. ఇక తన సినిమాల్లో కూడా కొన్ని కామన్ పాయింట్స్ ను చూస్తుంటాం. ఇదిలావుంచితే తనకు కలిసొచ్చిన హీరోయిన్ ను కూడా పూరీ రిపీట్ చేస్తూనే ఉంటాడు. రక్షిత, ఇలియానా, కాజల్ వీరందరితో ఒకటికి పైగా సినిమాలు చేసాడు. ఇక ఇప్పుడు ఈ లిస్ట్ లోకి మరో భామ కూడా చేరనుంది. ఆమె ఎవరో కాదు ఇస్మార్ట్ భామ నిధి అగర్వాల్.
ర్యాప్ సింగర్ సూర్య
2డి ఎంటర్ టైన్ మెంట్, సిఖ్య ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై సుధకొంగర దర్శకత్వంలో సూర్య హీరోగా సూరరై పోట్రు తమిళ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఎయిర్ డెక్కన్ వ్యవస్థాపకుడు జి .ఆర్. గోపినాథ్ జీవిత సంఘటనలు ఆధారంగా రూపొందుతున్న ఈ మూవీ లో అపర్ణ బాలమురళి కథానాయిక. మోహన్ బాబు, జాకీ ష్రాఫ్, పరేష్ రావల్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. జి వి ప్రకాష్ సంగీతంఅందిస్తున్నారు.
హిందీ 'జెర్సీ' కి హీరోయిన్ ఫిక్స్..!
గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నాని, శ్రద్ధ శ్రీనాథ్ హీరోహీరోయిన్లు గా తెరకెక్కిన సినిమా జెర్సీ. ఈ ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన రావడమే కాదు... విమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకుంది. ఇక ఇప్పుడు ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయబోతున్న సంగతి కూడా తెలిసిందే. అర్జునరెడ్డి రీమేక్ కబీర్ సింగ్ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన షాహిద్ కపూర్ ఈ రీమేక్ లో నటిస్తున్నాడు. ఇక ఇప్పటికే షాహిద్ కపూర్ ట్రైనింగ్ కూడా మొదలుపెట్టేసాడు.
మరో క్రేజీ ప్రాజెక్ట్ లో రమ్యకృష్ణ
అల్లు అరవింద్ సమర్పణ లో రినైసెన్స్ పిక్చర్స్, బ్లూ వాటర్స్ క్రియేటివ్స్ బ్యానర్స్ పై నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి దర్శకత్వం లో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో రూపొందనున్న మూవీ అక్టోబర్ 10 వ తేదీ పూజ కారక్రమం జరుపుకున్న విషయం తెలిసిందే. వరుణ్ తేజ్ బాక్సర్ గా నటించనున్న ఈ థ్రిల్లర్ మూవీ లో వరుణ్ తేజ్ మదర్ క్యారెక్టర్ కు రమ్య కృష్ణ ఎంపికయ్యారు.
ప్రతి రోజూ పండగే సెకండ్ సింగిల్ రిలీజ్
అల్లు అరవింద్ సమర్పణ లో గీతా ఆర్ట్స్ , యూవీ క్రియేషన్స్ బ్యానర్స్ పై సాయితేజ్, రాశీ ఖన్నా జంటగా మారుతి దర్శకత్వంలో రూపొందిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ప్రతి రోజూ పండగే మూవీ డిసెంబర్ 20వ తేదీ రిలీజ్ కానుంది. ప్రతి రోజూ పండగే మూవీ సెకండ్ సింగిల్ ఓ బావా సాంగ్ ప్రసాద్ ల్యాబ్ లో రిలీజయిన సందర్భంగా చిత్ర యూనిట్ మీడియా తో సమావేశమయ్యారు. హీరో సాయి తేజ్ మాట్లాడుతూ .. మీడియా నుండి అద్భుతమైన సపోర్ట్ వస్తుందని, థమన్ మంచి సంగీతం అందించారని, ఈ మూవీ అందరినీ అలరిస్తుందని, మనల్ని మనం ప్రశ్నించుకొనే చిత్రమిదనీ అన్నారు.
అట్లీ - షారుఖ్ మూవీ షూటింగ్ అప్ డేట్..!
బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నట్టు ఇప్పటికే క్లారిటీ వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా ప్రకటన ఇచ్చేసారు. పక్కా మాస్ కమర్షియల్ ఎలిమెంట్స్ అట్లీ సినిమాను తనదైన శైలిలో తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది.
కమ్మ రాజ్యంలో కడప రెడ్లు ట్రైలర్ 2 రిలీజ్ డేట్
సంచలన దర్శకుడైన రామ్ గోపాల్ వర్మ మరొక వివాదస్పద సినిమా 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' తో అభిమానుల ముందుకు వస్తున్నాడు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో తెరకెక్కిస్తున్న ఈ సినిమా టైటిల్ ఎనౌన్స్‌మెంట్ దగ్గర నుంచే వివాదాస్పదమైంది. గత కొన్ని రోజులుగా ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్లు విడుదల చేసి ఆసక్తిని రేపుతున్నాడు.
తర్వాత సినిమా హైదరాబాద్ దాదాగిరిపై..!
రోజుకో పోస్ట్ తో.. రోజుకో అప్ డేట్ తో 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' సినిమాకు మరింత క్రేజ్ తీసుకొస్తున్నాడు వర్మ. ఇప్పటికే టీజర్, ట్రైలర్, పాటలతోనే సగం దుమారం రేపాడు. అక్కడితో ఆగకుండా ఈ సినిమాకు సంబంధించి పలు పోస్టర్ లు రిలీజ్ చేస్తూ మరిన్ని వివాదాలకు తెరలేపుతున్నాడు. అంతే కాదు 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' అనే సినిమాకు సీక్వెల్ తీయనున్నట్టు కూడా తెలిపాడు. టీడీపీకి గుడ్ బై చెప్పిన వల్లభనేని వంశీ ఫైర్ అవుతున్న ఇంటర్వ్యూలు చూసిన తర్వాత తనకు ఈ ఐడియా వచ్చిందని..ఈ సీక్వెల్ కు 'రెడ్డి రాజ్యానికి కమ్మ ఫ్యాన్స్' అనే టైటిల్ పెడతానని ట్విట్టర్ ద్వారా ప్రకటించాడు.
హీరో శ్రీవిష్ణు కు జోడీ గా కాజల్ అగర్వాల్ ?
2007 సంవత్సరం లో లక్ష్మీ కళ్యాణం మూవీ తో టాలీవుడ్ కు ,2008 సంవత్సరంలో పళని మూవీ తో కోలీవుడ్ కు ఎంటర్ అయిన కాజల్ అగర్వాల్ తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని, స్టార్ హీరోయిన్ గా ఎదిగారు. కాజల్ అగర్వాల్ నటించిన పలు తెలుగు, తమిళ చిత్రాలు ఘనవిజయం సాధించాయి. తెలుగు, తమిళ స్టార్ హీరోల చిత్రాలలో కాజల్ నటించారు. 12 సంవత్సరాలుగా ప్రేక్షకులను అలరిస్తున్న కాజల్ కు సీనియర్ హీరోల మూవీస్ తో బాటు యువ హీరోల మూవీస్ లో కూడా ఆఫర్స్ రావడం విశేషం.
వచ్చే ఏడాది రెండు సినిమాలు - కుదిరితే వెబ్ సిరీస్ కూడా...!
'గౌరవం' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన శిరీష్ ఇంకా కమర్షియల్ హీరోగా నిలదొక్కుకోలేదనే చెప్పొచ్చు. 'కొత్తజంట', 'శ్రీరస్తు శుభమస్తు' సినిమాలు కాస్త హిట్ టాక్ తెచ్చుకున్నా కమర్షియల్ గా మాత్రం వర్క్ అవుట్ కాలేదు. ఇక ఇటీవలే మలయాళం హిట్ మూవీ ‘ఏబీసీడీ’ ని రీమేక్ చేయగా అది కూడా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది. దీనితో ఓ మంచి హిట్ కొట్టాలని చూస్తున్నాడు అల్లు శిరీష్ ఎప్పటినుండో.