ట్యాగ్ · 2027 కథనాలు · పేజీ 33
బాలయ్యతో మరోసారి వేదిక?

10 భాషల్లో రిలీజ్ కానున్న'RRR'
'భాగ్య నగర వీధుల్లో గమ్మత్తు' ట్రైలర్ రిలీజ్
లక్ష్ 'వలయం' డబ్బింగ్ ప్రారంభం
'ఆర్ఆర్ఆర్' ఎన్టీఆర్ హీరోయిన్, విలన్ ఫిక్స్
కింగ్ నాగార్జున రిలీజ్ చేసిన తూటా మూవీ ట్రైలర్
'శివ నిర్వాణ' తర్వాతే 'హీరో' అంటున్న విజయ్..!
జార్జి రెడ్డి మూవీ సెన్సార్ పూర్తి

'90ML' ట్రైలర్ రిలీజ్ కు ముహూర్తం ఖరారు
కె.జి.యఫ్ డైరెక్టర్ తో ప్రభాస్ సినిమా..?
వెజిటేరియన్ గా మారిన స్టార్ హీరోయిన్ నయనతార
దంపతుల పాత్రల్లో బన్నీ, రష్మిక?

'జాక్‌పాట్' ట్రైలర్ రిలీజ్
'మిస్ మ్యాచ్' ట్రైలర్ రిలీజ్
వెంకటేష్‌కి జోడీగా అనుష్క?
నాగచైతన్యకి విలన్ గా అజయ్ భూపతి?
గత ఏడాది సంచలనం `ఆర్ ఎక్స్ 100`తో దర్శకుడిగా తొలి అడుగులు వేశాడు అజయ్ భూపతి. మొదటి ప్రయత్నంలోనే నిర్దేశకుడిగా మన్ననలు పొందిన ఈ టాలెంటెడ్ టెక్నీషియన్... త్వరలో ప్రతినాయకుడి అవతారమెత్తుతున్నాడని టాక్.
బాలయ్యతో మరోసారి వేదిక?
నటసింహా నందమూరి బాలకృష్ణ 105వ చిత్రం `రూలర్`లో ఇద్దరు నాయికల్లో ఒకరిగా నటిస్తోంది వేదిక. ఆ సినిమా విడుదలయ్యేలోపే... బాలయ్య సరసన మరో క్రేజీ ప్రాజెక్ట్‌లో హీరోయిన్‌గా నటించే ఛాన్స్ దక్కించుకుందట ఈ టాలెంటెడ్ బ్యూటీ.

10 భాషల్లో రిలీజ్ కానున్న'RRR'
బాహుబలి సినిమా తరువాత రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోల కాంబినేషన్ లో వస్తున్న భారీ బడ్జెట్ సినిమా 'ఆర్ఆర్ఆర్'. స్వాతంత్య్ర సమర యోధులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీం జీవిత చరిత్రలను ఆధారం చేసుకొని రాజమౌళి ఈ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది.ఇప్పటికే 70 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. త్వరలోనే షూటింగ్ పనులు పూర్తి చేసి మిగిలిన పనులు చేసుకోనుంది.
'భాగ్య నగర వీధుల్లో గమ్మత్తు' ట్రైలర్ రిలీజ్
ఇన్ని రోజులు తన కామెడీ తో.. మరోవైపు హీరోగా ఆకట్టుకున్న శ్రీనివాస్ రెడ్డి ఇప్పుడు మెగా ఫోన్ పట్టుకున్న సంగతి తెలిసిందే. తనే దర్శక నిర్మాతగా మరి భాగ్య నగర వీధుల్లో గమ్మత్తు అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు.
విజయ్ ఆంటోని ‘జ్వాల’ ఫస్ట్‌లుక్ రిలీజ్
విభిన్నమైన సినిమా కథలతో తెలుగు ప్రేక్షకుల్లో కూడా మంచి అభిమానులను ఏర్పరుచుకున్నాడు విజయ్ ఆంటోని. ఇప్పుడు మరో కొత్త కథతో వస్తున్నాడు. నవీన్ దర్శకత్వంలో విజయ్ ఆంటోనీ, అరుణ్ విజయ్, అక్షరా హాసన్ ముఖ్య పాత్రల్లో వస్తున్న భారీ బడ్జెట్ సినిమా ‘అగ్ని సిరగుగల్’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. తుది షెడ్యూల్‌ను కజకిస్తాన్‌లో షూట్ చేస్తున్నారు. కజకిస్తాన్‌లో షూటింగ్ జరుపుకుంటున్న తొలి ఇండియన్ సినిమా మాదే.
లక్ష్ 'వలయం' డబ్బింగ్ ప్రారంభం
రమేశ్ కడుముల దర్శకత్వంలో లక్ష్, దిగంగన సూర్యవంశీ హీరో హీరోయిన్లు గా తెరకెక్కుతున్న సినిమా 'వలయం'. సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో సమాజంలోని ఓ అంశాన్ని తీసుకుని కొత్త తరహా ప్రేమ కథా చిత్రంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక ఒక పక్క షూటింగ్ జరుపుకుంటూనే మరో పక్క డబ్బింగ్ కార్యక్రమాలు ప్రారంభించారు చిత్రయూనిట్. ఈ సినిమా డబ్బింగ్ ను లక్ష్ స్టార్ట్ చేసినట్టు తెలుస్తుంది.
'ఆర్ఆర్ఆర్' ఎన్టీఆర్ హీరోయిన్, విలన్ ఫిక్స్
మొత్తానికి ఇన్నిరోజులకు ఆర్ఆర్ఆర్ హీరోయిన్ విషయంలో క్లారిటీ ఇచ్చారు చిత్రయూనిట్. గతకొద్దికాలంగా ఎన్టీఆర్ హీరోయిన్ ను ఎవరికి సెలెక్ట్ చేస్తారా..? ఎన్టీఆర్ పక్కన నటించే ఛాన్స్ ఎవరికి వస్తుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఫైనల్ గా ఈ రోజు అధికారికంగా ప్రకటించారు. ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ బ్యూటీ ‘ఒలివియా మోరిస్’ నటించనుందని ట్విట్టర్ ద్వారా తెలిపారు. ‘ఒలివియా మోరిస్ కు స్వాగతం. మా సినిమాలో మీరు ప్రధాన పాత్ర అయిన ‘జెన్నిఫర్’ పాత్రను పోషిస్తున్నందుకు మేము సంతోషిస్తున్నాము. షూట్ కోసం ఎదురు చూస్తున్నాము’ అని పోస్ట్ చేశారు.
కింగ్ నాగార్జున రిలీజ్ చేసిన తూటా మూవీ ట్రైలర్
గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో ధనుష్, మేఘ ఆకాష్ జంటగా రొమాంటిక్ థ్రిల్లర్ ఎన్నై నోక్కి పాయిమ్ తోట్ట తమిళ మూవీ రూపొందిన విషయం తెలిసిందే. ఈ మూవీ తెలుగు డబ్బింగ్ వెర్షన్ తూటా మూవీ గొలుగూరి రామకృష్ణారెడ్డి సమర్పణలో విజయభేరి వారి బ్యానర్ పై రూపొందింది. రెండు భాషలలోనూ ఈ మూవీ నవంబర్ 29 వ తేదీ రిలీజ్ కానుంది. దర్భుక శివ సంగీతం అందించారు.
'శివ నిర్వాణ' తర్వాతే 'హీరో' అంటున్న విజయ్..!
క్రాంతి మాధవ్ డైరెక్షన్ లో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో 'వరల్డ్ ఫేమస్ లవర్' రొమాంటిక్ లవ్ స్టోరీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా తాజాగా ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించింది. ఇప్పటికే టైటిల్ పోస్టర్ ను, ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. ఇక ఈ సినిమాను డిసెంబర్ లోనే రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్.
జార్జి రెడ్డి మూవీ సెన్సార్ పూర్తి
మిక్ మూవీస్, త్రి లైన్ సినిమాస్, సిల్లీ మాంక్స్ స్టూడియోస్ బ్యానర్స్ పై ఉస్మానియా యూనివర్శిటీ స్టూడెంట్ లీడర్ జార్జి రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా జీవం రెడ్డి దర్శకత్వంలో వంగవీటి మూవీ ఫేమ్ సందీప్ మాధవ్ హీరోగా రూపొందిన జార్జి రెడ్డి మూవీ నవంబర్ 22 వ తేదీ రిలీజ్ కానుంది. బాక్సర్, గోల్డ్ మెడలిస్ట్ జార్జిరెడ్డి విప్లవాత్మక ధోరణి ఆకర్షింపబడి ఉస్మానియా యూనివర్శిటీ లో 1967 -1972 వరకు ఉన్నారు. PDSU స్టూడెంట్ యూనియన్ ను స్థాపించారు. 1972 సంవత్సరంలో మర్డర్ కాబడ్డారు.

'90ML' ట్రైలర్ రిలీజ్ కు ముహూర్తం ఖరారు
శేఖర్ రెడ్డి దర్శకత్వంలో కార్తికేయ హీరోగా '90ML' సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను స్టార్ట్ చేసింది. దీనిలోభాగంగానే ఈ సినిమా నుండి ఇప్పటీకే టీజర్ ను పాటలను రిలీజ్ చేయగా తాజాగా టైలర్ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు చిత్రయూనిట్. రేపు ఉదయం 10.35 నిమిషాలకు ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు.
తలైవి మూవీ లో సీనియర్ ఎన్టీఆర్ గా జూనియర్ ఎన్టీఆర్ ?
విష్ణు ఇందూరి, శైలేష్ ఆర్ సింగ్ నిర్మాణ సారథ్యం లో లెజండరీ యాక్ట్రెస్, తమిళనాడు దివంగత ముఖ్య మంత్రి జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతున్న తలైవి మూవీ షూటింగ్ ప్రారంభమైన విషయం తెలిసిందే. ఏ ఎల్ విజయ్ దర్శకత్వంలో జయలలిత పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్, లెజండరీ యాక్టర్, తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి ఎమ్ జి రామచంద్రన్ పాత్రలో ట్యాలెంటెడ్ యాక్టర్ అరవింద్ స్వామి నటిస్తున్నారు. ఇతర పాత్రలలో ప్రముఖ నటీనటులు నటించనున్నారు.
కె.జి.యఫ్ డైరెక్టర్ తో ప్రభాస్ సినిమా..?
సాహో సినిమాతో మంచి హిట్ అందుకున్న ప్రభాస్ ఇప్పుడు 'జాన్' సినిమాతో వస్తున్న సంగతి తెలిసిందే కదా. ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలైంది. యూరోప్ లో 20 రోజుల షూటింగ్ మాత్రమే జరిగింది. దాని తర్వాత సాహో పనుల్లో ప్రభాస్ ఫుల్ బిజీగా మారిపోవడంతో ఆరు నెలలకు పైగా బ్రేక్ పడింది. ఇప్పుడు సాహో హడావుడి కూడా అయిపోయింది. దీనితో మళ్ళీ ఈ సినిమా షూటింగ్ ను మొదలుపెట్టనున్నారు. విరామం తర్వాత మళ్లీ షూటింగ్ ప్రారంభించనున్నారు. తొలి షెడ్యూల్ హైదరాబాద్ లో మొదలుకానుంది. ప్రభాస్ తో పాటు ముఖ్య తారాగణమంతా ఈ షెడ్యూల్ లో పాలుపంచుకుంటారు.
నిన్ను చూస్తే గర్వం గా ఉంది సితు పాపా - మహేష్ బాబు
క్రిస్ బక్ , జెన్నిఫర్ లీ దర్శకత్వంలో ఎల్సా, అన్నా ప్రధాన పాత్రలలో వాల్ట్ డిస్నీ యానిమేషన్ స్టూడియోస్ నిర్మించిన 3డి కంప్యూటర్ యానిమేటెడ్ ఫాంటసీ మూవీ ఫ్రోజన్ 2013 సంవత్సరంలో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. ఇప్పడు ఆ మూవీ కి సీక్వెల్ ఫ్రోజన్2మూవీ రూపొంది ప్రపంచవ్యాప్తంగా నవంబర్ 22 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లోని రాకుమారి ఎల్సా పాత్రకు హిందీ లో ప్రియాంక చోప్రా, తెలుగు లో నిత్యా మీనన్, తమిళం లో శృతి హాసన్ డబ్బింగ్ చెప్పడం విశేషం.
వెజిటేరియన్ గా మారిన స్టార్ హీరోయిన్ నయనతార
వేల్స్ ఫిల్మ్స్ ఇంటర్ నేషనల్ బ్యానర్ పై ఆర్ జే బాలాజీ, శరవణన్ సంయుక్త దర్శకత్వంలో లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రధాన పాత్ర లో తమిళ మూవీ మూకుత్తి అమ్మన్ రూపొందనున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో నయనతార దేవత పాత్రలో నటిస్తున్నారు. సెటైరికల్ కామెడీ మూకుత్తి అమ్మన్ మూవీ కి స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ ఆర్ జే బాలాజీ అందిస్తున్నారు.
పవన్ కళ్యాణ్ , రజనీకాంత్ , వెంకటేష్ లకు "గ్రీన్ ఛాలెంజ్ "
మూడు మొక్కలు నాటే "గ్రీన్ ఛాలెంజ్ " ను రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ ఛాలెంజ్ అన్ని రంగాలవారినీ ఆకర్షిస్తోంది. తాజా గా సూపర్ స్టార్ కృష్ణ గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరించారు. తన ఇంటి ప్రాంగణం లో సూపర్ స్టార్ కృష్ణ మూడు మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో సంతోష్ కుమార్ తో పాటు కాదంబరి కిరణ్ పాల్గొన్నారు.
దంపతుల పాత్రల్లో బన్నీ, రష్మిక?
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ ఓ యాక్షన్ థ్రిల్లర్ ని తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. ఎర్రచందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో బన్నీ స్మగ్లింగ్ చేసే లారీ డ్రైవర్ గా కనిపించనున్నాడని టాక్. కాగా... ఈ సినిమాలో బన్నీకి జోడీగా కన్నడ కస్తూరి రష్మికా మందన్న నటించనున్న విషయం విదితమే.

'జాక్‌పాట్' ట్రైలర్ రిలీజ్
జ్యోతిక ప్రధాన పాత్రలో 'జాక్ పాట్' ఈ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. వివాహం తర్వాత నటనకు కొన్నేళ్ళు గ్యాప్ తీసుకున్న జ్యోతిక ఇప్పుడు మళ్లీ 'జాక్‌పాట్' సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్నారు. కల్యాణ్ దర్శకత్వంలో అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఈ నెల 21వ తేదీన రిలీజ్ కానుంది. ఇక డేట్ రీలిజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్ కార్యక్రమాల్లో జోరు పెంచింది. ఇక ఇప్పటీకే ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేయగా.. ఇప్పుడు తాజాగా ట్రైలర్ ను రిలీజ్ చేసింది చిత్రయూనిట్.
'మిస్ మ్యాచ్' ట్రైలర్ రిలీజ్
నిర్మల్ కుమార్ దర్శకత్వంలో ఆట గదరా శివ ఫేమ్ ఉదయ్ శంకర్, ఐశ్వర్య రాజేష్ హీరో హీరోయిన్లు గా తెరకెక్కుతున్న సినిమా 'మిస్ మ్యాచ్'. ప్రస్తుతం పోస్ట్ పొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే నెల 6వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టేరేసారు చిత్రయూనిట్. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.
వెంకటేష్‌కి జోడీగా అనుష్క?
తమిళనాట ఘనవిజయం సాధించిన `అసురన్`... తెలుగులో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. విక్టరీ వెంకటేష్ కథానాయకుడిగా నటించనున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ ని ప్రముఖ నిర్మాతలు డి.సురేష్ బాబు, కలైపులి ఎస్.థాను సంయుక్తంగా నిర్మించనున్నారు. శ్రీకాంత్ అడ్డాల ఈ రీమేక్‌ని డైరెక్ట్ చేస్తాడని ప్రచారం సాగుతోంది. కాగా... ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో వెంకీకి జోడీగా అనుష్క నటించే అవకాశముందని టాక్. వాస్తవానికి, ఈ పాత్ర కోసం ఇదివరకు శ్రియ పేరు ప్రముఖంగా వినిపించింది. అయితే, అనుష్క ఆ పాత్రలో నటిస్తుందని సమాచారం. అభినయానికి అవకాశమున్న డీ-గ్లామర్ రోల్ కావడంతో స్వీటీ కూడా ఆసక్తి చూపిస్తుందని…