కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Telugu Film News 2019

ట్యాగ్ · 2027 కథనాలు · పేజీ 26

Ruler Movie Shooting Wrapped Up,Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Movie Updates,Ruler Movie Shooting Updates,Ruler Telugu Movie Updates,Balakrishna Ruler Shooting Details,Balakrishna New Movie Shooting Upda
షూటింగ్ అప్‌డేట్

షూటింగ్ పూర్తి చేసుకున్న 'రూలర్'

కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా 'రూలర్' సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. గతకొద్దికాలంగా ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇక తాజాగా ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ఈ విషయాన్నీఅధికారికంగా తెలిపారు చిత్రయూనిట్.

TFN Adminవాట్సాప్
'అతడే శ్రీమన్నారాయణ' ట్రైలర్ రిలీజ్
ట్రైలర్ & టీజర్

'అతడే శ్రీమన్నారాయణ' ట్రైలర్ రిలీజ్

సచిన్ దర్శకత్వంలో రక్షిత్ శెట్టి హీరోగా 'అతడే శ్రీమన్నారాయణ' అనే సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాని కన్నడంతో పాటు తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారు.ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. తెలుగు ట్రైలర్ ను న్యాచురల్ స్టార్ నాని చేతుల మీదుగా రిలీజ్ చేశారు. తమిళ్ లో ధనుష్, మలయాళం లో నివిన్ పాల్ ఈ సినిమా ట్రయిలర్ ను రిలీజ్ చేశారు.

TFN Adminవాట్సాప్
అఫీషియల్ - 'ఫ్యామిలీ మ్యాన్ 2' లో భాగమైన సమంత
సినిమా వార్తలు

అఫీషియల్ - 'ఫ్యామిలీ మ్యాన్ 2' లో భాగమైన సమంత

మనోజ్ బాజ్‌పెయ్, ప్రియమణి మరియు సందీప్ కిషన్ ప్రధాన పాత్రల్లో స్పై థ్రిల్లర్ గా వచ్చిన 'ఫ్యామిలీ మ్యాన్' వెబ్ సిరీస్ ఎంత పెద్ద సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అమెజాన్ ప్రైమ్ లో వచ్చిన ఈ సిరీస్ కు ఫుల్ వ్యూస్ తో పాటు, క్రేజ్ కూడా సొంతం చేసుకుంది. తెలుగు దర్శకులు రాజ్‌ నిడిమోరు, కృష్ణ డీకేలు ఈ వెబ్‌ సిరీస్‌‌ను దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో వీరు హిందీలో 'షోర్ ఇన్ ది సిటీ', 'గో గోవా గాన్' సినిమాలకు దర్శకత్వం వహించారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

రజనీకాంత్ కు జోడీ గా ఖుష్బూ ?

ఏ ఆర్ మురుగదాస్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ "దర్బార్ " మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 9 వ తేదీ రిలీజ్ కానుంది. "దర్బార్ " తరువాత తన 168 వ మూవీ ని శివ దర్శకత్వంలో రజనీకాంత్ అనౌన్స్ చేశారు. సూపర్ స్టార్ రజనీకాంత్ తో "రోబో ", "పేట " వంటి సూపర్ హిట్ చిత్రాలను భారీ బడ్జెట్ తో నిర్మించిన సన్ పిక్చర్స్ , బ్లాక్ బస్టర్ మూవీస్ దర్శకుడు శివ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా భారీ బడ్జెట్ తో రజనీకాంత్ 168వ మూవీ ని నిర్మిస్తున్నారు.

Team TFNవాట్సాప్
'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' దండం సాంగ్ రిలీజ్
సాంగ్

'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' దండం సాంగ్ రిలీజ్

సంచలన దర్శకుడైన రామ్ గోపాల్ వర్మ మరొక వివాదస్పద సినిమా 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' తో అభిమానుల ముందుకు వస్తున్నాడు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో తెరకెక్కిస్తున్న ఈ సినిమా టైటిల్ ఎనౌన్స్‌మెంట్‌ దగ్గర నుంచే వివాదాస్పదమైంది. ఇప్పటికే ఈ సినిమా టీజర్, ట్రైలర్, సాంగ్స్ తో ఎంతటి సంచలనం సృష్టించిందో కూడా తెలిసిందే. తెలుగు రాష్టాల్లో ఈ సినిమాపై తీవ్ర చర్చ జరుగుతోంది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

మారిన ఆర్ జి వి మూవీ టైటిల్ ?

నిజ రాజకీయ నేతలే ప్రధాన పాత్రలుగా టి.అంజయ్య సమర్పణలో టైగర్ కంపెనీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఆర్ జి వి శిష్యుడు సిద్దార్ధ్ తాతోలు దర్శకత్వం, వర్మ రచన, సహకార దర్శకత్వంలో రూపొందిన "కమ్మ రాజ్యం లో కడప రెడ్లు " మూవీ నవంబర్ 29 రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ మూవీ టైటిల్ "అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు" గా మారిందని సమాచారం.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

రామ్ పోతినేని, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో మూవీ ?

బ్లాక్ బస్టర్ "ఇస్మార్ట్ శంకర్" మూవీ తరువాత హీరో రామ్ పోతినేని "రెడ్ " మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. వరుస విజయాల చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రూపొందుతున్న "సరిలేరు నీకెవ్వరు " మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 11 వ తేదీ రిలీజ్ కానుంది. ఆ మూవీ తరువాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో రామ్ హీరో గా ఒక మూవీ రూపొందనుందని సమాచారం.

Team TFNవాట్సాప్
స్పెషల్

మళ్ళీ ఫామ్ లోకి వచ్చిన మెలోడీ బ్రహ్మ

మెలోడీ బ్రహ్మ అంటే సంగీత ప్రియులకు స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు.. ఎన్నో సూపర్ హిట్ పాటలను అందించాడు. ఇళయరాజా, ఎం.ఎం.కీరవాణి, రాజ్-కోటిల దగ్గర పనిచేసిన ఆయన "సూపర్ హీరోస్" చిత్రంతో సంగీత దర్శకునిగా కెరియర్ ప్రారంభించి ఇప్పటి వరకు 200 చిత్రాలకి పైగా సంగీతాన్నందించారు. కెరీర్ మొదట మణిశర్మ బిజీ బిజీ గా సూపర్ హిట్స్ తో అందరు అగ్ర తారల సినిమాలకు మ్యూజిక్ అందించి.. అగ్రతారల మ్యూజిక్ డైరెక్టర్ గా ఎదిగాడు. ఎన్నో మెలోడీ సాంగ్స్ అందించారు. ఇరవై రెండేళ్ల సినీ ప్రస్థానంలో ఎన్నో మరపురాని విజయాల్ని సొంతం చేసుకున్నారాయన.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

బాలీవుడ్ మూవీ సీక్వెల్ లో హీరోయిన్ ప్రణీత

సక్సెస్ ఫుల్ మూవీ "బావ " తో టాలీవుడ్ లో ప్రవేశించిన కన్నడ భామ ప్రణీత "అత్తారింటికి దారేది ", "పాండవులు పాండవులు తుమ్మెద ", "రభస"," బ్రహ్మోత్సవం" ," హలో గురు ప్రేమకోసమే "మూవీస్ లో నటించి ప్రేక్షకులను అలరించారు. శాండల్ వుడ్ లో బిజీగా ఉన్న ప్రణీత, అజయ్ దేవగన్ హీరో గా రూపొందుతున్న హిందీ మూవీ "భుజ్ : ది ప్రైడ్ ఆఫ్ ఇండియా " తో బాలీవుడ్ లో ప్రవేశించనున్నారు. ప్రస్తుతం ఆ మూవీ షూటింగ్ జరుపుకొంటుంది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

మిల్కీ బ్యూటీ తమన్నా న్యూ జర్నీ

శ్రీ (2005) సక్సెస్ ఫుల్ మూవీ తో టాలీవుడ్ కు ఎంటర్ అయిన మిల్కీ బ్యూటీ తమన్నా తన అందం, అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని టాలీవుడ్, కోలీవుడ్ లలో స్టార్ హీరోయిన్ గా ఎదిగారు. బాలీవుడ్ లో కూడా విజయ కేతనం ఎగరవేస్తున్నారు. రీసెంట్ గా రిలీజ్ అయిన "సైరా నరసింహా రెడ్డి" మూవీ లో పెర్ఫార్మెన్స్ కు తమన్నా ప్రేక్షకుల ప్రశంసలు అందుకొన్నారు. తమన్నా నటించిన "దటీజ్ మహాలక్ష్మి" మూవీ రిలీజ్ కు సిద్ధం గా ఉంది. "బోలే చూడియాన్" హిందీ మూవీ షూటింగ్ జరుపుకుంటుంది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

రజినీ సార్ ఎనర్జీ చూసి ఆశ్చర్యపోయా..!

మురగదాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీ కాంత్, నయనతార ప్రధాన పాత్రల్లో దర్బార్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే ముగిసింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టేసింది. ఇక ఈ సినిమాను సంక్రాంతి పండుగకు రిలీజ్ చేయనున్న సంగతి తెలిసిందే. అయితే ఇక్కడే ఒక సమస్యవచ్చింది. ఇదే పొంగల్ పోరులో మన తెలుగు సినిమాలు పోటీకి సిద్ధంగా వున్నాయి. సరిలేరు నీకెవ్వరు’ జనవరి 11న ‘అల వైకుంఠపురములో' జనవరి 12న చిత్రాలు రానున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమాను జనవరి 9న ఈ సినిమాను రిలీజ్ చేద్దామని చూపిస్తున్నారు.

TFN Adminవాట్సాప్
Alia Bhatt Finishes Her Shooting Part In RRR Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Movie Updates,RRR Movie Updates,RRR Telugu Movie Latest News,RRR Movie Shooting Updates,RRR Telugu Movie Shooting Details,Al
షూటింగ్ అప్‌డేట్

RRR మూవీ లో అలియా భట్ షూటింగ్ పార్ట్ పూర్తి

డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై దర్శకధీర రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా రూపొందుతున్న RRR మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్, ఒలీవియా మోరిస్ కథానాయికలు. బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. కీరవాణి సంగీతం అందించారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

`అల వైకుంఠ‌పుర‌ములో`... అల్లు అర్జున్ `డ‌బుల్ ధ‌మాకా`?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇప్ప‌టివ‌ర‌కు ద్విపాత్రాభిన‌యం చేసిన సంద‌ర్భాలు లేవు. అయితే, త్వ‌ర‌లోనే ఆ ముచ్చ‌ట కూడా తీర‌నుంద‌ని స‌మాచారం.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

మ‌రో మెగా హీరోతో వ‌క్కంతం వంశీ?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రూపొందిన `నా పేరు సూర్య‌`తో ద‌ర్శ‌కుడిగా తొలి అడుగు వేశాడు ర‌చ‌యిత వ‌క్కంతం వంశీ. మొద‌టి ప్ర‌య‌త్నంలోనే నిర్దేశ‌కుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ టాలెంటెడ్ డైరెక్ట‌ర్... స్వ‌ల్ప విరామం త‌రువాత త‌న సెకండ్ వెంచ‌ర్ ని ప‌ట్టాలెక్కించ‌బోతున్నాడ‌ని టాక్.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

సాయిశ్రీ‌నివాస్ కి జోడీగా న‌భా న‌టేష్?

`ఇస్మార్ట్ శంక‌ర్`తో టాలీవుడ్ దృష్టిని విశేషంగా ఆక‌ర్షించింది క‌న్న‌డ క‌స్తూరి న‌భా న‌టేష్‌. ప్ర‌స్తుతం మాస్ మ‌హారాజా ర‌వితేజ‌కి జోడీగా `డిస్కో రాజా`లోనూ... `సుప్రీమ్` హీరో సాయితేజ్ కి జంట‌గా `సోలో బ్ర‌తుకే సో బెట‌ర్`లోనూ నాయిక‌గా న‌టిస్తోందీ టాలెంటెడ్ బ్యూటీ. ఇదిలా ఉంటే... మ‌రో క్రేజీ ప్రాజెక్ట్ లోనూ న‌భాకి అవ‌కాశం ద‌క్కింద‌ని స‌మాచారం.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

ర‌మ్య‌కృష్ణ‌కి కూతురిగా అన‌సూయ‌?

న‌ట‌న నుంచి విశ్రాంతి తీసుకున్న ఓ స్టేజ్ ఆర్టిస్ట్ విషాద‌క‌ర జీవితంతో తెర‌కెక్కుతున్న చిత్రం `రంగ‌మార్తాండ‌`. మ‌రాఠీ బ్లాక్ బ‌స్ట‌ర్ `న‌ట సామ్రాట్`కి రీమేక్ గా క్రియేటివ్ డైరెక్ట‌ర్ కృష్ణ‌వంశీ రూపొందిస్తున్న ఈ ఎమోష‌నల్ ఎంట‌ర్ టైన‌ర్ లో ప్ర‌కాష్ రాజ్ టైటిల్ రోల్ లో న‌టిస్తుండ‌గా... ఆయ‌న‌కి జోడీగా ర‌మ్య‌కృష్ణ న‌టిస్తోంది. బ్ర‌హ్మానందం ఓ ముఖ్య భూమిక పోషిస్తున్న ఈ చిత్రానికి మ్యూజిక్ మేస్ట్రో ఇళ‌య‌రాజా బాణీలు అందిస్తున్నాడు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

నాగ్ కి జోడీగా కాజ‌ల్?

కింగ్ నాగార్జున ఓ కాప్ స్టోరీ చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. `ఊపిరి` ర‌చ‌యిత సాల్మ‌న్ డైరెక్ట్ చేయ‌నున్న ఈ సినిమాలో నాగ్ కి జోడీగా టాలీవుడ్ చంద‌మామ కాజ‌ల్ అగ‌ర్వాల్ న‌టించ‌బోతోంద‌ని ప్ర‌చారం సాగుతోంది. అదే గ‌నుక నిజ‌మైతే... లావ‌ణ్య త్రిపాఠి, ర‌కుల్ ప్రీత్ సింగ్ త‌రువాత అటు నాగచైత‌న్య‌తోనూ, ఇటు నాగార్జునతోనూ రొమాన్స్ చేసిన మూడో నాయిక‌గా కాజ‌ల్ చేరుతుంది. ఇదివ‌ర‌కు చైతూకి జోడీగా కాజ‌ల్ `ద‌డ‌` చిత్రంలో న‌టించిన విష‌యం విదిత‌మే.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

కొత్త ఇంటిలోకి అడుగుపెట్టిన విజయ్

విజయ్ దేవరకొండ.. టాలీవుడ్ లో యూత్ లో మంచి క్రేజ్ ఉన్న హీరో అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పెళ్లి చూపులు సినిమాతో మంచి హిట్ కొట్టి.. అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ టాక్ ఆఫ్ ద టౌన్ అయ్యాడు. ఈ సినిమాతో కేవలం తెలుగులోనే కాదు.. తమిళ్, హిందీ లో కూడా మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు. ఇక ప్రస్తుతం నాలుగైదు సినిమాలతో బిజీ గా వున్నాడు. మరో వైపు నిర్మాతగా కూడా మారి సినిమాలు చేస్తున్నాడు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

వరుణ్ సరసన ఇస్మార్ట్ భామలు..!

ప్రస్తుతం మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ వరుస విజయాలతో ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. మొదటి సినిమా నుండే ప్రయోగాత్మక చిత్రాలు చేస్తూ మంచి సక్సెస్ లు అందుకుంటున్నాడు. ఇక ఇదే జోష్ తో మరో సినిమా కోసం అప్పుడే కసరత్తులు మొదలుపెట్టేశాడు. నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో వరుణ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో వరుణ్ బాక్సర్ గా నటించనున్నాడు. ఇక ఈసినిమా కోసం గతంలోనే ట్రైనింగ్ కూడా తీసుకున్నాడు. ఒలింపిక్‌ విన్నర్‌ టోని జెఫ్రీస్‌ పర్యవేక్షణలో ట్రైనింగ్ తీసుకున్నాడు.

TFN Adminవాట్సాప్
ట్రైలర్ & టీజర్

ఫుల్ ప్యాక్డ్ గా రానున్న 'అల వైకుంఠపురములో' టీజర్

త్రివిక్రమ్-అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా 'అల వైకుంఠపురములో'. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఒక పక్క షూటింగ్ జరుపుకుంటూనే మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలు పెట్టారు. దీనిలోభాగంగానే ఈ సినిమా నుండి ఇప్పటివరకూ 'సామజవరగమనా', 'రాములో రాములా' పాటలు రిలీజ్ చేయగా వాటికీ ఎంత రెస్పాన్స్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

TFN Adminవాట్సాప్

షేర్