అఫీషియల్ – ‘ఫ్యామిలీ మ్యాన్ 2’ లో భాగమైన సమంత

మనోజ్ బాజ్‌పెయ్, ప్రియమణి మరియు సందీప్ కిషన్ ప్రధాన పాత్రల్లో స్పై థ్రిల్లర్ గా వచ్చిన ‘ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ ఎంత పెద్ద సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అమెజాన్ ప్రైమ్ లో వచ్చిన ఈ సిరీస్ కు ఫుల్ వ్యూస్ తో పాటు, క్రేజ్ కూడా సొంతం చేసుకుంది. తెలుగు దర్శకులు రాజ్‌ నిడిమోరు, కృష్ణ డీకేలు ఈ వెబ్‌ సిరీస్‌‌ను దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో వీరు హిందీలో ‘షోర్ ఇన్ ది సిటీ’, ‘గో గోవా గాన్’ సినిమాలకు దర్శకత్వం వహించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక మొదటి సీజన్ సూపర్ హిట్ అవ్వడంతో రెండో సీజన్ కూడా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ వెబ్ సిరీస్ లో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత కూడా నటిస్తున్నట్టు ఈ మధ్య వార్తలు వచ్చిన సంగతి కూడా విదితమే. ఇప్పుడు ఈ వార్తలకు బ్రేక్ పడింది. ఈ సినిమాలో సమంత నటిస్తున్నట్టు అఫీషియల్ గా ప్రకటన వచ్చేసింది. ఈ వెబ్ సిరీస్ లో సమంత కూడా నటిస్తుంది. తమిళ్, తెలుగు లో కూడా ఈ వెబ్ సిరీస్ ను తీయనున్నారు. మరి ఈ సినిమాలో ఓ టెర్రరిస్ట్ పాత్రలో సమంత నటిస్తున్నట్టు కూడా వార్తలు వచ్చాయి. దీనిపై క్లారిటీ రావాలంటే దీనిపై కూడా అధికారిక ప్రకటన వచ్చేంత వరకూ ఆగాల్సిందే.

మరోవైపు సమంత వరుస సినిమాలు కూడా చేసుకుంటూ వెళ్తుంది. ఈ యేడాది మొదట్లో నాగ చైతన్యతో చేసిన ‘మజిలీ’ సినిమా, రీసెంట్‌గా ఆమె ప్రధాన పాత్రలో వచ్చిన ‘ఓ బేబి’ కూడా బాక్సాఫీస్ దగ్గర అదరగొట్టాయి. సమంత ప్రస్తుతం దిల్ రాజు నిర్మాణంలో వస్తున్న తమిళ సినిమా ’96’ రీమేక్‌లో శర్వానంద్‌కు జోడిగా నటిస్తోంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 5 =