ప్రస్తుతం మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ వరుస విజయాలతో ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. మొదటి సినిమా నుండే ప్రయోగాత్మక చిత్రాలు చేస్తూ మంచి సక్సెస్ లు అందుకుంటున్నాడు. ఇక ఇదే జోష్ తో మరో సినిమా కోసం అప్పుడే కసరత్తులు మొదలుపెట్టేశాడు. నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో వరుణ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో వరుణ్ బాక్సర్ గా నటించనున్నాడు. ఇక ఈసినిమా కోసం గతంలోనే ట్రైనింగ్ కూడా తీసుకున్నాడు. ఒలింపిక్ విన్నర్ టోని జెఫ్రీస్ పర్యవేక్షణలో ట్రైనింగ్ తీసుకున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ సినిమాల్లో హీరోయిన్స్ గా ఇస్మార్ట్ భామలను ఎంపిక చేసినట్టు తెలుస్తుంది. ఇస్మార్ట్ శంకర్ లో నటించిన హీరోయిన్స్ గా నిధి, నభా నటేష్ లను తీసుకున్నట్లు టాక్. అదే కనుక నిజమైతే హీరోయిన్స్ నిధి అగర్వాల్, నభా నటేష్ మరోసారి స్క్రీన్ షేర్ చేసుకుంటారన్నమాట. చూద్దాం మరి ఏం జరుగుతుందో..!
కాగా యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణ లో రినైస్సన్స్ పిక్చర్స్, బ్లూ వాటర్స్ క్రియేటివ్ బ్యానర్స్ పై నిర్మిస్తున్నారు. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్ లో ప్రారంభం కానుంది. నిర్మాత అల్లు అరవింద్ తనయుడు వెంకటేష్ బాబీ ఈ మూవీ తో నిర్మాతగా టాలీవుడ్ కు పరిచయమవుతున్నారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:






























