కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా ‘రూలర్’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. గతకొద్దికాలంగా ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇక తాజాగా ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ఈ విషయాన్నీఅధికారికంగా తెలిపారు చిత్రయూనిట్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక పోస్ట్ ప్రొడక్షన్ పనులకు సిద్దమైన ఈ సినిమా మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టింది. ఇప్పటికే ఈ సినిమా నుండి పలు పోస్టర్లు రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక తాజాగా ఈ సినిమా టీజర్ ను కూడా రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఈ సినిమా టీజర్ కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.
కాగా ఈ సినిమాలో బాలయ్యకి జోడీగా వేదిక, సోనాల్ చౌహాన్ నటిస్తుండగా… కీలక పాత్రల్లో భూమికా చావ్లా, జయసుధ, ప్రకాష్ రాజ్ నటిస్తున్నారు. హ్యాపీ మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. చిరంతన్ భట్ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో బాలకృష్ణ రెండు షేడ్స్ లో నటిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ఈ సినిమాను క్రిస్మస్ పండుగ కానుకగా ఈ సినిమాను డిసెంబర్ 20వ తేదీన రిలీజ్ చేయనున్నారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: