నటన నుంచి విశ్రాంతి తీసుకున్న ఓ స్టేజ్ ఆర్టిస్ట్ విషాదకర జీవితంతో తెరకెక్కుతున్న చిత్రం `రంగమార్తాండ`. మరాఠీ బ్లాక్ బస్టర్ `నట సామ్రాట్`కి రీమేక్ గా క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ రూపొందిస్తున్న ఈ ఎమోషనల్ ఎంటర్ టైనర్ లో ప్రకాష్ రాజ్ టైటిల్ రోల్ లో నటిస్తుండగా… ఆయనకి జోడీగా రమ్యకృష్ణ నటిస్తోంది. బ్రహ్మానందం ఓ ముఖ్య భూమిక పోషిస్తున్న ఈ చిత్రానికి మ్యూజిక్ మేస్ట్రో ఇళయరాజా బాణీలు అందిస్తున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇటీవలే పట్టాలెక్కిన ఈ సినిమా… వైజాగ్ లో సింహభాగం చిత్రీకరణ జరుపుకోనుంది. ఇదిలా ఉంటే… ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో నటి అనసూయ ఓ కీలక పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే. వినిపిస్తున్న కథనాల ప్రకారం రమ్యకృష్ణకి కూతురిగా అనసూయ పాత్ర ఉంటుందని తెలిసింది. మరి… తల్లీకూతుళ్ళుగా ఈ ఇద్దరి అభినయం ఎలా ఉంటుందో తెలియాలంటే వచ్చే ఏడాది ద్వితీయార్థం వరకు వేచిచూడాల్సిందే.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:






























