మళ్ళీ ఫామ్ లోకి వచ్చిన మెలోడీ బ్రహ్మ

Mani Sharma Back To Form Again,Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Movie Updates,Director Mani Sharma Future Projects,Mani Sharma New Movie Details,Mani Sharma Latest News,Mani Sharma Back To Back Projects

మెలోడీ బ్రహ్మ అంటే సంగీత ప్రియులకు స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు.. ఎన్నో సూపర్ హిట్ పాటలను అందించాడు. ఇళయరాజా, ఎం.ఎం.కీరవాణి, రాజ్-కోటిల దగ్గర పనిచేసిన ఆయన “సూపర్ హీరోస్” చిత్రంతో సంగీత దర్శకునిగా కెరియర్ ప్రారంభించి ఇప్పటి వరకు 200 చిత్రాలకి పైగా సంగీతాన్నందించారు. కెరీర్ మొదట మణిశర్మ బిజీ బిజీ గా సూపర్ హిట్స్ తో అందరు అగ్ర తారల సినిమాలకు మ్యూజిక్ అందించి.. అగ్రతారల మ్యూజిక్ డైరెక్టర్ గా ఎదిగాడు. ఎన్నో మెలోడీ సాంగ్స్ అందించారు. ఇరవై రెండేళ్ల సినీ ప్రస్థానంలో ఎన్నో మరపురాని విజయాల్ని సొంతం చేసుకున్నారాయన.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అయితే ఎలాంటి వారికైనా ఒక్కోసారి కాస్త కాలం కలిసిరాదు. అలానే మణిశర్మకు కూడా కొంతకాలం కాలం కలిసిరాలేదని చెప్పొచ్చు. రోజు రోజుకు పెరిగిపోతున్న కాంపిటీషన్ అవ్వచ్చు… కొత్త కొత్త మ్యూజిక్ డైరెక్టర్లు ఇండస్ట్రీకి రావడం అవ్వచ్చు ఇలా కారణం ఏదైనా మణిశర్మ కాస్త వెనక పడ్డాడు. ఈ మ‌ధ్య దేవీ, థ‌మ‌న్ కు తోడు కుర్ర సంగీత ద‌ర్శ‌కుల తాకిడి.. స్టార్ హీరోలు వీళ్ళ‌కు ప‌డిపోవ‌డంతో మ‌ణిశ‌ర్మ కాస్త సైలెంట్ అయిపోయాడు. ఆ మధ్య కాలంలో అప్పుడప్పుడు కొన్ని సినిమాలకు మ్యూజిక్ అందించినా.. ఆ సినిమాలు సరిగా ఆడకపోవడంతో మణిశర్మ కనిపించకుండా పోయాడు. ఆ మధ్య ఎన్టీఆర్ ‘టెంపర్’ సినిమాకు తన రీ రికార్డింగ్‌తో ప్రాణం పోశారు మణి. కాస్త గ్యాప్ తర్వాత సంగీత దర్శకుడిగా ‘జెంటిల్‌మన్’ సినిమాతో తన మార్క్ చూపించి ఆకట్టుకున్నారు. ఇక రీసెంట్ గా పూరీ సినిమా ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో మళ్ళీ తన సత్తా చూపించాడు. ‘ఇస్మార్ట్ శంకర్’ సాంగ్స్ ఎంత పాపులర్ అయ్యాయో తెలిసిందే. దేనితో ఇప్పుడు మళ్ళీ మణిశర్మ ను వెతుక్కుంటూ వస్తున్నారు. వరుసగా అవకాశాలు అందుకుంటూ మళ్ళీ తన బలాన్ని చూపిస్తున్నారు. ప్రస్తుతం మణిశర్మ చేతిలో నాలుగు సినిమాలు వున్నాయి.

* ఇస్మార్ట్ శంకర్ కు మంచి మ్యూజిక్ ఇవ్వడంతో పూరి జగన్నాథ్ తన అప్ కమింగ్ ఫిల్మ్ ఫైటర్ కి కూడా మణిశర్మనే ఎంపిక చేసుకున్నాడు. విజయ్ దేవరకొండ హీరోగా నటించనున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది.

* ఇక ముందుగానే కిషోర్ తిరుమల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న రామ్ పోతినేని రెడ్ సినిమాకు మణిశర్మ సెలెక్ట్ అయ్యారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది.

* మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబోలో తెరకెక్కనున్న సినిమాకు సంగీత దర్శకుడిగా మణిశర్మను చిరంజీవి సెలెక్ట్ చేశారని తెలుస్తోంది. మణిశర్మ అయితేనే కరెక్ట్ అని రామ్ చరణ్ – కొరటాల కూడా మెగాస్టార్ నిర్ణయానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.

* ఇవే కాకుండా వెంకటేష్ అసురన్ రీమేక్ కి కూడా మెలోడీ బ్రహ్మ ట్యూన్స్ కంపోజ్ చేయడానికి రెడీ అయినట్లు టాక్. ఈ సినిమాకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా ముఖ్యం కాబట్టి.. మణిశర్మ అయితేనే దీనికి కరెక్ట్ అని మణిశర్మ ను సెలెక్ట్ చేశారట.

మొత్తానికి మణిశర్మ వరుస సినిమాలతో మళ్ళీ ఫామ్ లోకి రావడం ఆనందించాల్సిన విషయమే. ఇలానే గతంలోలాగ ఫుల్ బిజీ అయిపోవాలని.. మనకు మంచి మంచి మెలోడీస్ అందించాలని కోరుకుందాం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 + 3 =