కొత్త ఇంటిలోకి అడుగుపెట్టిన విజయ్

Vijay Deverakonda Moves into a New House,latest telugu movies news, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Movie Updates, Vijay Deverakonda Becomes Proud Owner Of A Bungalow, Vijay Deverakonda Latest News, Vijay Deverakonda New House, Vijay Deverakonda New House Warming Pics, Vijay Deverakonda Owner Of New House

విజయ్ దేవరకొండ.. టాలీవుడ్ లో యూత్ లో మంచి క్రేజ్ ఉన్న హీరో అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పెళ్లి చూపులు సినిమాతో మంచి హిట్ కొట్టి.. అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ టాక్ ఆఫ్ ద టౌన్ అయ్యాడు. ఈ సినిమాతో కేవలం తెలుగులోనే కాదు.. తమిళ్, హిందీ లో కూడా మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు. ఇక ప్రస్తుతం నాలుగైదు సినిమాలతో బిజీ గా వున్నాడు. మరో వైపు నిర్మాతగా కూడా మారి సినిమాలు చేస్తున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తాజాగా విజయ్ దేవరకొండ కొత్త ఇల్లు కొన్నాడు. ఫిల్మ్‌నగర్ సమీపంలో రూ.15 కోట్లతో ఈ ఇంటిని కొనుగోలు చేసినట్టు ఫిలింనగర్ టాక్. రీసెంట్ గా కొత్త ఇంట్లో గృహప్రవేశం కూడా చేశారు. తన ఫ్యామిలీ, కొందరు సన్నిహితులతో కలిసి కొత్త ఇంట్లోకి వెళ్లారు విజయ్ దేవరకొండ. ఆ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అమ్మా, నాన్నా, తమ్ముడు ఆనంద్ దేవరకొండతో విజయ్ దిగిన ఫోటో పోస్ట్ చేయగా అది ఆకట్టుకుంటుంది.

ప్రస్తుతం ఈ హీరో ‘వరల్డ్ ఫేమస్ లవర్’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇందులో రాశిఖన్నా, ఐశ్వర్యా రాజేష్, కేథరిన్ హీరోయిన్లు నటిస్తున్నారు. గోపి సుందర్ మ్యూజిక్ అందిస్తోన్న ఈ సినిమాని ఫిబ్రవరి నెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే అవకాశాలు వున్నాయి. ఈ సినిమా పూర్తయిన తరువాత విజయ్ పూరీ తో సినిమా చేయనున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × 4 =