
ట్యాగ్ · 2027 కథనాలు · పేజీ 25


'ద ఫ్యామిలీ మ్యాన్ 2' లో సందీప్ కిషన్ కూడా..?
జిమ్ లో సక్సెస్ ఫుల్ హీరో అడివి శేష్
బిజీ బిజీ గా యంగ్ హీరో నిఖిల్
యంగ్ టైగర్ పై కన్నడ హీరో రక్షిత్ శెట్టి ప్రశంసలు
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కొత్త చిత్రం ప్రారంభం
పోరాట ఘట్టాలతో ప్రారంభం కానున్న `ఫైటర్`?
నాని, శివ నిర్వాణ... ముహూర్తం ఫిక్స్ అయ్యిందా?
జాతర సన్నివేశాల్లో రవితేజ
మెగాస్టార్ చిరంజీవితో మరోసారి శ్రియ?
క్రిమినల్ లాయర్ గా రకుల్ ప్రీత్ సింగ్
అర్జున్ సురవరం మూవీ పబ్లిక్ ఒపీనియన్
నేను ప్రతీకారం తీర్చుకునే వ్యక్తిని..!
రంగు మారింది.. ప్రేమ మారలేదు

'డిటెక్టివ్ 2' షూటింగ్ - మళ్ళీ యాక్షన్ మోడ్ లో విశాల్

సెన్సార్ పూర్తి చేసుకున్న 'ఇద్దరి లోకం ఒకటే'
ఉయ్యాలా జంపాల సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రాజ్ తరుణ్.. కెరీర్ స్టార్టింగ్ లో వరుస విజయాలను అందుకుంటూ మిగిలిన యంగ్ హీరోలకు గట్టి పోటీనే ఇచ్చాడు. అయితే గత కొద్దికాలంగా మాత్రం సరైన హిట్ లేక సతమతమవుతున్నాడు. గత ఏడాది జులై లో యూత్ ఫుల్ లవ్ ఎంటర్టైనర్ 'లవర్ ' సినిమా కూడా ఆశించినంత విజయం సాధించలేదు. దీంతో చాలా కాలం గ్యాప్ తర్వాత ఇప్పుడు 'ఇద్దరి లోకం ఒకటే' సినిమాతో రాబోతున్నాడు. ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది.

'ద ఫ్యామిలీ మ్యాన్ 2' లో సందీప్ కిషన్ కూడా..?
మనోజ్ బాజ్‌పెయ్, ప్రియమణి మరియు సందీప్ కిషన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన వెబ్ సిరీస్ ' ద ఫ్యామిలీ మ్యాన్'.అమెజాన్ ప్రైమ్ లో వచ్చిన ఈ సిరీస్ కు ఫుల్ వ్యూస్ తో పాటు, క్రేజ్ కూడా సొంతం చేసుకుంది. మొదటి సీజన్ సూపర్ హిట్ అవ్వడంతో రెండో సీజన్ కూడా తెరకెక్కిస్తున్న సంగతి కూడా విదితమే. అయితే ఈ వెబ్ సిరీస్ లో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత కూడా నటిస్తున్నట్టు అఫీషియల్ గా కూడా ప్రకటన వచ్చేసింది.

'అశ్వథ్థామ' కాన్సెప్ట్ మోషన్ పోస్టర్ రిలీజ్
నూతన దర్శకుడు రమణ తేజ దర్శకత్వంలో యంగ్ హీరో నాగసౌర్య ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా 'అశ్వథ్థామ'. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. ప్రస్తుతం పాటల చిత్రీకరణ జరుపుకుంటుంది. ఇప్పటికే టాకీ పార్ట్ పూర్తిచేసుకున్న ఈ సినిమా డబ్బింగ్ కార్యక్రమాలను కూడా మొదలు పెట్టింది చిత్రయూనిట్. ఇక తాజాగా ఈ సినిమా కాన్సెప్ట్ మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.
జిమ్ లో సక్సెస్ ఫుల్ హీరో అడివి శేష్
సూపర్ హిట్ "గూఢచారి", "ఎవరు "మూవీస్ తో టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోగా వెలుగొందుతున్న అడివిశేష్ ఒక బయోపిక్ మూవీ లో నటిస్తున్నారు. ముంబై కాల్పులలో వీర మరణం పొందిన మేజర్ ఉన్ని కృష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా "మేజర్ " మూవీ తెరకెక్కనుంది.మేజర్ ఉన్ని కృష్ణన్ పాత్రలో అడివి శేష్ నటించనున్నారు.
బిజీ బిజీ గా యంగ్ హీరో నిఖిల్
టి ఎన్ సంతోష్ దర్శకత్వంలో నిఖిల్, లావణ్య త్రిపాఠి జంటగా రూపొందిన యాక్షన్ డ్రామా "అర్జున్ సురవరం " మూవీ విజయం పై హీరో నిఖిల్ చాలా కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. దానికి తగ్గట్టుగానే ఈ రోజు రిలీజ్ అయిన ఆ మూవీ పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. హీరో నిఖిల్ ఇప్పుడు మూడు సినిమాల కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్నారు. చందు మొండేటి దర్శకత్వంలో నిఖిల్ హీరోగా రూపొందిన మిస్టరీ థ్రిల్లర్ "కార్తికేయ " మూవీ ఘనవిజయం సాధించింది. ఆ మూవీ కి సీక్వెల్ "కార్తికేయ 2 " మూవీ షూటింగ్ డిసెంబర్ లో ప్రారంభం కానుంది.

అర్జున్ సురవరం రివ్యూ - ఇంట్రెస్టింగ్ సస్పెన్స్ థ్రిల్లర్
ఓవరాల్ గా చెప్పాలంటే ప్రతి ఒక్కరూ చూసే సినిమా అని చెప్పొచ్చు. నిఖిల్ ఇంతకాలం ఆగిన దానికి ఫలితం దక్కినట్టే. మంచి సినిమాను ఎప్పుడు విడుదలైనా ప్రేక్షకులు ఆధరిస్తారు అని చెప్పడానికి ఈ సినిమా ఉదాహరణ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
యంగ్ టైగర్ పై కన్నడ హీరో రక్షిత్ శెట్టి ప్రశంసలు
పుష్కర్ ఫిల్మ్స్ బ్యానర్ పై సచిన్ దర్శకత్వంలో రూపొందిన ఫాంటసీ, ఎడ్వెంచర్, కామెడీ మూవీ "అవనే శ్రీమన్నారాయణ " కన్నడ మూవీ డిసెంబర్ 27 వ తేదీ కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ , హిందీ భాష లలో రిలీజ్ కానుంది. పాన్ ఇండియా మూవీ గా భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ తెలుగు డబ్బింగ్ వెర్షన్ "అతడే శ్రీమన్నారాయణ " మూవీ ట్రైలర్ హీరో నాని చేతులమీదుగా నిన్న హైదరాబాద్ లో రిలీజ్ అయింది.
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కొత్త చిత్రం ప్రారంభం
సక్సెస్ ఫుల్ మూవీ "రాక్షసుడు "తరువాత బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించే కొత్త చిత్రం ఈ రోజు హైదరాబాద్ రామానాయుడు స్టూడియో లో గ్రాండ్ గా ప్రారంభమయింది. సుమంత్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో సాయి శ్రీనివాస్, నభా నటేష్ జంటగా ఈ మూవీ రూపొందుతుంది. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

" సరిలేరు నీకెవ్వరు" మూవీ మ్యూజికల్ ట్రీట్
సూపర్ స్టార్ మహేష్ బాబు, రష్మిక జంటగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ "సరిలేరు నీకెవ్వరు "మూవీ జనవరి 11 వ తేదీ సంక్రాంతి కానుకగా రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. విజయశాంతి, ప్రకాష్ రాజ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. " సరిలేరు నీకెవ్వరు" మూవీ షూటింగ్ ముగింపు దశలో ఉంది. చిత్ర యూనిట్ ప్రమోషన్స్ జోరు పెంచారు.
పోరాట ఘట్టాలతో ప్రారంభం కానున్న `ఫైటర్`?
`ఇస్మార్ట్ శంకర్`తో బౌన్స్ బ్యాక్ అయిన డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్... తన నెక్ట్స్ వెంచర్ ని యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండతో ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. `ఫైటర్` పేరుతో తెరకెక్కనున్న ఈ సినిమాలో విజయ్ బాక్సర్ పాత్రలో కనిపించనున్నాడని టాక్. కథానాయిక పాత్ర కోసం `ఇస్మార్ట్` గాళ్ నిధి అగర్వాల్, `వింక్` బ్యూటీ ప్రియ ప్రకాష్ వారియర్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.
నాని, శివ నిర్వాణ... ముహూర్తం ఫిక్స్ అయ్యిందా?
నేచురల్ స్టార్ నాని కథానాయకుడిగా నటించిన `నిన్ను కోరి` చిత్రంతో దర్శకుడయ్యాడు శివ నిర్వాణ. మొదటి ప్రయత్నంలోనే మెప్పించిన ఈ టాలెంటెడ్ డైరెక్టర్... రీసెంట్ గా `మజిలీ`తో మరో మెమరబుల్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. కట్ చేస్తే... ఇప్పుడు తన మూడో చిత్రాన్ని పట్టాలెక్కించే పనిలో ఉన్నాడు శివ.
జాతర సన్నివేశాల్లో రవితేజ
`డాన్ శీను`, `బలుపు` వంటి సక్సెస్ ఫుల్ మూవీస్ తరువాత మాస్ మహారాజా రవితేజ, టాలెంటెడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో వస్తున్న చిత్రం `క్రాక్`. యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో రవితేజ పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా కనిపించనున్నారు. ఈ చిత్రంతోనే స్టన్నింగ్ బ్యూటీ శ్రుతి హాసన్ టాలీవుడ్ లో రీ-ఎంట్రీ ఇస్తోంది. అలాగే కోలీవుడ్ యాక్ట్రస్ వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రలో కనిపిస్తుంది.
మెగాస్టార్ చిరంజీవితో మరోసారి శ్రియ?
మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో చివరి (ప్రస్తుతానికి) ఇండస్ట్రీ హిట్ గా నిలచిన చిత్రం `ఠాగూర్`. తమిళ బ్లాక్ బస్టర్ `రమణ` ఆధారంగా రూపొందిన ఈ మెసేజ్ ఓరియెంటెడ్ యాక్షన్ థ్రిల్లర్... అప్పట్లో పలు రికార్డులను భూస్థాపితం చేసింది. అలాంటి సినిమాలో చిరుకి జోడీగా మెరిసిన శ్రియ... మళ్ళీ పదహారేళ్ళ తరువాత మెగాస్టార్ తో స్క్రీన్ షేర్ చేసుకోనుందట.
క్రిమినల్ లాయర్ గా రకుల్ ప్రీత్ సింగ్
ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోయే నాయికల్లో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. గ్లామర్ రోల్స్ లోనే కాదు డీ-గ్లామర్ రోల్స్ లోనూ మెప్పించిన వైనం ఈ టాలెంటెడ్ బ్యూటీ సొంతం. ఈ నేపథ్యంలోనే... మరోసారి డీ-గ్లామర్ రోల్ లో కనిపించనుంది రకుల్.
అర్జున్ సురవరం మూవీ పబ్లిక్ ఒపీనియన్
ఒక సినిమా రిలీజ్ కు ముందు తరువాత ఆ సినిమా సంబంధీకులు దాని గురించి గొప్పగా చెప్పుకుంటారు. అలా చెప్పుకోవటం సహజం కూడా. రిలీజ్ అయిన తరువాత అభిమానులు, ఫిలిం ట్రేడ్,సమీక్షకులు ఎవరి అభిప్రాయం వారు వెలిబుచ్చుతుంటారు. అయితే వీరందరి కంటే ఉన్నతమైనది, నిజమైనది, ఖచ్చితమైనది “జనాభిప్రాయం”. దీనినే “పబ్లిక్ ఒపీనియన్” అంటారు. అంటే ప్రేక్షక దేవుళ్ళు ఇచ్చే అల్టిమేట్ జడ్జిమెంట్ మాత్రమే ఒక సినిమా యొక్క భవిష్యత్తును నిర్దేశిస్తుంది.
నేను ప్రతీకారం తీర్చుకునే వ్యక్తిని..!
'నేను ప్రతీకారం తీర్చుకునే వ్యక్తిని' అంటున్నాడు ఓ యంగ్ హీరో. ఇంతకు ఆ హీరో ఎవరనుకుంటున్నారా..? ఎవరో కాదు రౌడీ హీరో గా పేరు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ. ఇంతకీ ఏ విషయంలో పగ తీర్చుకుంటా అంటున్నాడో తెలుసా..!అసలు సంగతేంటంటే.. ఇటీవల విజయ్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద అనుకున్న మేర విజయాన్ని సాధించలేకపోయాయి. దీనిపై ఆయన మాట్లాడుతూ.. ‘నేను ప్రతీకారం తీర్చుకునే వ్యక్తిని. హీరోగా జీవితం మొదలైన కొత్తలో.. నా సినిమాను ప్రజలు ఇష్టపడక పోయేవారు. నా స్నేహితులు సినిమాలు చూస్తూ మధ్యలో వెళ్లిపోయినా.. ఆ తర్వాత వారి అభిప్రాయాన్ని నాతో షేరు చేసుకునేవార’ని తెలిపాడు. నేను ఏదైతే అనుకున్నానో అది చేయడానికే సినిమాల్లోకి…

రేపు రానున్న 'అశ్వథ్థామ' కాన్సెప్ట్ మోషన్ పోస్టర్
'నర్తనశాల' సినిమాతో పరాజయంపాలైన కూడా యంగ్ హీరో నాగశౌర్య మాత్రం వరుస సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. ఒక వైపున ఇతర బ్యానర్లలో సినిమాలు చేస్తూనే, మరో వైపున తన సొంత బ్యానర్లోను నాగశౌర్య సినిమాలు చేస్తూ వెళుతున్నాడు. ప్రస్తుతం తన బ్యానర్ లో 'అశ్వథ్థామ' అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇప్పటికే టాకీ పార్ట్ పూర్తిచేసుకున్న ఈ సినిమా డబ్బింగ్ కార్యక్రమాలను కూడా మొదలు పెట్టినట్టు తెలుస్తుంది.
రంగు మారింది.. ప్రేమ మారలేదు
సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన ఆర్య సినిమా ఎంత సంచలన విజయం దక్కించుకుందో తెలుసు. ఇక ఈ సినిమా సీక్వెల్ లో వచ్చిన ఆర్య2 కూడా మంచి హిట్ అయింది. ఇక ఈ సినిమా నిన్నటితో 10 ఏళ్ళు పూర్తి చేసుకుంది. రీసెంట్‌గా నిన్నటి నవంబర్ 27 తో ఆర్య చిత్రం 10 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆసక్తికర ట్వీట్స్ చేశారు. నా ఊపిరి ఆగిపోయినా, నా ప్రాణం పోయినా సుక్కూ నిన్ను ప్రేమిస్తుంటాను అని పోస్ట్ పెట్టాడు.

'డిటెక్టివ్ 2' షూటింగ్ - మళ్ళీ యాక్షన్ మోడ్ లో విశాల్
సుందర్. సి దర్శకత్వంలో విశాల్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘యాక్షన్’. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఇప్పుడు మరో కొత్త సినిమాను లైన్ లో పెట్టాడు విశాల్. విశాల్ హీరోగా మిస్కిన్ దర్శకత్వంలో ‘డిటెక్టివ్’ సినిమా వచ్చిన సంగతి గుర్తుండేవుంటుంది కదా. విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ పై మిస్కిన్ దర్శకత్వంలో విశాల్ హీరోగా రూపొందిన తుప్పరివాలన్ తమిళ మూవీ 2017 సంవత్సరం సెప్టెంబర్ లో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. ఆ మూవీ తెలుగు డబ్బింగ్ వెర్షన్ 'డిటెక్టివ్' కూడా మూవీ ఘనవిజయం సాధించింది.

ప్రతిరోజూ పండగే నుండి 'తకిట తకిట' పాట ప్రోమో రిలీజ్
మారుతి దర్శకత్వంలో అవుట్ అండ్ అవుట్ ఫుల్ ఫ్యామిలీ ప్లస్ కామెడీ ఎంటర్టైనర్ గా సాయి తేజ్ హీరోగా వస్తున్న సినిమా ‘ప్రతిరోజూ పండగే’. తాత .. మనవడి అనుబంధం నేపథ్యంలో సాగే గ్రామీణ కథలో మనవడిగా సాయిధరమ్ తేజ్ కొత్త లుక్ తో కనిపించనున్నాడు. ప్రస్తుతం ఈ షూటింగ్ జరుపుకుంటుంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్, పాటలను విడుదల చేశారు చిత్రయూనిట్. ఈ చిత్రం నుంచి విడుదల చేసిన రెండు పాటలు కూడా సూపర్బ్ రెస్పాన్స్ సంపాదించుకున్నాయి. ఈ పాటల్ని అద్భుతంగా కంపోజ్ చేశాడు తమన్.