కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Telugu Film News 2019

ట్యాగ్ · 2027 కథనాలు · పేజీ 27

సినిమా వార్తలు

కొత్త సినిమా ప్రారంభానికి ముహూర్తం ఖరారు

కందిరీగ సినిమాతో సక్సెస్‌ఫుల్‌గా టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చిన యువ దర్శకుడు సంతోష్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా పక్కా కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న సంగతి తెలిసిందే. ఇన్ని రోజులు ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంది. ఇక తాజాగా ఈ సినిమా ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్ చేశారు. నవంబర్ 29వ తేదీన ఉదయం 9.30 గంటలకు ఫిలిం నగర్ లోని రామ నాయుడు స్టూడియో లో లాంఛనంగా ప్రారంభించనున్నారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

చిరు వీణ స్టెప్ వేయనున్న సల్మాన్..!

సల్మాన్, సోనాక్షి సిన్హా జంటగా ప్రభుదేవా దర్శకత్వంలో ‘దబాంగ్ 3’ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. దబాంగ్ మూవీ సిరీస్ లో భాగంగా దబాంగ్ 3 తెరకెక్కిస్తున్నారు. సల్మాన్ ఖాన్ ఫిల్మ్స్, అర్భాజ్ ఖాన్ ప్రొడక్షన్స్, సఫ్రాన్ బ్రాడ్ కాస్టింగ్ &మీడియా లిమిటెడ్ బ్యానర్స్ పై నిర్మిస్తున్న ఈ సినిమాను డిసెంబర్ 20 వ తేదీన రిలీజ్ చేయనున్నారు.

TFN Adminవాట్సాప్
90ఎమ్ఎల్ టైటిల్ సాంగ్ రిలీజ్
సాంగ్

90ఎమ్ఎల్ టైటిల్ సాంగ్ రిలీజ్

శేఖర్ రెడ్డి దర్శకత్వంలో కార్తికేయ హీరోగా '90ML' సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను స్టార్ట్ చేసింది. దీనిలోభాగంగానే ఈ సినిమా నుండి ఇప్పటీకే టీజర్, ట్రయిలర్ ను పాటలను రిలీజ్ చేసుకుంటూ వెళ్తున్నారు చిత్రయూనిట్. వాటికి మంచి రెస్పాన్స్ రాగా ఇప్పుడు ఈ సినిమా టైటిల్ సాంగ్ ను రిలీజ్ చేశారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

సెన్సార్ పూర్తి చేసుకున్న 'భాగ్య నగర వీధుల్లో గమ్మత్తు'

ఫ్ల‌యింగ్ క‌ల‌ర్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై శ్రీనివాస‌రెడ్డి, స‌త్య‌, ష‌క‌ల‌క శంక‌ర్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా రూపొందుతోన్న చిత్రం `భాగ్య‌న‌గ‌ర‌వీధుల్లో గ‌మ్మ‌త్తు`. ఈ చిత్రం ద్వారా క‌మెడియ‌న్‌, నటుడు శ్రీనివాస్ రెడ్డి ద‌ర్శ‌క నిర్మాత‌గా మారుతున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమాను డిసెంబ‌ర్ 6న సినిమాను విడుద‌ల చేస్తున్నారు. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు స్పీడ్ పెంచింది చిత్రయూనిట్. దీనిలో భాగంగానే ఇప్పటికే ఈ సినిమా టీజర్, ట్రైలర్ ను రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది.

TFN Adminవాట్సాప్
Athade Srimannarayana Movie Trailer Release Date Fixed, Athade Srimannarayana Movie Updates, Athade Srimannarayana Telugu Movie Latest News, Athade Srimannarayana Telugu Movie Trailer Release Date Locked, Athade Srimannarayana Trailer Release Date, A
ట్రైలర్ & టీజర్

స్టార్ హీరోల చేతుల మీదుగా రిలీజ్ కానున్న 'అతడే శ్రీమన్నారాయణ' ట్రైలర్

హీరో రక్షిత్ శెట్టి అంటే పెద్దగా అర్థంకాకపోవచ్చు కానీ హీరోయిన్ రష్మిక మాజీ లవర్ అంటే మాత్రం టక్కున బల్బ్ వెలుగుతుంది అందరికి. 'కిరిక్ పార్టీ' సినిమాలో కలిసి వీళ్లిద్దరూ కలిసి నటించారు. ఇక ఈ సినిమా చేస్తున్నప్పుడే వారిద్దరి మధ్య ప్రేమ చిగురించడం.. అది ఎంగేజ్మెంట్ వరకు వెళ్లడం...రెండేళ్ల పాటు సవ్యంగానే సాగిన వీరి ప్రేమకి కొన్ని నెలల క్రితం బ్రేకుల పడటం.. ఇవన్నీ వెంట వెంటనే జరిగిపోయాయి. ఇక ఇది వేరే స్టోరీ అనుకోండి..

TFN Adminవాట్సాప్
ట్రైలర్ & టీజర్

అశ్వమేథం ట్రైలర్ రిలీజ్

నితిన్ ద‌ర్శ‌కత్వంలో ధృవ కరుణాకర్ ప్రధాన పాత్రలో తెరకెక్కిస్తున్న సినిమా అశ్వమేథం. నిజానికి ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సి వుంది. కానీ కొన్ని కారణాల వల్ల సినిమా ఇప్పటివరకు రిలీజ్ కు నోచుకోలేదు. ఇక ఇప్పటికే ఈసినిమా నుండి ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ ను రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు మరోసారి ఈ సినిమా నుండి ట్రయిలర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

TFN Adminవాట్సాప్
ట్రైలర్ & టీజర్

వర్మ ‘ఎంటర్ ది గర్ల్ డ్రాగన్’ టీజర్ రిలీజ్

ఒక సినిమా తర్వాత ఒక సినిమా చేసుకుంటూ అసలు ఎప్పుడు షూటింగ్ మొదలైంది.. ఎక్కడ షూట్ చేశారు అన్న విషయాలు కూడా తెలియకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు వర్మ. లక్ష్మీస్ ఎన్టీఆర్’, ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ సినిమాల తర్వాత ఇంకేం షాక్ ఇవ్వబోతున్నారబ్బా అనుకుంటున్న ఫ్యాన్స్‌కు ఈసారి ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్‌తో సర్‌ప్రైజ్ చేశాడు. ‘ఎంటర్ ది గర్ల్ డ్రాగన్’ అనే ఇండో చైనీస్ సినిమాను వర్మ తెరకెక్కిస్తున్నాడు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

ప్రతీ మండే మహేష్ డే

సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు, రష్మిక జంటగా రూపొందుతున్న యాక్షన్ మూవీ "సరిలేరు నీకెవ్వరు " సంక్రాంతి కానుకగా జనవరి 11 వ తేదీ రిలీజ్ కానుంది. లేడీ అమితాబ్ విజయశాంతి ఒక కీలక పాత్ర లో నటిస్తుండగా ప్రకాష్ రాజ్, రాజేంద్ర ప్రసాద్, అనసూయ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

Team TFNవాట్సాప్
Vijay Deverakonda Dairy Full With Handful Of Movies For 2020
సినిమా వార్తలు

2020 సంవత్సరంలో విజయ్ దేవరకొండ డైరీ ఫుల్

యూత్ ఫుల్ హీరో విజయ్ దేవరకొండ కథానాయకుడిగా క్రాంతి మాధవ్ దర్శకత్వం లో రూపొందుతున్న రొమాంటిక్ డ్రామా "వరల్డ్ ఫేమస్ లవర్" మూవీ షూటింగ్ ముగింపు దశలో ఉంది. ఈ మూవీ ని ఫిబ్రవరి లో రిలీజ్ చేయడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా రూపొందనున్న "ఫైటర్ " మూవీ షూటింగ్ జనవరి నుండి ప్రారంభం కానుంది.

Team TFNవాట్సాప్
Sampoornesh Babu Met With An Accident,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Movie Updates,Actor Sampoornesh Babu Latest News,Hero Sampoornesh Babu Met With An Accident,Tollywood Actor Sampoornesh Babu Met With An
సినిమా వార్తలు

ప్రమాదానికి గురైన సంపూర్ణేష్ బాబు..!

సినీ నటుడు సంపూర్ణేష్‌ బాబుతో పాటు ఆయన కుటుంబసభ్యులకు తృటిలో ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కారును టీఎస్ ఆర్ టి సి బస్సు ఢికొట్టినట్టు తెలుస్తుంది. ఈ రోజు ఉదయం ఆయన కుటుంబ సభ్యులతో పాటుగా కారులో ప్రయాణిస్తుండగా సిద్దిపేట కొత్త బస్టాండ్ వద్ద ఆర్టీసీ బస్సు ఢీకొంది. అయితే అదృష్టవశాత్తు స్వల్ప గాయాలతో బయటపడ్డారు సంపూర్ణేష్‌ బాబు ఆయన కుటుంబసభ్యులు. ఘ‌ట‌నా స్థలికి చేరుకున్న పోలీసులు సంపూతో పాటు ఆయన కుటుంబ సభ్యులను ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ఈ ప్రమాదంపై సంపూర్ణేష్‌ బాబు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

బాలయ్యకు విలన్ గా రోజా..?

కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా 'రూలర్' సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. గతకొద్దికాలంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా చిత్రీకరణ చివరి దశకు వచ్చింది. ఇక ఒక పక్క షూటింగ్ జరుపుకుంటూనే మ‌రోవైపు ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టింది చిత్రయూనిట్. ఇప్పటికే ఈ సినిమా నుండి పలు పోస్టర్లు రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక తాజాగా ఈ సినిమా టీజర్ ను కూడా రిలీజ్ చేయగా దానికి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమాను క్రిస్మస్ పండుగ కానుకగా ఈ సినిమాను డిసెంబర్ 20వ తేదీన రిలీజ్ చేయదానికి ప్లాన్ చేస్తున్నారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

హీరో ప్రభాస్ పై పూజ హెగ్డే ప్రశంసలు

టాలీవుడ్ లో స్టార్ హీరోల మూవీస్ లో కథానాయికగా నటిస్తూ పూజ హెగ్డే బిజీగా ఉన్నారు. పూజ హెగ్డే ప్రస్తుతం జాన్ మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు. యు వి క్రియేషన్స్ , గోపీకృష్ణా మూవీస్ బ్యానర్స్ పై రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం లో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్, పూజ హెగ్డే జంటగా 60 లలో యూరోప్ నేపథ్యంలో జరిగిన ప్రేమకథ గా రూపొందుతున్న రొమాంటిక్ డ్రామా "జాన్ " మూవీ షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది. యూరోప్ లో ఒక షూటింగ్ షెడ్యూల్ పూర్తి చేసుకొన్న"జాన్ " మూవీ కి యూరోప్ బ్యాక్ డ్రాప్ లో పలు భారీ సెట్స్ హైదరాబాద్ లో రూపొందించారు.

Team TFNవాట్సాప్
Young Hero Gives Clarity On Uday Kiran Biopic,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Movie Updates,Uday Kiran Biopic Movie Updates,Uday Kiran Biopic Telugu Movie Latest News,Uday Kiran Biopic Latest News,Uday Kiran
సినిమా వార్తలు

ఉదయ్ కిరణ్ బయోపిక్ పై క్లారిటీ ఇచ్చిన యంగ్ హీరో..!

‘చిత్రం’, నువ్వు నేను’, ‘మనసంతా నువ్వే’.. ఇలా కెరీర్ ఆరంభంలోనే హ్యాట్రిక్ విజయాలను చవి చూసి.. తెలుగు సినీ పరిశ్రమలో సంచలనాన్ని సృష్టించాడు యంగ్ హీరో ఉదయ్ కిరణ్. అలా వరుస విజయాలతో దూకుడు మీద ఉన్న ఈ హీరో కెరీర్, లైఫ్‌ ఒక్కసారిగా ఒడిదుడుకులకు లోనయింది. ఇక ఆ ఒత్తిడిని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకొని చనిపోయిన సంగతి కూడా విదితమే.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

ఇంద్ర‌గంటి డైరెక్ష‌న్ లో విజ‌య్ దేవ‌ర‌కొండ‌?

యూత్ ఐకాన్ విజ‌య్ దేవ‌ర‌కొండ ప్ర‌స్తుతం `వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్`తో బిజీగా ఉన్నాడు. చిత్రీక‌ర‌ణ తుది ద‌శ‌కు చేరుకున్న ఈ రొమాంటిక్ ఎంట‌ర్ టైన‌ర్... ఫిబ్ర‌వ‌రి 14న విడుద‌ల కానుంద‌ని స‌మాచారం. ఈలోపే పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో `ఫైట‌ర్`ని ప‌ట్టాలెక్కించ‌నున్నాడు విజ‌య్. అలాగే శివ నిర్వాణ డైరెక్ష‌న్ లో ఓ ల‌వ్ స్టోరీ చేయ‌బోతున్నాడ‌ని టాక్.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

జ‌న‌వ‌రిలో ప‌ట్టాలెక్క‌నున్న `క్రిష్ 4`?

`క్రిష్` సిరీస్... బాలీవుడ్ కండ‌ల వీరుడు హృతిక్ రోష‌న్ కి `సూప‌ర్ హీరో` ఇమేజ్ ని తీసుకువ‌చ్చిన ప్రాంఛైజీ. హృతిక్ తండ్రి, ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు రాకేష్ రోష‌న్ తెర‌కెక్కించిన ఈ సిరీస్ లోని మూడు చిత్రాలూ బాక్సాఫీస్ వ‌ద్ద వ‌సూళ్ళ వ‌ర్షం కురిపించాయి. `కోయి మిల్ గ‌యా` (2003), `క్రిష్‌` (2006), `క్రిష్ 3` (2013)... ఇలా మూడు సార్లూ దేశ వ్యాప్తంగా అల‌రించిన హృతిక్... మ‌రోసారి `క్రిష్‌` పాత్ర‌లో సంద‌డి చేయ‌నున్నాడు. ఈ సీక్వెల్ కి కూడా రాకేష్ రోషన్ నే ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నాడు. కాగా... క‌థానాయ‌కుడిగా హృతిక్ న‌టించిన తొలి చిత్రం `క‌హో నా ప్యార్ హై` (దీనికి కూడా రాకేష్ రోష‌న్ ద‌ర్శ‌కుడు) ఏ తేదిన (జ‌న‌వ‌రి…

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

`అర్జున్ సుర‌వ‌రం`కి ఆ సెంటిమెంట్ ప్ల‌స్ అవుతుందా?

`ఫేక్ సర్టిఫికేట్ స్కామ్` నేప‌థ్యంలో తెర‌కెక్కిన చిత్రం `అర్జున్ సుర‌వ‌రం`. త‌మిళ బ్లాక్ బ‌స్ట‌ర్ `క‌ణిత‌న్` ఆధారంగా రూపొందిన‌ ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో నిఖిల్, లావ‌ణ్య త్రిపాఠి జంట‌గా న‌టించగా... ఒరిజిన‌ల్ వెర్ష‌న్ ద‌ర్శ‌కుడు టి. సంతోష్ తెర‌కెక్కించాడు. విడుద‌ల విష‌యంలో ప‌లు ఇబ్బందులు చూసిన ఈ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్... ఎట్టకేల‌కు ఈ నెల 29న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

క్రేజీ హీరోయిన్స్ రీ-ఎంట్రీకి కేరాఫ్ అడ్ర‌స్ గా మాస్ మ‌హారాజా

`కాట‌మ‌రాయుడు` (2017) త‌రువాత టాలీవుడ్ కి దూర‌మైన శ్రుతి హాస‌న్... మాస్ మ‌హారాజా ర‌వితేజ `క్రాక్`తో రీ-ఎంట్రీ ఇస్తున్న సంగ‌తి తెలిసిందే. `బ‌లుపు` వంటి విజ‌య‌వంత‌మైన చిత్రం త‌రువాత త‌న ల‌క్కీ హీరో (ర‌వితేజ‌) కాంబినేష‌న్ లో వ‌స్తున్న సినిమా కావ‌డంతో... శ్రుతి ఈ కాప్ స్టోరీపై భారీ ఆశ‌లే పెట్టుకుంది.

Team TFNవాట్సాప్
స్పెషల్

ఫెస్టివ‌ల్ సీజ‌న్స్ లో పోలీస్ ప‌వ‌ర్

ఈ సారి క్రిస్మ‌స్, సంక్రాంతి సీజ‌న్స్ లో ప‌లు ఆస‌క్తిక‌ర‌మైన చిత్రాలు బాక్సాఫీస్ వ‌ద్ద సంద‌డి చేయ‌నున్నాయి. క్రిస్మ‌స్ సీజ‌న్ లో నాలుగు చిత్రాలు (రూల‌ర్, ప్ర‌తి రోజూ పండ‌గే, దబాంగ్ 3 (హిందీ డ‌బ్బింగ్), ఇద్ద‌రి లోకం ఒక‌టే)... సంక్రాంతి సీజ‌న్ లో మ‌రో నాలుగు సినిమాలు (ద‌ర్బార్, స‌రిలేరు నీకెవ్వ‌రు, అల వైకుంఠ‌పుర‌ములో, ఎంత మంచివాడ‌వురా) ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాయి.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

దర్శకుడు సుకుమార్ కు ప్రత్యేక ధన్యవాదాలు -అల్లుఅర్జున్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరో గా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన "ఆర్య "మూవీ 2004 సంవత్సరంలో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఆ మూవీ అల్లు అర్జున్ జీవితాన్నే మార్చేసింది. "ఆర్య" మూవీ కి సీక్వెల్ గా "ఆర్య2" మూవీ రూపొంది 2009 సంవత్సరం నవంబర్ 27 వ తేదీ రిలీజ్ అయ్యింది. ఈ రోజు తో "ఆర్య2" మూవీ 10 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొంది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

ఆ పాత్ర ఇవ్వమని వేడుకున్నాను..!

కాగా కేవలం హీరోగానే కాకుండా అన్ని రకాల పాత్రలు చేస్తూ అతి తక్కువ కాలంలోనే వైవిధ్యమైన నటుడిగా గుర్తుంపు తెచ్చుకున్నారు విజయ్. తెలుగు, తమిళ సినిమాలతో వరుస సినిమాలతో బిజీగా బిజీగా దూసుకుపోతున్నాడు. ఇక ఇటీవలే విజయసేతుపతి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యారు. ప్రస్తుతం ఆయన తెలుగులో అల్లు అర్జున్ 20మూవీ , సాయి తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా రూపొందుతున్న ఉప్పెన మూవీ లో విలన్ గా నటిస్తున్నాడు.

TFN Adminవాట్సాప్

షేర్