‘అర్జున్ సురవరం’ నిఖిల్ కెరీర్ బెస్ట్ ఓపెనింగ్

Arjun Suravaram First Day Share

మొత్తానికి లేట్ గా వచ్చిన లేటెస్ట్ గా వస్తా అన్న రేంజ్ లో ఫైనల్ థియేటర్స్ కు వచ్చి మంచి హిట్ టాక్ తెచ్చుకున్నాడు నిఖిల్ ‘అర్జున్ సురవరం’ తో. విడుదలకు ఎన్నో ఇబ్బందుల పై ఫైనల్ గా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక మొదటిరోజే ఈ సినిమా మంచి టాక్ ను తెచ్చుకుంది. అంతేకాదు కలెక్షన్స్ పరంగా కూడా ఈ సినిమా పరవాలేదనిపించింది. మొదటిరోజే 4.1కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అందుకున్నట్లు తెలుస్తోంది. గతంలో ఎప్పుడు లేని విధంగా మొదటిరోజే మంచి షేర్స్ అందుకున్నాడు. ఇక వీకెండ్ కాబట్టి ఈ రెండు రోజుల్లో మంచి కలెక్షన్స్ రాబట్టే అవకాశం వుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా టి.ఎన్ సంతోష్ దర్శకత్వంలో నిఖిల్ హీరోగా కోలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘కనితన్’ కి రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కింది. లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను.. బి. మధు సమర్పణలో మూవీస్ డైనమిక్స్ ఎల్ఎల్పీ &ఔరా సినిమాస్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్స్ పై రాజ్ కుమార్ ఆకేళ్ల , కావ్య వేణుగోపాల్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × one =