‘సరిలేరు నీకెవ్వరు’ నుండి రానున్న ‘Mind Block’

Mind Block Song From Sarileru Neekevvaru To Be Unveiled Today,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Sarileru Neekevvaru Movie Updates,Sarileru Neekevvaru Telugu Movie Latest News,Sarileru Neekevvaru Songs,Sarileru Neekevvaru Movie Songs,Sarileru Neekevvaru Telugu Movie Songs,Mind Block Song From Sarileru Neekevvaru Movie,Mind Block Song From Sarileru Neekevvaru Telugu Movie

‘సరిలేరు నీకెవ్వరు’ నుండి ప్రతి సోమవారం ఇక పాటను రిలీజ్ చేస్తూ మ్యూజికల్ ట్రీట్ ఇస్తామని చిత్రయూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. చెప్పినట్టే ఈ రోజు ఈ సినిమా నుండి ఒక పాటను రిలీజ్ చేస్తున్నట్టు పోస్టర్ ద్వారా తెలిపారు. ఈ రోజున సాయంత్రం 5:04 నిమిషాలకి Mind Block .. అంటూ సాగే లిరికల్ సాంగ్ ను విడుదల చేయనున్నారు. ఇక ఈ పాట కోసం మహేష్ అభిమానులు ఇప్పటినుండే ఎదురుచూస్తున్నారు. మరి చూద్దాం దేవి తన మార్క్ చూపిస్తాడేమో…

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న సినిమా సరిలేరు నీకెవ్వరు. ప్రస్తుతం ఈ సినిమా కేరళలో ఆఖరి షెడ్యూల్ ను జరుపుకుంటుంది. ఈ లాంగ్ షెడ్యూల్‌లో కొన్ని కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ఇక ఒక పక్క షూటింగ్ జరుపుతూనే.. మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాలు స్టార్ట్ చేశారు చిత్రయూనిట్. దీనిలో భాగంగానే ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేశారు. ఇక ఈ టీజర్ ఎన్ని కొత్త రికార్డులు క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటివరకు ఏ సినిమాకు సాధ్యం కానీ విధంగా ఈ టీజర్ ఆల్ టైం రికార్డ్స్ బద్దలు కొట్టింది.

ఇక ఈ సినిమాలో మహేష్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా.. ఈ సినిమాలో విజయశాంతి, రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అనిల్ సుంకర, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 11 వ తేదీన విడుదలచేయనున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 + five =