కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

కంగనా తో అసెంబ్లీకి వెళ్లనున్న ప్రకాష్ రాజ్..!

Kangana Ranaut Latest News, Kangana Ranaut Upcoming Movie News, Latest Telugu Movies News, Prakash Raj Going Assembly Along With Kangana, Prakash Raj Latest News, Prakash Raj To Go To Assembly With Kangana Ranaut, Prakash Raj Upcoming Movie News, Tel

కంగనా తో అసెంబ్లీకి వెళ్లనున్న ప్రకాష్ రాజ్..!

Prakash Raj To Go To Assembly With Kangana Ranaut

Kangana Ranaut Latest News, Kangana Ranaut Upcoming Movie News, Latest Telugu Movies News, Prakash Raj Going Assembly Along With Kangana, Prakash Raj Latest News, Prakash Raj To Go To Assembly With Kangana Ranaut, Prakash Raj Upcoming Movie News, Tel

ఏ ఎల్ విజయ్ దర్శకత్వంలో దివంగత తమిళనాడు ముఖ్య మంత్రి జయలలిత బయోపిక్ 'తలైవి' రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో జయలలిత పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగన రనౌత్ నటిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక ఇటీవలే ఈ సినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.

ఇక ఈసినిమాలో ఎం.జి.రామచంద్రన్ మరియు కరుణానిధి పాత్రలు కూడా కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఎం.జి.రామచంద్రన్ పాత్రలో అరవింద్‌ స్వామి నటించబోతుండగా..అదే విధంగా మరో కీలక పాత్ర మాజీ సీఎం కరుణానిధి పాత్రలో నటుడు ప్రకాష్ రాజ్ నటిస్తున్నారు. ఈ నేపథ్యంలో కంగనాతో ప్రకాష్ రాజ్ అసెంబ్లీ కి వెళ్లనున్నట్టు తెలుస్తుంది. తర్వాత షెడ్యూల్ లో ప్రకాష్ రాజ్ మరియు కంగనా మీద అసెంబ్లీ సన్నివేశాలను షూట్ చేయనున్నారట.

ఇంకా ఈ సినిమాలో జగపతి బాబు, జయసుధ, సత్యరాజ్ ముఖ్య పాత్రలలో నటించనున్నట్టు తెలుస్తుంది. విబ్రి మీడియా బ్యానర్ పై విష్ణు ఇందూరి నిర్మాణ సారథ్యం లో ఈ సినిమా రూపొందుతుంది. ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ రైటర్ గా పనిచేస్తున్న ఈ మూవీ కి జీవీ ప్రకాష్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను తమిళ్ తో పాటు తెలుగు , హిందీ భాషల్లో కూడా విడుదలకానుంది.

వీడియోస్

సంబంధిత వార్తలు

అన్నీ
వాట్సాప్‌లో షేర్ చేయండి

షేర్