కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Telugu Film News 2019

ట్యాగ్ · 2027 కథనాలు · పేజీ 24

ట్రైలర్ & టీజర్

'డిస్కో రాజా' టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్

వీఐ ఆనంద్ దర్శకత్వంలో రవితేజ 'డిస్కోరాజా' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సైంటిఫిక్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. దీనితో ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు చిన్నగా మొదలు పెట్టింది చిత్రయూనిట్. ఇప్పటికే పలు పోస్టర్లు.. మొదటి పాటని రిలీజ్ చేశారు. ఇక తాజాగా మరో అప్ డేట్ ఇచ్చింది చిత్రయూనిట్.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

'విజయ్ 64' ఇంపార్టెంట్ అనౌన్స్ మెంట్

తమిళ్ లో సూపర్ స్టార్ రజినీకాంత్ తర్వాత అంతటి ఇమేజ్, స్టార్‌డమ్ తెచ్చుకున్న హీరో విజయ్‌.. ఇటీవల ‘బిగిల్’ (విజిల్) సినిమాతో మరో సూపర్ హిట్ కొట్టాడు. ప్రస్తుతం ‘ఖైదీ’ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన లోకేష్ కనగరాజు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక తాజాగా ఈ సినిమా నుండి ఇంపార్టెంట్ అనౌన్స్ మెంట్ ఇచ్చారు చిత్రయూనిట్.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

'హుషారు' డైరెక్టర్ తో విజయ్..!

'డియర్ కామ్రేడ్' సినిమా తర్వాత విజయ్ కథల ఎంపిక విషయంలోకి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ప్రస్తుతం క్రాంతి మాధవ్ డైరెక్షన్ లో 'వరల్డ్ ఫేమస్ లవర్' లాంటి రొమాంటిక్ లవ్ స్టోరీ లో నటిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా తాజాగా ప్రమోషన్‌ కార్యక్రమాలు ప్రారంభించింది. ఇప్పటికే టైటిల్ పోస్టర్ ను, ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. ఇక ఈ సినిమాను డిసెంబర్ లోనే రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్.

TFN Adminవాట్సాప్
Nivetha Pethuraj To Play Lead Role In Red Movie
సినిమా వార్తలు

'రెడ్' సినిమాలో భాగమైన నివేదా

కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఎనర్జిటిక్ హీరో రామ్ ప్రధాన పాత్రలో 'రెడ్' అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తమిళంలో సూపర్ హిట్ అయిన 'తడం' సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ నుఇటీవలే రిలీజ్ చేయగా.. రామ్ లుక్స్ ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ఈ చిత్రంలో రామ్ రెండు డిఫెరెంట్ లుక్స్‌లో కనిపించనున్నట్టు తెలుస్తుంది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

భాగమతి మూవీ హిందీ రీమేక్ టైటిల్ "దుర్గావతి"

జి .అశోక్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ అనుష్క ప్రధాన పాత్రలో రూపొందిన హారర్ థ్రిల్లర్ "భాగమతి " మూవీ 2018 సంవత్సరం జనవరిలో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. బ్లాక్ బస్టర్ "భాగమతి " మూవీ హిందీ లో "దుర్గావతి " గా రీమేక్ కానుంది. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ సమర్పణలో అబుడెంటియా ఎంటర్ టైన్ మెంట్స్ , టి .సిరీస్ బ్యానర్స్ పై అశోక్ దర్శకత్వంలో "దుర్గావతి " మూవీ రూపొందనుంది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

గీతా ఆర్ట్స్ లోనే మరో సినిమా..!

వరుస ప్లాప్స్ తర్వాత చిత్రలహరి సినిమాతో మళ్ళీ ఫామ్ లోకి వచ్చాడు సాయి తేజ్. కథలు ఎంచుకునే విషయం లో చాలా జాగ్రత్తలు తీసుకొని ఫైనల్ గా మారుతి డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు. మారుతి దర్శకత్వంలో అవుట్ అండ్ అవుట్ ఫుల్ ఫ్యామిలీ ప్లస్ కామెడీ ఎంటర్టైనర్ గా ‘ప్రతిరోజూ పండగే’ సినిమా తెరకెక్కుతుంది. అల్లు అరవింద్ సమర్పణలో యూవీ క్రియేషన్స్, జీఏ2 పిక్చర్స్ బ్యానర్లపై బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎస్.ఎస్.తమన్ సంగీతం అందిస్తుండగా.. జయకుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. డిసెంబర్ 20వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

TFN Adminవాట్సాప్
Ala Vaikunthapurramloo Team Birthday Wishes To Nivetha Pethuraj,Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Movie Updates,Nivetha Pethuraj Birthday Special,Happy Birthday Nivetha Pethuraj,Nivetha Pethuraj Birthday Sp
సినిమా వార్తలు

"అల .. వైకుంఠపురములో" మూవీ టీమ్ బర్త్ డే విషెస్

సక్సెస్ ఫుల్ "మెంటల్ మదిలో " మూవీ తో టాలీవుడ్ లో ప్రవేశించిన నివేత పేతురాజ్ , ఆ మూవీ తరువాత కోలీవుడ్ లో బిజీగా మారారు. నివేత నటించిన సాయి తేజ్ "చిత్రలహరి ", శ్రీవిష్ణు "బ్రోచేవారెవరురా " మూవీస్ విజయం సాధించాయి. నివేత ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న "అల .. వైకుంఠపురములో ." మూవీలో నటిస్తున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

రాశీ ఖన్నా పుట్టిన రోజు - 'వెంకీ మామ' నుండి స్పెషల్ గిఫ్ట్

బాబి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, నాగచైతన్య మల్టీస్టారర్ గా 'వెంకీమామ' సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇక ఈ సినిమా రిలీజ్ విషయంలో ఇప్పటికీ కాస్త కన్ఫ్యూజన్ వుంది. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం వుంది. ఇప్పటికే ఈ సినిమా నుండి రెండు సాంగ్స్ విడుదల చేశారు. రీసెంట్ గా నాగ చైతన్య పుట్టిన రోజున నాగ చైతన్య చేస్తున్న కెప్టెన్ కార్తీక్ రోల్ కి సంబంధించి ఓ వీడియో విడుదల చేయగా ఈ రోజు రాశి ఖన్నా పుట్టిన రోజు సందర్భంగా 'వెంకీమామ' టీమ్ ఆమెకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ సినిమా నుంచి తనకు సంబంధించిన ఒక డైలాగ్ వీడియోను విడుదల చేశారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

ఒకే ఒక్క నిర్ణయం తీసుకొన్నా -రష్మిక

బ్లాక్ బస్టర్ హిట్ "ఛలో "మూవీ తో కోలీవుడ్ లో ప్రవేశించిన శాండల్ వుడ్ హీరోయిన్ రష్మిక , గీత గోవిందం " మూవీ ఘనవిజయం తో స్టార్ హీరోయిన్ స్టేటస్ పొందారు. ఒక వైపు కన్నడ మూవీస్ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా ఉంటూనే రష్మిక తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రూపొందుతున్న "సరిలేరు నీకెవ్వరు " , యంగ్ హీరో నితిన్ కథానాయకుడిగా రూపొందుతున్న "భీష్మ " మూవీ లోనూ నటిస్తున్నారు . AA 20 మూవీ లో హీరోయిన్ గా ఎంపిక అయిన రష్మిక , "సుల్తాన్ "తమిళ మూవీ తో కోలీవుడ్ కు ఎంటర్ అవుతున్నారు.

Team TFNవాట్సాప్
సాంగ్

'ప్రతిరోజూ పండగే' తకిట తకిట ఫుల్ సాంగ్ రిలీజ్

మారుతి దర్శకత్వంలో అవుట్ అండ్ అవుట్ ఫుల్ ఫ్యామిలీ ప్లస్ కామెడీ ఎంటర్టైనర్ గా సాయి తేజ్ హీరోగా వస్తున్న సినిమా ‘ప్రతిరోజూ పండగే’. తాత .. మనవడి అనుబంధం నేపథ్యంలో సాగే గ్రామీణ కథలో మనవడిగా సాయిధరమ్ తేజ్ కొత్త లుక్ తో కనిపించనున్నాడు. ప్రస్తుతం ఈ షూటింగ్ జరుపుకుంటుంది. ఇక ఈ చిత్రం నుంచి విడుదల చేసిన రెండు పాటలు రిలీజ్ చేయగా కూడా సూపర్బ్ రెస్పాన్స్ సంపాదించుకున్నాయి. ఇక మొన్న ఈ సినిమా మరో పాట 'తకిట తకిట' ప్రోమోను రిలీజ్ చేయగా ఈ రోజు తాజాగా ఫుల్ సాంగ్ ను రిలీజ్ చేశారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

సెన్సార్‌పైన సినిమా తీస్తా..!

సంచలన దర్శకుడైన రామ్ గోపాల్ వర్మ 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' అనే మరొక వివాదస్పద సినిమా తో వస్తున్న సంగతి తెలిసిందే. ఇక తన సినిమాలకు ఎప్పుడూ వచ్చే ప్రాబ్లమే ఈ సినిమాకు కూడా వచ్చింది. అసలు టైటిల్ తోనే వివాదానికి తెరలేపిన వర్మ.. ఆఖరికి అదే టైటిల్ మార్చాల్సి వచ్చింది. అమ్మరాజ్యంలో కడప బిడ్డలు అని టైటిల్ ను మార్చారు. ఇప్పుడు సినిమా రిలీజ్ కు కూడా ఇబ్బందులు వచ్చాయి. సినిమా విడుదలపై హైకోర్ట్ స్టే ఇచ్చింది. సెన్సార్‌ సభ్యులకు కొంత సమయమిచ్చి పరిశీలించాలని కోరింది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

పోలీస్ ఆఫీసర్ పాత్రలో కాజల్ అగర్వాల్ ?

టాలీవుడ్, కోలీవుడ్ లలో స్టార్ హీరోయిన్ స్టేటస్ తో ప్రేక్షకులను అలరిస్తున్న కాజల్ అగర్వాల్ కు ఒక ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ ఆఫర్ వచ్చినట్టుగా సమాచారం. కాజల్ అగర్వాల్ ప్రస్తతం "ఇండియన్ 2"("భారతీయుడు 2"), తెలుగు, ఇంగ్లీష్ భాషలలో రూపొందుతున్న "మోసగాళ్లు " మూవీస్ షూటింగ్స్ తో బిజీగా ఉన్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

హీరో నాని కి జోడీగా రీతువర్మ?

హీరో నాని ప్రస్తుతం మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ "V" మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. నాని ఇప్పుడు ఒక రొమాంటిక్ ఎంటర్ టైనర్ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. డిఫరెంట్ జానర్ మూవీస్ లో నటిస్తూ హీరో నాని ప్రేక్షకులను అలరిస్తున్నారు.

Team TFNవాట్సాప్
బాక్సాఫీస్

డిసెంబ‌ర్ 20... ఇంట్రెస్టింగ్ బాక్సాఫీస్ క్లాష్‌

ఈ ఏడాది క్రిస్మ‌స్ సీజ‌న్ లో ఒకే తేదిన నాలుగు ఆస‌క్తిక‌ర‌మైన చిత్రాలు బ‌రిలోకి దిగుతున్నాయి. దీంతో... బాక్సాఫీస్ క్లాష్ ర‌స‌వ‌త్త‌రంగా మారింది. ఆ తేది డిసెంబ‌ర్ 20 కాగా... ఆ చిత్రాలు `రూల‌ర్`, `ప్ర‌తి రోజూ పండ‌గే`, `దొంగ‌`, `ద‌బంగ్ 3`.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

య‌న్టీఆర్ `యుగంధ‌ర్`కి 40 ఏళ్ళు

మ‌హాన‌టుడు య‌న్టీఆర్ స్ట్ర‌యిట్ మూవీస్ తో ఎలాగైతే సెన్సేష‌న్ క్రియేట్ చేశారో... రీమేక్ చిత్రాల‌తోనూ అలాగే ప‌లు రికార్డులు సృష్టించారు. అలా... ఆ తార‌క రాముడు న‌టించిన సెన్సేష‌న‌ల్ రీమేక్ మూవీస్ లో `యుగంధ‌ర్` ఒక‌టి. హిందీ చిత్రం `డాన్` (1978) (అమితాబ్ బ‌చ్చ‌న్) ఆధారంగా రూపొందిన ఈ యాక్ష‌న్ డ్రామాలో జ‌య‌సుధ క‌థానాయిక‌గా న‌టించ‌గా... జ‌య‌మాలిని, స‌త్య‌నారాయ‌ణ, జ‌గ్గ‌య్య‌, ప్ర‌భాక‌ర్ రెడ్డి, కాంతారావు త‌దిత‌రులు ఇత‌ర ముఖ్య భూమిక‌లు పోషించారు. యాక్ష‌న్ మూవీస్ కి కేరాఫ్ అడ్ర‌స్ గా నిల‌చిన కె.య‌స్.ఆర్. దాస్ ద‌ర్శ‌క‌త్వంలో పి.విద్యా సాగ‌ర్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

Team TFNవాట్సాప్
రిలీజ్ అప్‌డేట్

రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న‌ `దొంగ‌`

దీపావ‌ళికి `ఖైదీ`గా సెన్సేష‌న్ క్రియేట్ చేసిన కోలీవుడ్ స్టార్ కార్తి... క్రిస్మ‌స్ కి `దొంగ‌`గా ప‌ల‌క‌రించ‌బోతున్నాడు. ఫ్యామిలీ థ్రిల్ల‌ర్ గా తెర‌కెక్కిన ఈ త‌మిళ అనువాద చిత్రం... త‌మిళంలో `తంబి` పేరుతో రిలీజ‌వుతోంది. రియ‌ల్ లైఫ్ లో కార్తికి వ‌దిన అయిన జ్యోతిక ఇందులో అత‌నికి అక్క‌గా న‌టించ‌డం విశేషం. మ‌ల‌యాళ `దృశ్యం` ద‌ర్శ‌కుడు జీతూ జోసెఫ్ రూపొందించిన ఈ చిత్రం డిసెంబ‌ర్ 20న తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఒకే సారి విడుద‌ల కానుంది. ఈ విష‌యాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్ర‌క‌టించింది. కాగా, ఈ రోజు (శ‌నివారం) రెండు భాష‌ల్లోనూ ఆడియోని రిలీజ్ చేయ‌బోతున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

నిత్యా కౌంటర్ కంగనాకేనా..!

ఇప్పుడు ఎక్కడ చూసినా బయోపిక్ ల ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎంతో మంది బయోపిక్ లు తెరకెక్కగా.. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా బయోపిక్ తెరకెక్కుతున్న సంగతి కూడా విదితమే. అయితే ఈ బయోపిక్ విషయంలో మాత్రం ఓ ప్రత్యేకత ఉంది. ఇప్పటివరకూ తెరకెక్కిన పలువురి ప్రముఖుల బయోపిక్ లు ఒక్కటి మాత్రమే తెరకెక్కాయి. కానీ ఒక్క జయలలిత బయోపిక్ పై మాత్రం మూడు సినిమాలు వస్తున్నాయి.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

కొత్త ఇంటిలోకి అడుగుపెట్టిన లక్ష్

టాలీవుడ్ యంగ్ హీరోలు కెరీర్ లో కాస్త నిలదొక్కుకుంటున్నారో లేదో వెంటనే కొత్త ఇళ్లను మాత్రం కొనేస్తున్నారు. రీసెంట్ గా విజయ్ దేవరకొండ మంచి ఎక్స్పెన్సివ్ ఇల్లును కొని గృహప్రవేశం చేయగా.. తాజాగా మరో యంగ్ హీరో కూడా ఆ లిస్ట్ లో చేరిపోయాడు. ఆ హీరో ఎవరో కాదు లక్ష్. తాను కూడా ఓ లగ్జరీ ఇల్లును కొన్నాడు. నేడు పలువురు సినీ పెద్దల సమక్షంలో కొత్త ఇంటిలోకి అడుగుపెట్టాడు లక్ష్.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

సెన్సార్ పూర్తి చేసుకున్న 'తూటా'

గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో ధనుష్ హీరోగా తెరకెక్కుతున్న రొమాంటిక్ థ్రిల్లర్ 'ఎన్నై నోక్కి పాయిమ్ తోట్ట'. తెలుగులో ఈ సినిమాను 'తూటా' టైటిల్ తో రిలీజ్ చేయనున్నారు. ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. నిజానికి ఈ సినిమాను ఎప్పుడో మొదలుపెట్టారు. సినిమా కూడా ఎప్పుడో పూర్తయింది కాని రిలీజ్ కు మాత్రం నోచుకోలేదు. ఇప్పటికి రెండు మూడుసార్లు విడుదల చివరి క్షణంలో నిలిచిపోయింది. ఈ రోజు కూడా ఈ సినిమా రిలీజ్ అవ్వాలి కానీ అది కూడా జరగలేదు. డిసెంబర్ లో మరో మంచి డేట్ కోసం చూస్తున్నారట చిత్ర బృందం.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

'90 ML' ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముహూర్తం ఖరారు

శేఖర్ రెడ్డి దర్శకత్వంలో కార్తికేయ హీరోగా '90ML' సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను స్టార్ట్ చేసింది. దీనిలోభాగంగానే ఈ సినిమా నుండి ఇప్పటీకే టీజర్, ట్రయిలర్, పాటలను ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

TFN Adminవాట్సాప్

షేర్