ట్యాగ్ · 2027 కథనాలు · పేజీ 19
విజయశాంతి `భారతనారి`కి 30 ఏళ్ళు
బాలయ్యకి జోడీగా కీర్తి సురేష్?
సెన్సార్ పూర్తిచేసుకున్న `వెంకీమామ`

ధృవ్ ఎఫర్ట్స్ కు ఫలితమే 'అశ్వమేథం'

'మత్తు వదలరా' టీజర్ రిలీజ్ కు ముహూర్తం ఖరారు

'వెంకీమామ' ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్
లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో మల్టీ స్టారర్ మూవీ ?
'డిస్కో రాజా' టీజర్ రిలీజ్

90ML మూవీ రివ్యూ

"ఫైటర్ " మూవీ లో హీరోయిన్ కియారా అద్వానీ ?

"హాథీ మేరే సాథీ " మూవీ షూటింగ్ పూర్తి
హీరో శ్రీవిష్ణు కొత్త మూవీ ప్రారంభం
'హీరో హీరోయిన్' రిలీజ్ డేట్ ఫిక్స్
హీరో బాలకృష్ణ 106 వ మూవీ ప్రారంభం
`అల వైకుంఠపురములో` స్టోరీ లైన్ అదేనా?
రాశీఖన్నాకి రెండోసారి అదే పరిస్థితి
`విజేత` దర్శకుడితో అల్లు హీరో?
గీతా ఆర్ట్స్ బ్యానర్ లో హీరో కార్తికేయ ?
బ్లాక్ బస్టర్ "RX 100 "మూవీ లో హీరోగా నటించి యూత్ లో ఎనలేని క్రేజ్ సంపాదించుకున్న కార్తికేయ నటించిన "హిప్పీ ", "గుణ 369 " మూవీస్ నిరాశ పరిచాయి. హీరో కార్తికేయ మోడరన్ దేవదాసు గా నటించిన 90ML మూవీ నిన్న రిలీజ్ అయ్యి మిశ్రమ స్పందన పొందింది. మూవీస్ ఫలితాలు ఎలా ఉన్నా కార్తికేయ కు యూత్ లో ఉన్న క్రేజ్ ఏ మాత్రం చెక్కుచెదరలేదు.
విజయశాంతి `భారతనారి`కి 30 ఏళ్ళు
లేడీ సూపర్ స్టార్ విజయశాంతి పేరు వినగానే పలు బ్లాక్ బస్టర్ ఫిమేల్ సెంట్రిక్ ఫిల్మ్స్ కళ్ళ ముందు కదలాడతాయి. వాటిలో `భారతనారి` ఒకటి. తనకు జరిగిన అన్యాయానికి ఓ మగువ ఎలా ప్రతీకారం తీర్చుకుంది? అనే అంశంతో ఈ సినిమా రూపొందింది. ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో ఈతరం ఫిలింస్ సంస్థ నిర్మించిన ఈ చిత్రం... బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించడమే కాకుండా `ఉత్తమ నటి`గా విజయశాంతికి `నంది` పురస్కారాన్ని అందించింది.
బాలయ్యకి జోడీగా కీర్తి సురేష్?
నటసింహ నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ క్రేజీ ప్రాజెక్ట్ రూపొందుతున్న సంగతి తెలిసిందే. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలు శుక్రవారం హైదరాబాద్ లో జరిగాయి. కాగా, రెగ్యులర్ షూటింగ్ ని త్వరలోనే ప్రారంభించనున్నారు.
సెన్సార్ పూర్తిచేసుకున్న `వెంకీమామ`
విక్టరీ వెంకటేష్ టైటిల్ రోల్ లో నటించిన చిత్రం `వెంకీమామ`. యువ సామ్రాట్ నాగచైతన్య మరో కథానాయకుడిగా నటించిన ఈ సినిమాకి బాబీ (కె.యస్.రవీంద్ర) దర్శకత్వం వహించాడు. వెంకీకి జోడీగా పాయల్ రాజ్ పుత్, చైతూకి జంటగా రాశీఖన్నా నటించిన ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని డి.సురేష్ బాబు, టీజీ విశ్వప్రసాద్ సంయుక్తంగా నిర్మించారు.

ధృవ్ ఎఫర్ట్స్ కు ఫలితమే 'అశ్వమేథం'
నితిన్.జి దర్శకత్వంలో దృవ కరుణాకరన్ హీరోగా తెరకెక్కిన ‘ఇంటెన్స్ స్పై థ్రిల్లర్' అశ్వమేథం. సైబర్ క్రైమ్ ఏదో ఒక రూపంలో జరుగుతూనే ఉంది. అలాంటి సైబర్ క్రైమ్ నేపథ్యాన్ని ఆవిష్కరింప చేసే చిత్రమే `అశ్వమేథం`. ఔరోస్ అవతార్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై ప్రియా నాయర్, వందన యాదవ్, ఐశ్వర్య యాదవ్, శుభ మల్హోత్రా, రూపేష్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక సినిమాకు మంచి టాక్ నే సొంతం చేసుకుంది.

'మత్తు వదలరా' టీజర్ రిలీజ్ కు ముహూర్తం ఖరారు
నూతన దర్శకుడు రితేష్ రానా దర్శకత్వంలోప్రముఖ సంగీత దర్శకుడు MM కీరవాణి తనయుడు సింహ కోడూరి హీరోగా వస్తున్న న్యూ ఏజ్ మూవీ మత్తువదలరా. ఈ సినిమా ద్వారా సింహ హీరో గా టాలీవుడ్ కు పరిచయమవుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది.

'వెంకీమామ' ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్
బాబి దర్శకత్వంలో వెంకటేష్, నాగ చైతన్య కాంబినేషన్ లో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ 'వెంకీమామ'. రిలీజ్ డేట్ ప్రకటించిన తర్వాత 'వెంకీమామ' చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాల్లో జోరు పెంచింది. ఇప్పటికే పలు పోస్టర్ లు, టీజర్, పాటలు రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక తాజాగా ఈ సినిమా ట్రయిలర్ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు చిత్రయూనిట్. రేపు సాయంత్రం 8 గంటలకు ఈ సినిమా ట్రయిలర్ ను రిలీజ్ చేస్తున్నట్టు ఓ పోస్టర్ ను రిలీజ్ చేసి అధికారికంగా ప్రకటించారు.

అశ్వమేథం మూవీ రివ్యూ
ఓవరాల్ గా చెప్పాలంటే మంచి టెక్నికల్ సినిమా చూడాలంటే అశ్వమేథం చూడొచ్చు అని చెప్పొచ్చు.
ఈరోజు రిలీజ్ కానున్న శ్రద్ధాదాస్ 'ఈ ఆఫీస్ లో' వెబ్ సిరీస్
డిజిటల్ మీడియా ప్రపంచాన్ని ఏలుతున్న రోజులివి. ఈ రోజుల్లో స్టార్ హోదాతో సంబంధం లేకుండా చాలా మంది డిజిటల్ ప్లాట్ ఫార్మ్ లోకి అడుగుపెడుతున్నారు. అంతేకాదు ఈ ఫ్లాట్ ఫామ్ ద్వారానే ఎంతోమంది టాలెంట్ పర్సన్స్ కూడా బయటకు వస్తున్నారు. ఇక ఇప్పటీకే చాలా మంది హీరోయిన్ లు వెబ్ సిరీస్ లలో నటిస్తుండగా ఇప్పుడు మరో హీరోయిన్ కూడా ఆ లిస్ట్ లో చేరింది.
లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో మల్టీ స్టారర్ మూవీ ?
తమిళ, తెలుగు భాషలలో ఘనవిజయం సాధించిన "ఖైదీ " మూవీ దర్శకుడు లోకేష్ కనకరాజ్ ప్రస్తుతం దళపతి విజయ్ హీరోగా దళపతి 64 (వర్కింగ్ టైటిల్ ) మూవీ కి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ తరువాత లెజెండరీ యాక్టర్స్ కమల్ హాసన్, రజనీకాంత్ లతో ఒక మల్టీ స్టారర్ మూవీ రూపొందించనున్నారని సమాచారం.
'డిస్కో రాజా' టీజర్ రిలీజ్
వీఐ ఆనంద్ దర్శకత్వంలో రవితేజ 'డిస్కోరాజా' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సైంటిఫిక్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. దీనితో ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు చిన్నగా మొదలు పెట్టింది చిత్రయూనిట్. సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో రవితేజ తండ్రీకొడుకులుగా డ్యూయెల్ రోల్‌లో దర్శనమివ్వనున్నాడు. ఇక ఇప్పటికే పలు పోస్టర్లు.. మొదటి పాటని రిలీజ్ చేశారు. ఇక తాజాగా ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేశారు.

90ML మూవీ రివ్యూ
ఓవరాల్ గా లవ్ ప్లస్ కామెడీ ప్లస్ యాక్షన్ సీన్స్ అన్ని కలిసి కూల్ అండ్ కిక్ ఇచ్చే సినిమా అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు..

"ఫైటర్ " మూవీ లో హీరోయిన్ కియారా అద్వానీ ?
పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్ బ్యానర్ పై పూరి కనెక్ట్స్ (పూరి జగన్నాథ్ , ఛార్మి ) నిర్మాణసారథ్యంలో యూత్ ఫుల్ హీరో విజయ్ దేవరకొండ కథానాయకుడిగా యాక్షన్ ఎంటర్ టైనర్ "ఫైటర్ "మూవీ జనవరిలో సెట్స్ పైకి వెళ్ళనున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో విజయ్ దేవరకొండ బాక్సర్ గా నటించనున్నారు. "ఫైటర్ "మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ ముగింపు దశలో ఉంది. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు .

"హాథీ మేరే సాథీ " మూవీ షూటింగ్ పూర్తి
కలర్ ఎల్లో ప్రొడక్షన్స్ బ్యానర్ పై నేషనల్ అవార్డ్ విన్నర్ ప్రభు సోలమన్ దర్శకత్వంలో రానా దగ్గుబాటి హీరోగా "హాథీ మేరే సాథీ "మూవీ తెలుగు, తమిళ, హిందీ భాషలలో రూపొందుతుంది. "హాథీ మేరే సాథీ "మూవీ తెలుగు వెర్షన్ టైటిల్ "అడవిరాముడు ". ఈ మూవీ లో రానా పర్యావరణ కార్యకర్తగా నటించారు. జోయా హుస్సేన్ కథానాయిక.
హీరో శ్రీవిష్ణు కొత్త మూవీ ప్రారంభం
వైవిధ్య భరిత మూవీస్ లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న యువ కథానాయకుడు శ్రీ విష్ణు కొత్త మూవీ ఈ రోజు హైదరాబాద్ లో పూజ కార్యక్రమం జరుపుకుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై నూతన దర్శకుడు హాసిత్ గోలి దర్శకత్వంలో శ్రీవిష్ణు హీరో గా ఒక కామెడీ ఎంటర్ టైనర్ మూవీ రూపొందనుంది.
'హీరో హీరోయిన్' రిలీజ్ డేట్ ఫిక్స్
అడ్డా, ఓటర్ చిత్రాల డైరెక్టర్ జి.ఎస్. కార్తీక్ దర్శకత్వంలో నవీన్ చంద్ర, గాయత్రి సురేష్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న సినిమా 'హీరో హీరోయిన్'. పైరసీ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టింది చిత్రయూనిట్. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది.
హీరో బాలకృష్ణ 106 వ మూవీ ప్రారంభం
మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మాణసారథ్యం లో నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ద్వారకక్రియేషన్స్ బ్యానర్ పై #BALAKRISHNA 106 మూవీ ఈరోజు హైదరాబాద్ లో పూజ కార్యక్రమం జరుపుకొంది. బోయపాటి, బాలకృష్ణ కాంబినేషన్ లో రూపొందిన "సింహా ", "లెజెండ్ " మూవీస్ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. వీరి కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ గా రూపొందుతున్న ఈ మూవీ కి థమన్ సంగీతం అందిస్తున్నారు.
`అల వైకుంఠపురములో` స్టోరీ లైన్ అదేనా?
కుటుంబ బంధాలకు పెద్ద పీట వేసే దర్శకుల్లో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకరు. తొలి చిత్రం `నువ్వే నువ్వే` నుంచి గత చిత్రం `అరవింద సమేత` వరకు కథాంశం ఏదైనా, తన సినిమాల్లో కుటుంబ బంధాలు, విలువలకు చోటిచ్చారు త్రివిక్రమ్. ఈ నేపథ్యంలోనే... అప్ కమింగ్ ఫిల్మ్ `అల వైకుంఠపురములో` లోనూ ఓ ఇంట్రెస్టింగ్ పాయింట్ చుట్టూ ఫ్యామిలీ ఎమోషన్స్ ని జోడించారని టాక్.
రాశీఖన్నాకి రెండోసారి అదే పరిస్థితి
వారం వ్యవధిలో ఒకే కథానాయిక నటించిన రెండు సినిమాలు విడుదల కావడం అప్పుడప్పుడు చోటుచేసుకునే అంశమే. అయితే, బ్యాక్ టు బ్యాక్ ఇయర్స్ లో ఇలాంటి పరిస్థితిని చూస్తోంది రాశి.
`విజేత` దర్శకుడితో అల్లు హీరో?
ఈ ఏడాది వేసవిలో `ఏబీసీడీ` (అమెరికన్ బోర్న్ కన్ ఫ్యూజ్డ్ దేశీ) అంటూ సందడి చేసిన యువ కథానాయకుడు అల్లు శిరీష్... స్వల్ప విరామం తరువాత కొత్త చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట.