ఈరోజు రిలీజ్ కానున్న శ్రద్ధాదాస్ ‘ఈ ఆఫీస్ లో’ వెబ్ సిరీస్

డిజిటల్ మీడియా ప్రపంచాన్ని ఏలుతున్న రోజులివి. ఈ రోజుల్లో స్టార్ హోదాతో సంబంధం లేకుండా చాలా మంది డిజిటల్ ప్లాట్ ఫార్మ్ లోకి అడుగుపెడుతున్నారు. అంతేకాదు ఈ ఫ్లాట్ ఫామ్ ద్వారానే ఎంతోమంది టాలెంట్ పర్సన్స్ కూడా బయటకు వస్తున్నారు. ఇక ఇప్పటీకే చాలా మంది హీరోయిన్ లు వెబ్ సిరీస్ లలో నటిస్తుండగా ఇప్పుడు మరో హీరోయిన్ కూడా ఆ లిస్ట్ లో చేరింది.

తెలుగులో పలు చిత్రాల్లో విభిన్నమైన పాత్రలు పోషించిన శ్రద్ధాదాస్ చాలా గ్యాప్ తర్వాత ఇప్పుడు తెలుగులో వెబ్ సిరీస్ తో వస్తుంది. “ఈ ఆఫీస్ లో” అనే ఈ వెబ్ సిరీస్ లో శ్రద్దా దాస్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే “ఈ ఆఫీస్ లో” సీజన్ 1 రాగా అందులో ఆఫీస్ లో ఎంప్లాయిస్ జర్నీ ఎలా ఉంటుంది అనేది చూపించారు. ఇప్పుడు “ఈ ఆఫీస్ లో” సీజన్ 2 వస్తుంది. ఇందులోనే శ్రద్దా దాస్ నటిస్తుంది. ఈ సీజన్ లో రెండు కంపెనీల మధ్య ఒకదానికొకటి పోటీ పడటాన్ని చూపిస్తారు. ఇక ఈ వెబ్ సిరీస్ లో శ్రద్దా దాస్ స్ట్రిక్ట్ బాస్ గా కనిపించనున్నట్టు తెలుస్తుంది. బిజినెస్ మేనేజ్మెంట్ లో స్ట్రాటజీస్.. బిజినెస్ ప్లానింగ్ లో మంచి ఎక్స్పర్ట్ గా చేయనున్నట్టు తెలుస్తుంది. ఇదిలా ఉండగా ఈ రోజు ఈ సీజన్ ను రిలీజ్ చేయనున్నారు. ‘వ్యూ’ యాప్ లో ఈ వెబ్ సిరీస్ ను రిలీజ్ చేయనున్నారు.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here