లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో మల్టీ స్టారర్ మూవీ ?

Lokesh Kanagaraj To Direct A Multi Starrer Movie

తమిళ, తెలుగు భాషలలో ఘనవిజయం సాధించిన “ఖైదీ ” మూవీ దర్శకుడు లోకేష్ కనకరాజ్ ప్రస్తుతం దళపతి విజయ్ హీరోగా దళపతి 64 (వర్కింగ్ టైటిల్ ) మూవీ కి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ తరువాత లెజెండరీ యాక్టర్స్ కమల్ హాసన్, రజనీకాంత్ లతో ఒక మల్టీ స్టారర్ మూవీ రూపొందించనున్నారని సమాచారం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కమల్ హాసన్ హీరోగా నటించిన “అపూర్వ రాగంగళ్ ” మూవీ లో చిన్న పాత్రలో నటించి రజనీకాంత్ కోలీవుడ్ కు పరిచయమయ్యారు. రజని , కమల్ హీరోలుగా సుమారు 10 సినిమాలలో కలసి నటించారు. 40 సంవత్సరాల క్రితం ఇద్దరూ కలసి నటించకూడదని నిర్ణయించుకొన్నారు. ఆనిర్ణయం తీసుకొన్న తరువాత రజనీకాంత్ హీరోగా నటించిన రెండు సినిమాలలో కమల్ అతిధి పాత్రలలో నటించడం విశేషం. ఇప్పటికే కమల్ రాజకీయాలలో ప్రవేశించారు. రజని కూడా రాజకీయాలలో ప్రవేశించనున్నారు. 2021 సంవత్సరం లో తమిళనాడు అసెంబ్లీ ఎలక్షన్స్ లో పాల్గొంటారు. ఎలక్షన్స్ కు ముందే ఇద్దరూ కలసి నటించాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. స్టార్ హీరోలు ఇద్దరూ ఒకే మూవీ లో
నటిస్తే అభిమానుల ఆనందానికి హద్దే ఉండదు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 4 =