బాల‌య్య‌కి జోడీగా కీర్తి సురేష్‌?

Keerthy Suresh To Pair Up With Nandamuri Balakrishna

న‌ట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ క‌థానాయ‌కుడిగా బోయ‌పాటి శ్రీ‌ను ద‌ర్శ‌క‌త్వంలో ఓ క్రేజీ ప్రాజెక్ట్ రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే. మిర్యాల ర‌వీంద‌ర్ రెడ్డి నిర్మిస్తున్న‌ ఈ సినిమాకి సంబంధించిన పూజా కార్య‌క్ర‌మాలు శుక్ర‌వారం హైద‌రాబాద్ లో జ‌రిగాయి. కాగా, రెగ్యుల‌ర్ షూటింగ్ ని త్వ‌ర‌లోనే ప్రారంభించ‌నున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉంటే… ఈ చిత్రంలోకి బాల‌య్యకి జోడీగా కీర్తి సురేష్ ని న‌టింప‌జేసే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయ‌ని స‌మాచారం. ఇప్ప‌టికే బోయ‌పాటి చెన్నై వెళ్ళి కీర్తికి క‌థ వినిపించాడ‌ని… క‌థ‌తో పాటు త‌న పాత్ర కూడా న‌చ్చ‌డంతో కీర్తి ఈ సినిమాలో న‌టించేందుకు ఆస‌క్తి చూపిస్తోంద‌ని టాక్. మ‌రి… `య‌న్.బి.కె. 106` టీమ్ లో కీర్తి సురేష్ జాయిన్ అవుతుందో లేదో తెలియాలంటే మ‌రికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.

థ‌మ‌న్ సంగీత‌మందిస్తున్న ఈ చిత్రం 2020 వేస‌వి చివ‌ర‌లో థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌నుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 + 12 =