‘హీరో హీరోయిన్’ రిలీజ్ డేట్ ఫిక్స్

అడ్డా, ఓటర్ చిత్రాల డైరెక్టర్ జి.ఎస్. కార్తీక్ దర్శకత్వంలో నవీన్ చంద్ర, గాయత్రి సురేష్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న సినిమా ‘హీరో హీరోయిన్’. పైర‌సీ నేప‌థ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టింది చిత్రయూనిట్. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇప్పుడు తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు చిత్ర యూనిట్. డిసెంబర్ 27వ తేదీన ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

కాాగా స్వాతి పిక్చర్స్ పతాకంపై భార్గవ్ మన్నె నిర్మిస్తున్న ఈ సినిమాలో.. డింపుల్ చొపాడియా, పోసాని కృష్ణమురళి, 30 ఇయర్స్ పృథ్వీ, అభిమన్యుసింగ్, గౌతమ్‌రాజు, శివన్నారాయణ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: అనూప్‌రూబెన్స్, ఆర్ట్: కిరణ్‌కుమార్ మన్నె, కెమెరా వెంకట్ గంగాధరీ, ఎడిటర్: జునైద్ సిద్ధిఖి, నిర్మాత: భార్గవ్ మన్నె, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: జి.ఎస్.కార్తీక్.

అందాల రాక్ష‌సి సినిమాతో హీరోగా ప‌రిచ‌యం అయిన న‌వీన్ చంద్ర ఆ తర్వాత పలు సినిమాల్లో నటించిన పెద్దగా ఆడిన దాఖలాలు లేవు. ఈ మ‌ధ్య హీరోగా కొన్ని కీలక పాత్రల్లో..విల‌న్ పాత్రల్లో కూడా వేసాడు. ఇక ఇప్పుడు చాలా రోజుల త‌ర్వాత ఈ సినిమాతో వస్తున్నాడు. మరి చూద్దాం ఈ సినిమాతో ఆయన నవీన్ మంచి కమ్ బ్యాక్ ఇస్తాడేమో..

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen + 6 =