విజ‌య‌శాంతి `భార‌తనారి`కి 30 ఏళ్ళు

Vijayashanti Bharatha Nari Completes 30 Years

లేడీ సూప‌ర్ స్టార్ విజ‌య‌శాంతి పేరు విన‌గానే ప‌లు బ్లాక్ బ‌స్ట‌ర్ ఫిమేల్ సెంట్రిక్ ఫిల్మ్స్ క‌ళ్ళ ముందు క‌ద‌లాడ‌తాయి. వాటిలో `భార‌తనారి` ఒక‌టి. త‌న‌కు జ‌రిగిన అన్యాయానికి ఓ మ‌గువ ఎలా ప్ర‌తీకారం తీర్చుకుంది? అనే అంశంతో ఈ సినిమా రూపొందింది. ముత్యాల సుబ్బ‌య్య ద‌ర్శ‌క‌త్వంలో ఈత‌రం ఫిలింస్ సంస్థ నిర్మించిన ఈ చిత్రం… బాక్సాఫీస్ వ‌ద్ద ఘ‌న‌విజ‌యం సాధించ‌డ‌మే కాకుండా `ఉత్త‌మ న‌టి`గా విజ‌య‌శాంతికి `నంది` పుర‌స్కారాన్ని అందించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

వినోద్ కుమార్, ముర‌ళీ మోహ‌న్, దేవ‌రాజ్, సుత్తి వేలు, న‌ర్రా త‌దిత‌రులు ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో న‌టించిన ఈ సినిమాకి చ‌క్ర‌వ‌ర్తి బాణీలు అందించారు. మ‌హిళ‌ల్లో స్ఫూర్తినింపే క‌థాంశంతో తెర‌కెక్కిన `భార‌త‌నారి`… 1989 డిసెంబ‌ర్ 7న విడుద‌లైంది. నేటితో ఈ చిత్రం 30 వ‌సంతాల‌ను పూర్తిచేసుకుంటోంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.