వారం వ్యవధిలో ఒకే కథానాయిక నటించిన రెండు సినిమాలు విడుదల కావడం అప్పుడప్పుడు చోటుచేసుకునే అంశమే. అయితే, బ్యాక్ టు బ్యాక్ ఇయర్స్ లో ఇలాంటి పరిస్థితిని చూస్తోంది రాశి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళితే… 2018 ఫిబ్రవరిలో `టచ్ చేసి చూడు`, `తొలి ప్రేమ` రూపంలో బ్యాక్ టు బ్యాక్ వీక్స్ రిలీజెస్ తో సందడి చేసిన రాశి… ఈ సంవత్సరం డిసెంబర్ లో `వెంకీమామ`, `ప్రతి రోజూ పండగే` రూపంలో అదే ఫీట్ ని మరోసారి రిపీట్ చేస్తోంది. ఫిల్మ్ మేకర్ హారికగా రాశి నటించిన `వెంకీమామ` డిసెంబర్ 13న రిలీజవుతుంటే… టిక్ టాక్ సెలబ్రిటీ ఏంజెల్ ఆర్ణగా నటించిన `ప్రతి రోజూ పండగే` డిసెంబర్ 20న విడుదలవుతోంది.
పోయినేడాది బ్యాక్ టు బ్యాక్ వీక్ రిలీజెస్ లో `తొలిప్రేమ` రూపంలో సక్సెస్ చూసిన రాశి… ఈ సారి రెండు చిత్రాలతోనూ బ్లాక్ బస్టర్స్ అందుకుంటుందేమో చూడాలి.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: