అశ్వమేథం మూవీ రివ్యూ

నితిన్ ద‌ర్శ‌కత్వంలో ధృవ కరుణాకర్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా అశ్వమేథం. ఈసినిమా నుండి ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ ను రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. మరి ఔరోస్‌ అవతార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై ఐశ్వ‌ర్య యాద‌వ్, ప్రియా నాయ‌ర్ కలిసి నిర్మించిన ఈ సినిమా ఆ అంచనాలను అందుకుందో లేదో తెలియాలంటే రివ్యూ లోకి వెళ్లాల్సిందే.

నటీనటులు – ధృవ కరుణాకర్, శివాంగి, సుమ‌న్, ప్రియ‌ద‌ర్శి, వెన్నెల కిషోర్, సాన్యా తదితరులు..
దర్శకత్వం – నితిన్
బ్యానర్ – ఔరోస్‌ అవతార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్
సంగీతం – చ‌ర‌ణ్ అర్జున్
సినిమాటోగ్రఫి – జయపాల్‌ రెడ్డి

కథ:

భారత దేశ ఆర్థిక వ్యవస్థను కూల్చడానికి కొందరు దేశ ద్రోహులు ప్రొఫెషనల్ హ్యాకర్స్ ద్వారా ప్రయత్నాలు చేస్తుంటారు. దీని వెనకున్న నేరస్థులను పట్టుకోవడానికి ధృవ్ ( ధృవ్ కరుణాకరణ్) అండర్ కవర్ ఐ బి ఏజెంట్ గా రంగంలోకి దిగుతాడు. ఆ నేరస్థులను పట్టుకొనే క్రమంలో ఐ బి ఆఫీసర్ శంకర్ కైలాష్( సుమన్) ధృవ్ కి సహాయపడుతూ ఉంటారు. అసలు ఈ దేశ ద్రోహులు ఎవరు? వారు మన ఆర్థిక వ్యవస్థలను ఎందుకు కూల్చాలని అనుకుంటున్నారు? ధృవ్ వారిని ఎలా పట్టుకున్నాడు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ:

ఈ రోజుల్లో టెక్నాలజీ ఎంత పెరిగిందో చూస్తూనే వున్నాం. ఇక ఈ టెక్నాలజీని మంచికి ఉపయోగించడం కంటే చెడుకు ఉపయోగించే వాళ్ళే ఎక్కువ వున్నారు. ఆ పాయింట్ తోనే సైబర్ క్రైమ్ నేపథ్యంలో సినిమాను తెరెకెక్కించాడు నితిన్. దేశ ఆర్థిక భద్రతకు సైబర్ దాడుల వలన ఎలాంటి ముప్పు పొంచి వుంది అనే విషయాన్ని బాగా చూపించాడు.

ఇక ఈ సినిమా విషయానికి వస్తే.. మొదటి సినిమా అయినా కూడా ధృవ్ చాలా బాగా నటించాడు. ధృవ్ ఐ బి అండర్ కవర్ ఏజెంట్ గా బాగా చేశాడు. ఈ పాత్ర కోసం ఆయన తన ఫిజిక్ నుండి డాన్స్ లు మరియు ఫైట్స్ విషయంలో ప్రత్యేక శ్రద్ద తీసుకున్నాడు. ఈ సినిమాలో యాక్షన్ ఎలిమెంట్స్ చాలా బలంగా ఉండటం… దానికి తోడు ఓ మంచి స్టోరీ లైన్ తో రావడం.. హీరో కూడా స్టార్ హీరోలకు ఏమాత్రం తీసిపోకుండా యాక్షన్స్ చేయడం ఇవన్నీ సినిమాకు ప్లస్ అయ్యాయి. అలాగే అండర్ కవర్ ఏజెంట్ గా ధృవ్, ఐ బి ఆఫీసర్ గా సుమన్ మధ్య వచ్చే సన్నివేశాలు తెరకెక్కించిన తీరు ఆకట్టుకుంది. ఇక ఈ మూవీలో హీరోయిన్స్ గా చేసిన సోన్యా మరియు శివాంగి తమ పాత్ర పరిధిలో పర్వాలేదు అనిపించారు.

ఇంకా ప్రముఖ కమెడియన్లు వెన్నెల కిషోర్, ప్రియదర్శి తమ కామెడీతో నవ్వించారు. అటు యాక్షన్, కామెడీ అన్ని ఎలిమెంట్స్ బాగా కుదరడంతో సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది.

నిర్మాణ విలువలు బావున్నాయి. చరణ్ అర్జున్ అందించిన సంగీతం.. సాంగ్స్ బాగున్నాయి. ఇక జయ్ పాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ సన్నివేశాలకు తగ్గట్టుగా ఆకట్టుకొనే విజువల్స్ తో మెప్పించింది.

ఓవరాల్ గా చెప్పాలంటే మంచి టెక్నికల్ సినిమా చూడాలంటే అశ్వమేథం చూడొచ్చు అని చెప్పొచ్చు.

అశ్వమేథం మూవీ రివ్యూ
  • Story
  • Screenplay
  • Direction
  • Performance
3.5
Sending
User Review
0 (0 votes)

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here