సాహో సినిమాతో మంచి హిట్ అందుకున్న ప్రభాస్ ఇప్పుడు ‘జాన్’ సినిమాతో వస్తున్న సంగతి తెలిసిందే కదా. ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలైంది. 1970 కాలంనాటి పీరియాడికల్ లవ్ స్టోరీగా రూపొందుతున్న ఈ చిత్రం ఇప్పటికే కొన్ని రోజులు షూటింగ్ ను జరుపుకుంది.అయితే మధ్యలో సాహో సినిమా షూటింగ్, ప్రమోషన్లతో బిజీ అయిన ప్రభాస్జాన్ సినిమాకు కాస్త బ్రేక్ ఇచ్చాడు. మళ్ళీ ఇప్పుడు జాన్ షూటింగ్ లో బిజీ అయ్యాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి వినిపిస్తుంది. ఈ మూవీ బడ్జెట్ కూడా భారీగానే ఉన్నట్లు సమాచారం. పీరియాడిక్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న నేపథ్యంలో సాహో అంత కాకపోయినా జాన్ కొరకు 150 నుండి 180కోట్ల వరకు బడ్జెట్ పెట్టనున్నారని తెలుస్తుంది.
కాగా ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుంది. భారీ బడ్జెట్ తో గోపికృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మిగిలిన వివరాలను త్వరలోనే తెలియజేయనున్నారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: