కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

భారీ రేటు కు 'అల వైకుంఠపురములో' రైట్స్..?

భారీ రేటు కు 'అల వైకుంఠపురములో' రైట్స్..?

భారీ రేటు కు 'అల వైకుంఠపురములో' రైట్స్..?

Ala Vaikunthapurramloo Movie Rights Sold For A Huge Price

భారీ రేటు కు 'అల వైకుంఠపురములో' రైట్స్..?

త్రివిక్రమ్-అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా 'అల వైకుంఠపురములో'. ఈ సినిమా షూటింగ్ తుది దశకు చేరుకుంది. ఒక పక్క షూటింగ్ జరుపుకుంటూనే మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలు పెట్టారు చిత్రయూనిట్. దీనిలోభాగంగానే ఈ సినిమా నుండి ఇప్పటివరకూ 'సామజవరగమనా', 'రాములో రాములా', 'ఓ మై డాడీ' పాటలు రిలీజ్ చేయగా త్వరలోనే టీజర్ ను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

ఇదిలా ఉండగా అలవైకుంఠపురంలో డిజిటల్ రైట్స్ విషయంలో ఓ ఆసక్తికర వార్త బయటికి వచ్చింది. ఓ ప్రముఖ డిజిటల్ సంస్థ అలవైకుంఠపురంలో డిజిటల్ రైట్స్ భారీ ధర చెల్లించి దక్కించుకుందట. దీనికి సంబంధించి డీల్ కూడా పూర్తయిందని తెలుస్తుంది.

కాగా ఈ సినిమాలో మరోసారి పూజా హెగ్డే బన్నీతో జతకట్టనుంది. ఇంకా ఈ సినిమాలో టబు, సత్యరాజ్, రాజేంద్ర ప్రసాద్, సునీల్, నవదీప్, బ్రహ్మాజీ, రావు రమేష్, మురళీ శర్మ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. హారిక-హాసిని క్రియేషన్స్‌, గీతా ఆర్ట్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాను 2020 సంక్రాంతికి జనవరి 12వ రిలీజ్ చేయనున్నారు. మరి త్రివిక్రమ్ - అల్లు అర్జున్ కాంబినేషన్లో వస్తున్న మూడో సినిమా ఇది. మరి ఈ సినిమాతో హ్యాట్రిక్ కొడతారేమో చూద్దాం.

వీడియోస్

సంబంధిత వార్తలు

అన్నీ
వాట్సాప్‌లో షేర్ చేయండి

షేర్