కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

'రూలర్' ట్రైలర్ రిలీజ్

Ruler Movie Trailer Out Now

'రూలర్' ట్రైలర్ రిలీజ్

Ruler Movie Trailer Out Now

Ruler Movie Trailer Out Now

కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా 'రూలర్' సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.రీసెంట్ గా షూటింగ్ ను పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేసుకుంటుంది. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టింది. ఇప్పటికే ఈ సినిమా నుండి పలు పోస్టర్లు, టీజర్ ను రిలీజ్ చేయగా... వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు తాజాగా ఈ సినిమా ట్రయిలర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

కాగా ఈ సినిమాలో బాల‌య్య‌కి జోడీగా వేదిక‌, సోనాల్ చౌహాన్ న‌టిస్తుండ‌గా… కీల‌క పాత్ర‌ల్లో భూమికా చావ్లా, జ‌య‌సుధ‌, ప్ర‌కాష్ రాజ్ న‌టిస్తున్నారు. హ్యాపీ మూవీస్ ప‌తాకంపై ప్ర‌ముఖ నిర్మాత సి.క‌ళ్యాణ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. చిరంత‌న్ భ‌ట్ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో బాలకృష్ణ రెండు షేడ్స్ లో నటిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ఈ సినిమాను క్రిస్మస్ పండుగ కానుకగా ఈ సినిమాను డిసెంబర్ 20వ తేదీన రిలీజ్ చేయనున్నారు.

వీడియోస్

సంబంధిత వార్తలు

అన్నీ
వాట్సాప్‌లో షేర్ చేయండి

షేర్