‘అర్జున్ సురవరం’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్

Arjun Suravaram First Week Collections

విడుదలకు ఎన్నో ఇబ్బందులు వచ్చినా ఫైనల్ విడుదలై మొత్తానికి డీసెంట్ హిట్ టాకే తెచ్చుకుంది నిఖిల్ ‘అర్జున్ సురవరం’. నవంబర్ 29 వ తేదీన రిలీజ్ ఐన ఈ సినిమా మొదటిరోజే మంచి టాకే తెచ్చుకొని… కలెక్షన్స్ పరంగా కూడా పరవాలేదనిపించింది. మొదటిరోజే 4.1కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అందుకొని… నిఖిల్ గతంలో ఎప్పుడు లేని విధంగా మొదటిరోజే మంచి షేర్స్ అందుకున్నాడు.ఇక ఈ సినిమా వన్ వీక్ లో మంచి కలెక్షన్సే రాబట్టిన్నట్టు తెలుస్తుంది.

ఈ చిత్రాన్ని 6 కోట్లకుఅమ్మగా … ఫస్ట్ వీక్ కే మొత్తం రాబట్టినట్టు తెలుస్తుంది. ఏపీ, తెలంగాణలో మొదటివారానికి ఈ సినిమా 5.18 కోట్లు ప్రపంచ వ్యాప్తంగా 6 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టినట్టు తెలుస్తుంది. ఈ వారం కూడా పెద్దగా ఆసక్తికరమైన సినిమాలు లేవు కాబట్టి… ‘అర్జున్ సురవరం’ మరికొంత రాబట్టే అవకాశం ఉందని చెబుతున్నారు ట్రేడ్ విశ్లేషకులు.

కాగా టి.ఎన్ సంతోష్ దర్శకత్వంలో నిఖిల్ హీరోగా కోలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘కనితన్’ కి రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కింది. లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను.. బి. మధు సమర్పణలో మూవీస్ డైనమిక్స్ ఎల్ఎల్పీ &ఔరా సినిమాస్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్స్ పై రాజ్ కుమార్ ఆకేళ్ల , కావ్య వేణుగోపాల్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here