యూట్యూబ్ లో 7వ స్థానంలో దూసుకుపోతున్న ‘రౌడీబేబీ’ సాంగ్

Rowdy Baby Song Creates New Records

ధనుష్ హీరోగా, సాయి పల్లవి హీరోయిన్ గా మారి 2 అనే సినిమా వచ్చిన సంగతి తెలిసిందే కదా. ఈ సినిమా రిజల్ట్ సంగతి పక్కన పెడితే ఈ సినిమాలోని రౌడీ బేబీ పాట మాత్రం యూ ట్యూబ్ లో ఎన్ని రికార్డ్స్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమాలోని ‘రౌడీ బేబీ’ సాంగ్‌ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అందుకే సినిమా విడుదలైన కొద్ది రోజులకే చిత్రయూనిట్‌ రౌడీబేబీ వీడియో సాంగ్‌ను యూట్యూబ్‌లో విడుదల చేసింది. అప్పటి నుంచి రికార్డులు సృష్టిస్తూనే వుంది. ఇక తాజాగా మరో రికార్డు ను క్రియేట్ చేసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇప్పటి వరకూ 716 మిలియన్ వ్యూస్ ను అధిగమించి దూసుకుపోతూ యూట్యూబ్ రికార్డుల్లో 7వ స్థానాన్ని సొంతం చేసుకుంది. ‘రౌడీ బేబీ’ వీడియో సాంగ్ టాప్ 7లో నిలిచి రికార్డులను సృష్టించింది. ఈ విషయాన్ని యూట్యూబ్ స్వయంగా ప్రకటించడం విశేషం. కాగా ఈ పాటను స్వయంగా ధనుష్ రాసి, ఆలపించగా, యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందించాడు. ప్రభుదేవా కొరియోగ్రఫీని అందించారు. యూట్యూబ్ రికార్డుల్లో 7వ స్థానాన్ని సొంతం చేసుకుంది.

ఈ రౌడిబేబీతో పాటు ధన్వీ భనుషాలి పాడిన వస్తే, టోని కక్కర​ పాడిన ‘కో కో లా’, ‘ధీమే ధీమే’ పాటలు, అజిత్‌ సింగర్‌ పాడిన ‘వే మాహి’ కూడ ఈ ట్రెండింగ్‌ జాబితాలో ఉన్నట్లు యూట్యూబ్‌ వెల్లడించింది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 3 =