తమిళ్ టాలెంటెడ్ నటుడు ధనుష్ హీరోగా వెట్రిమారన్ దర్శకత్వంలో వచ్చిన ‘అసురన్’ మూవీ ఎంత సూపర్ హిట్ అయిందో తెలిసిందే. చాలా తక్కువ బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా ధనుష్ కెరీర్ బెస్ట్ మూవీగా నిలిచింది. ఇక ఈ సినిమాను ఇప్పుడు తెలుగులో కూడా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ రీమేక్ లో వెంకటేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. ఇక వెంకటేష్ పక్కన శ్రేయ శరణ్ ను ఎంపిక చేసే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇక ఈ సినిమాకు డైరెక్టర్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలుతీసుకున్నారు. ఎంతో మంది పేర్లను పరిగణలోకి తీసుకొని ఫైనల్ గా శ్రీకాంత్ అడ్డాలకి ఫిక్స్ అయ్యారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఇప్పుడు తాజాగా మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది. సురేష్ బాబు చిన్న కుమారుడు, రానా తమ్ముడు అభిరామ్ కూడా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నట్టు గతకొద్ది రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే కదా. అయితే ఇప్పుడు ఈ రీమేక్ తోనే అభిరామ్ ను తెలుగు తెరకు పరిచయం చేయాలని చూస్తున్నాడట సురేష్ బాబు. కథ ప్రకారం….వెంకటేష్ కు ఇధ్దరు కుమారులు ఉంటారు. వాళ్ళది ఫుల్ లెంగ్త్ పాత్రే. అందుకే అందులో పెద్ద కొడుకు పాత్ర కోసం అభిరామ్‌ని తీసుకోవాలని చూస్తున్నారట. లేదా ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే యంగ్ వెంకటేష్ పాత్రలో అయినా అభిరామ్ ను తీసుకోవాలనుకుంటున్నారట. మరి దీనిపై క్లారిటీ రావాలంటే అధికారిక ప్రకటన వచ్చేంత వరకూ వెయిట్ చేయాల్సిందే.
కాగా అసురన్ తెలుగు వర్షన్‌ను సురేష్ ప్రొడక్షన్స్, వి క్రియేషన్స్ సంస్థల్లో సురేష్ బాబు, కళైపులి ఎస్ థాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమాను త్వరలో సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























