బాలయ్య – బోయపాటి సినిమాలో…?

Rashmi Gautam In Balakrishna And Boyapati Srinu Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Movie Updates,Rashmi Gautam Latest News,Heroine Rashmi Gautam New Movie News,Rashmi Gautam Next Film With Balakrishna,Rashmi Gautam Latest Movie With Hero Balakrishna

కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా ‘రూలర్’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.రీసెంట్ గా షూటింగ్ ను పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేసుకుంటుంది. హ్యాపీ మూవీస్ ప‌తాకంపై ప్ర‌ముఖ నిర్మాత సి.క‌ళ్యాణ్ నిర్మిస్తున్న ఈ సినిమాను చిరంత‌న్ భ‌ట్ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈ సినిమాను క్రిస్మస్ పండుగ కానుకగా ఈ సినిమాను డిసెంబర్ 20వ తేదీన రిలీజ్ చేయనున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా ఈ సినిమా తర్వాత బాలకృష్ణ బోయపాటి దర్శకత్వంలో చేయడానికి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను రీసెంట్ గానే లాంచ్ చేశారు. ఇక ఈ సినిమాలో ఇప్పటికే బాలకృష్ణ పక్కన కీర్తి సురేష్ ను తీసుకున్నట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ సినిమాలో జబర్దస్త్ ద్వారా పాపులర్ అయ్యి అనేక సినిమాల్లో ప్రధాన పాత్ర పోషించిన యాంకర్ రేష్మి గౌతమ్ నటిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ మేరకు రేష్మితో బోయపాటి ఇప్పటికే చర్చలు జరిపారని తెలుస్తోంది. ఈ సినిమాలో ఆమె నెగిటివ్ రోల్ పోషిస్తున్నట్టు తెలుస్తుంది. మరి దీనిపై క్లారిటీ రావాలంటే మాత్రం అధికారిక ప్రకటన వచ్చేంత వరకూ ఆగాల్సిందే.

మరి ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సింహా, లెజెండ్ సూపర్ హిట్ అవ్వగా.. ఇపుడు హ్యాట్రిక్ మూవీకి రెడీ అవుతున్నారు. చూద్దాం మరి హ్యాట్రిక్ కొడతారేమో..

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five + four =