ఫైనల్ గా థియేటర్స్ కి వస్తున్న ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’

సంచలన దర్శకుడైన రామ్ గోపాల్ వర్మ ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ అనే మరొక వివాదస్పద సినిమా తో వస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో తెరకెక్కిస్తున్న ఈ సినిమా టైటిల్ ఎనౌన్స్‌మెంట్‌ దగ్గర నుంచే వివాదాస్పదమైంది. వివాదాలు తలెత్తడంతో అమ్మరాజ్యంలో కడప బిడ్డలు అనే టైటిల్ ను కూడా మార్చారు. ఇక సినిమా రిలీజ్ కు కూడా ఇబ్బందులు వచ్చిన సంగతి తెలిసిందే. సినిమా విడుదలకు హైకోర్ట్ స్టే ఇవ్వడంతో రిలీజ్ కూడా లేట్ అయింది. ఇక ఇప్పుడు వివాదాలను తొలగించుకొని రిలీజ్ కు సిద్ధమైంది. డిసెంబర్ 12వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా తన శిష్యుడు సిద్దార్ధ తాతోలు దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ సినిమాను అజయ్ మైసూర్ సమర్పణ లో టైగర్ కంపెనీ ప్రొడక్షన్ బ్యానర్ పై ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో చంద్రబాబు పవన్‌ కళ్యాణ్, కేఏ పాల్‌లను పోలిన నటులు నటిస్తుండగా.. జగన్‌ పాత్రలో రంగం ఫేం అజ్మల్‌ అమీర్‌ ఇంకా అలీ, బ్రహ్మానందం నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా టీజర్, ట్రైలర్, సాంగ్స్ తో సంచలనం సృష్టించిన ఈ సినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే సినిమా రిలీజ్ వరకూ ఆగాల్సిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × two =