సల్మాన్, సోనాక్షి సిన్హా జంటగా ప్రభుదేవా దర్శకత్వంలో ‘దబాంగ్ 3’ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. దబాంగ్ మూవీ సిరీస్ లో భాగంగా దబాంగ్ 3 తెరకెక్కిస్తున్నారు. ఇక ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీ గా వుంది. దేనిలో భాగంగానే ఇప్పటికే ఈ సినిమా నుండి టీజర్ ను ట్రైలర్ ను రిలీజ్ చేయగా వాటికీ మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను పోస్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాను డిసెంబర్ 20 వ తేదీన రిలీజ్ చేయనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా సల్మాన్ ఖాన్ ఫిల్మ్స్, అర్భాజ్ ఖాన్ ప్రొడక్షన్స్, సఫ్రాన్ బ్రాడ్ కాస్టింగ్ &మీడియా లిమిటెడ్ బ్యానర్స్ పై నిర్మిస్తున్నారు. మరి హిందీలో వరుస ఫ్లాపుల్లో ఉన్న సల్మాన్ ఖాన్‌కు ప్రభుదేవా దర్శకత్వంలో చేసిన ‘వాంటెడ్’ సినిమాతో సూపర్ సక్సెస్ అందించాడు. తెలుగులో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన ‘పోకిరి’ సినిమాకు రీమేక్ అది. ఈ చిత్రం తర్వాత సల్మాన్ వెనుదిరిగి చూసుకోలేదు. ఇపుడు చాలా ఏళ్ల తర్వాత ఈ సినిమా వస్తుంది. అంతే కాదు ఈ సినిమాతో పాటు తాజాగా వీళ్లిద్దరు హాట్రిక్ మూవీ చేయడానికి రెడీ అయ్యారు. ‘రాధే’ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాను వచ్చే ఈద్‌కు రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించాడు. మరి చూద్దాం ఈ సినిమా ఎంత వరకూ సక్సెస్ అవుతుందో..
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: