`యూ ట‌ర్న్` రీమేక్ లో తాప్సీ?

taapsee-plays-lead-role-in-u-turn-hindi-remake

ద‌క్షిణాదిన సెన్సేష‌న్ క్రియేట్ చేసిన మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ `యూ ట‌ర్న్`… ఇప్పుడు హిందీ బాట ప‌డుతోంది. క‌న్న‌డ‌, తెలుగు -త‌మిళ వెర్ష‌న్స్ కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ప‌వ‌న్ కుమార్… బాలీవుడ్ వెర్ష‌న్ కి కూడా ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నాడు. కాగా… క‌న్న‌డంలో శ్ర‌ద్ధా శ్రీ‌నాథ్, తెలుగు – త‌మిళ భాష‌ల్లో స‌మంత పోషించిన ఇన్వెస్టిగేటివ్ జ‌ర్న‌లిస్ట్ ర‌చ‌న పాత్ర‌ని హిందీలో తాప్సీ చేయ‌నుంద‌ని టాక్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

వాస్త‌వానికి, హిందీ వెర్ష‌న్ కోసం కూడా సామ్ ని సంప్ర‌దించినా… సామ్ ఆస‌క్తి క‌న‌బ‌ర‌చ‌లేద‌ని వినికిడి. ఈ నేప‌థ్యంలోనే… ప్ర‌స్తుతం ఈ త‌ర‌హా చిత్రాల‌కు బెస్ట్ ఆప్ష‌న్ గా నిలుస్తున్న తాప్సీతో యూనిట్ చ‌ర్చ‌లు జ‌రిపింద‌ట‌. తాప్సీ కూడా ఈ ప్రాజెక్ట్ పై ఆస‌క్తి చూపిస్తోందని స‌మాచారం. ప్ర‌ముఖ నిర్మాత ఏక్తా క‌పూర్ `యూ ట‌ర్న్` హిందీ వెర్ష‌న్ ని నిర్మిస్తార‌ని తెలిసింది. త్వ‌ర‌లోనే `యూ ట‌ర్న్` హిందీ రీమేక్ కి సంబంధించి మ‌రిన్ని వివ‌రాలు వెల్ల‌డ‌య్యే అవ‌కాశ‌ముంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × five =