రియల్ లైఫ్ మేనమామ, మేనల్లుడు విక్టరీ వెంకటేష్, యువ సామ్రాట్ నాగచైతన్య రీల్ లైఫ్‌లోనూ అవే పాత్రల్లో నటించిన చిత్రం `వెంకీమామ`. బాబీ (కె.యస్. రవీంద్ర) దర్శకత్వం వహించిన ఈ సినిమాని డి.సురేష్ బాబు, టీజీ విశ్వప్రసాద్ సంయుక్తంగా నిర్మించారు. కాగా, ఈ నెల 13న వెంకటేష్ పుట్టినరోజు సందర్భంగా ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ప్రేక్షకుల ముందుకు రానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉంటే… `యు/ఎ` సర్టిఫికేట్ పొందిన `వెంకీమామ` 149 నిమిషాల (2 గంటల 29 నిమిషాలు) నిడివితో థియేటర్లలో సందడి చేయనుంది. ఒక విధంగా ఇది రీజనబుల్ డ్యూరేషన్ అనే చెప్పాలి. మరి… రెండున్నర గంటల పాటు మామాఅల్లుళ్ళు పంచే వినోదం ఎలా ఉంటుందో తెలియాలంటే మరో మూడు రోజులు వేచిచూడాల్సిందే.
వెంకీకి జోడీగా పాయల్ రాజ్ పుత్, చైతూకి జంటగా రాశీఖన్నా నటించిన `వెంకీమామ`కి థమన్ బాణీలు అందించాడు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: