ప్ర‌భాస్ కోసం శంక‌ర్ స్క్రిప్ట్?

sensational-director-shankar-prepares-movie-script-for-prabhas

`బాహుబ‌లి` సిరీస్ తో జాతీయ‌స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్. ఇక `సాహో`తో అయితే బాలీవుడ్ లో మ‌రోసారి స‌త్తా చాటాడు. పాన్ ఇండియా స్టార్ గా ముందుకు సాగుతున్న ప్ర‌భాస్ కోసం ప‌లువురు అగ్ర ద‌ర్శ‌కులు వేచిచూస్తున్నారు. వారిలో `రోబో` శంక‌ర్ ఒక‌రు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్ర‌స్తుతం లోక నాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్ తో `ఇండియ‌న్ 2`ని తెర‌కెక్కిస్తున్న శంక‌ర్… ఆ త‌రువాత మ‌రో పాన్ ఇండియా మూవీని ప్లాన్ చేస్తున్నాడ‌ట‌. అంతేకాదు… త‌న శైలికి త‌గ్గ‌ట్టుగానే సోష‌ల్ మెసేజ్ తో స్క్రిప్ట్ తయారు చేస్తున్నాడ‌ని… ముఖ్యంగా ఈ స్క్రిప్ట్ ని ప్ర‌భాస్ ని దృష్టిలో పెట్టుకుని డిజైన్ చేస్తున్నాడ‌ని కోలీవుడ్ టాక్. అలాగే… `బాహుబ‌లి`ని మించిన బ‌డ్జెట్ తో ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఉంటుంద‌ని వినికిడి. మ‌రి… శంక‌ర్, ప్రభాస్ కాంబినేష‌న్ ఎంత‌వ‌ర‌కు వ‌ర్క‌వుట్ తెలియాలంటే కొన్నాళ్ళు ఆగాల్సిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen − eleven =