రామ్ గోపాల్ వర్మ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో వస్తున్నాడు. ఇప్పటికే ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ సినిమాతో వస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఏపీలో వున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించాడు. అయితే ఈ సినిమాపై ఇప్పటికే పెద్ద దుమారం రేగగా ఈ సినిమా టైటిల్ ను కూడా మార్చుకోవాల్సి వచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ సినిమాతో పాటు మరో సినిమాతో వస్తున్న సంగతి తెలిసిందే. ఈసారి ఏకంగా ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ ‘ఎంటర్ ది గర్ల్ డ్రాగన్’ అనే ఇండో చైనీస్ సినిమాతో సర్ప్రైజ్ చేస్తున్నాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టాడు వర్మ. ఇప్పటికే ఈ సినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇన్ని రోజులకు వర్మ ఒక మంచి సినిమాతో వస్తున్నాడన్న ప్రశంసలు దక్కాయి. ఇప్పుడు తాజాగా ట్రయిలర్ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసారు. డిసెంబర్ 13వ తేదీన ట్రయిలర్ రిలీజ్ కు ముహూర్తం ఫిక్స్ చేసారు. అంతే కాదు ఈ ట్రైలర్ను బ్రూస్లీ పుట్టిన చైనాలోని ఫోషాన్ సిటీలో రిలీజ్ చేయనున్నారు.
The international trailer of ENTER THE GIRL DRAGON to release in Bruce Lee’s native place Foshan city,China on Dec 13 th #EnterTheGirlDragon #BruceLeeGirl pic.twitter.com/ym8tgriK0g
— Ram Gopal Varma (@RGVzoomin) December 10, 2019
కాగా ఇండో చైనా టూరిస్ట్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాతో పూజా బాలేకర్ తెలుగు తెరకు పరిచయమవుతోంది. ఇండో-చైనా సంయుక్త ప్రోడక్షన్లో ఈ సినిమాని నిర్మిస్తున్నారు. అంతేకాదు ఇండియాలోనే మొదటి మార్షల్ ఆర్ట్స్ సినిమా ఇది. మరి చూద్దాం ఈ సినిమా ఎలా ఉంటుందో..
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: