“బాహుబలి “, “బాహుబలి 2” బ్లాక్ బస్టర్ మూవీస్ తో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియన్ స్టార్ డమ్ పొందారు. దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్న ప్రభాస్ కు పర్టిక్యులర్ గా నార్త్ ఇండియా లో ఎక్కువ క్రేజ్ఉంది . హీరో ప్రభాస్ నటించిన భారీ బడ్జెట్ , స్టైలిష్ మూవీ “సాహో ” ఉత్తరాది లో ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. పలువురు బాలీవుడ్ నిర్మాత , దర్శకులు ప్రభాస్ తో మూవీస్ నిర్మించాలని ఎదురుచూస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
బ్లాక్ బస్టర్ మూవీస్ “శివాజీ “, “రోబో “, “2.0” వంటి భారీ బడ్జెట్ చిత్రాలను రూపొందించిన తమిళ దర్శకుడు శంకర్ దర్శకత్వం లో ప్రభాస్ హీరోగా ఒక పాన్ ఇండియన్ మూవీ రూపొందనుందని సమాచారం. దర్శకుడు శంకర్ ప్రస్తుతం “భారతీయుడు 2” మూవీ కి దర్శకత్వం వహిస్తున్నారు. మెసేజ్ తో కూడిన మూవీస్ రూపొందించే శంకర్ , ప్రభాస్ కు మెసేజ్ తో కూడిన ఒక స్క్రిప్ట్ ను రూపొందిస్తున్నారని , “బాహుబలి ” మూవీ ని మించి భారీబడ్జెట్ తో ఈ మూవీ రూపొందనుందని సమాచారం. ఈ భారీ బడ్జెట్ మూవీ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ (దిల్ రాజు ) బ్యానర్ లో రూపొందే అవకాశం ఉంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: