సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా వరుస విజయాలతో తన సత్తా చాటుతున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఇప్పుడు కొరటాల కాంబినేషన్ లో కొత్త సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరుపుకుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా డిసెంబర్ నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది. అప్పుడే ఒక పాటకు మణిశర్మ ట్యూన్ కూడా కట్టినట్టు తెలుస్తుంది
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి వినిపిస్తుంది. ఈ సినిమా షూటింగ్ ఎక్కువ భాగం శ్రీకాకుళంలో జరుగుతుందట. అంతే కాదు ఈసినిమాలో మెగాస్టార్ ఒక ప్రభుత్వ ఉద్యోగిగా కనిపిస్తూనే సీక్రెట్ నక్సలైట్ గా కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.
కాగా కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మించనున్న ఈ సినిమాలో ఒక హీరోయిన్ గా త్రిష ను సెలెక్ట్ చేసినట్టు ఇప్పటికే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. మణిశర్మ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: